Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. సహచర అధికారిపైనే దౌర్జన్యమా?
ADVERTISEMENT 

సహచర అధికారిపైనే దౌర్జన్యమా?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 30, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hc.jpg

మా ఆదేశాలకు విరుద్ధంగా బాధ్యతలు తీసుకుంటారా?

ఆ స్థానంలో ఉన్న అధికారిపై దౌర్జన్యం చేస్తారా?

ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ఈ చర్యలు సర్వీసు నిబంధనలకు విరుద్ధం

దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం

సుమోటో ప్రతివాదులుగా కలెక్టర్, ఎస్పీ తదితరులు

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి

హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు

జిల్లా సైనిక వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నియామకంపై వివాదం

సాక్షి, అమరావతి: సహచర ప్రభుత్వాధికారిపట్ల మరో అధికారి దురుసుగా, దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. తామిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మజ్జి కృష్ణారావు జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (జెడ్‌ఎస్‌డబ్ల్యూఓ)గా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నించడమే కాక, ఆ స్థానంలో ఉన్న మరో అధికారి కేవీఎస్‌ ప్రసాదరావుపట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంపై మండిపడింది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చిచెప్పింది.

ఈ చర్యలు ఏపీ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధమని స్పష్టంచేసింది. ఈ 21వ శతాబ్దంలో, ప్రజాస్వామ్య పాలన వ్యవస్థలో అధికారుల దౌర్జన్యపూరిత, అరాచక ప్రవర్తనను సహించేదేలేదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ వ్యాజ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ను సుమోటో ప్రతివాదులుగా చేర్చింది. 

తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు జెడ్‌ఎస్‌డబ్ల్యూఓగా కేవీఎస్‌ ప్రసాదరావు కొనసాగేలా చూడాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌లను హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులను తమ ముందుంచాలని సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ను ఆదేశించింది. అలాగే, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మజ్జి శ్రీనివాసరావును ఆదేశించింది. 

తదుపరి విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చట్టం దృష్టిలో విజయనగరం జెడ్‌ఎస్‌డబ్ల్యూఓగా ప్రసాదరావే కొనసాగుతున్నారని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

అక్కడ సైనిక వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా నేనే ఉంటా..
విజయనగరం జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మజ్జి కృష్ణారావును తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కేవీఎస్‌ ప్రసాదరావును నియమించారు. అయితే, కృష్ణారావు కాకినాడలో రిపోర్ట్‌ చేయలేదు. జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ అధికారిగా బాధ్యతలు కూడా చేపట్టలేదు. ఈ వ్యవహారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ జోక్యం చేసుకున్నారు. దీంతో.. కృష్ణారావును విజయనగరంలోనే కొనసాగించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. 

ఈ ప్రొసీడింగ్స్‌ను సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ అమలుచేయడం లేదంటూ మజ్జి కృష్ణారావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ప్రొసీడింగ్స్‌ అమలుకు చర్యలు తీసుకోవాలని సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

20 మందితో ప్రసాదరావును బయటకు తోసేసిన కృష్ణారావు..
ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ విజయనగరం జెడ్‌ఎస్‌డబ్ల్యూఓగా నియమితులైన కేవీఎస్‌ ప్రసాదరావు ఈనెల 26న ధర్మాసనం ముందు అత్యవసరంగా అప్పీల్‌ దాఖలుచేశారు. కృష్ణారావు తనను ప్రతివాదిగా చేర్చకుండానే పిటిషన్‌ దాఖలుచేసి, తనకు తెలియకుండానే తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు పొందారని ప్రసాదరావు ధర్మాసనానికి నివేదించారు. 

ఈ అప్పీల్‌పై ఈనెల 27న విచారణ జరిపిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంలో యథాతథస్థితి కొనసాగించాలంటూ ప్రభుత్వ న్యాయవాది, ప్రసాదరావు, కృష్ణారావు తరఫు న్యాయవాదుల సమక్షంలో ఉత్తర్వులు జారీచేసింది. 

ఇదే సమయంలో కృష్ణారావు దౌర్జన్యపూరితంగా 20 మందితో కలిసి ప్రసాదరావు ఛాంబర్‌కు వెళ్లి అతన్ని సీటు నుంచి లేపి బలవంతంగా బయటకు తోసేసిన విషయం కూడా ధర్మాసనం దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై ప్రసాదరావు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు అతని తరఫు న్యాయవాది వివరించారు.

కృష్ణారావు చర్యలు నిబంధనలకు విరుద్ధం..
ప్రసాదరావు అప్పీల్‌పై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. విజయనగరం జెడ్‌ఎస్‌డబ్ల్యూఓగా కృష్ణారావు 27వ తేదీ మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారని ప్రభుత్వ న్యాయవాది ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. డైరెక్టర్‌ సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ మేర జెడ్‌ఎస్‌డబ్ల్యూఓగా బాధ్యతలు తీసుకున్నారని కృష్ణారావు తరఫు న్యాయవాది వివరించారు. 

ఆ ప్రొసీడింగ్స్‌ను ఇప్పటివరకు తనకు అందచేయలేదని, అందువల్ల తనను విజయనగరం జెడ్‌ఎస్‌డబ్ల్యూఓగా రిలీవ్‌ చేయడమన్న ప్రశ్నే తలెత్తదని ప్రసాదరావు న్యాయవాది జయంతి ఎస్‌సీ. శేఖర్‌ వివరించారు. నిబంధనల ప్రకారం ఎవరైనా అధి కారి ఓ స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ అయినప్పుడు అతన్ని రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని.. అయితే ప్రస్తుత కేసులో అలాంటి విధానాన్ని అనుసరించలేదని ప్రభుత్వ న్యా­యవాది అంగీకరించారు.

స్టే­ట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం కృషా­్ణరావు నడుచుకోలేదని వివరించా­రు. దీంతో.. కృష్ణారావు తీరును ధర్మాసనం తీవ్రంగా పరిగణించి ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Andhra Pradesh High Court
krishna rao
Prasada Rao
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.