Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. డిగ్రీ ప్రవేశాలపై గందరగోళం
ADVERTISEMENT 

డిగ్రీ ప్రవేశాలపై గందరగోళం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 26, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ddd.jpg

జూన్‌ ముగుస్తున్నా మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం

సింగిల్‌ మేజర్‌ స్థానంలో డ్యూయల్‌ మేజర్‌ అమలుపై సందిగ్ధత

నెల రోజుల కిందట అకడమిక్‌ ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ డ్యూయల్‌ మేజర్‌ సిఫారసులు

తీవ్ర జాప్యంలో కళాశాలల నుంచి అభిప్రాయ సేకరణ

ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి మధ్య కొరవడిన సమన్వయం లోపం 

ఉన్నత విద్యను గాలికొదిలేశారంటూ మంత్రి లోకేశ్‌పై విమర్శలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ విద్య ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై.. జూన్‌ నెల ముగిసి­పో­తున్నా ప్రవేశాల నిర్వహణపై స్పష్టత కొరవ­డింది. ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ మధ్య కొరవడిన సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి అకడమిక్‌ వ్యవ­హారాల్లో విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా మండలి పాత్ర కీలకంగా ఉంటుంది. వీటిల్లో ప్రభు­త్వ జోక్యం చాలా తక్కువే! కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో సమస్య ఎంతకీ తెగక­పో­వడం గమనార్హం. 

మరోవైపు తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు ముగింపు దశలో ఉండగా ఈ నెలాఖరు నుంచి తొలి ఏడాది తరగతులను ప్రారంభించనుంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఏపీ­లో ప్రవేశాల ఊసే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. తెలంగాణాలో ‘దోస్త్‌’ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలు చేపడితే.. ఏపీ తిరోగమనంలో ఆన్‌లైన్‌ ప్రవేశాల రద్దుకు ముందుకెళ్తోంది. ఉన్నత విద్యా­శా­ఖలో బహిరంగంగా ఇంత జరుగుతుంటే విద్యా­శాఖ మంత్రి లోకేశ్‌ తన శాఖను గాలికొదిలేసి వ్యవ­హరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అభిప్రాయ సేకరణలో తీవ్ర జాప్యం 
కూటమి సర్కారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలపై ఆది నుంచి విషం కక్కుతూనే ఉంది. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్‌ మేజర్‌ను తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సర్కారు ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ డ్యూయల్‌ మేజర్‌ విధానాన్ని సిఫారసు చేసింది. నెల రోజుల కిందట ఈ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ ఇచ్చింది. కళాశాలల నుంచి కోర్సు కన్వర్షన్‌ కోసం దరఖాస్తులనూ ఆహ్వానించింది. అయితే, డ్యూయల్‌ మేజర్‌పై ఉన్నత విద్యాశాఖ నోట్‌ రూపంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనికి ఇప్పటికీ అతీగతీ లేదు. 

ఇప్పుడు, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డిగ్రీ కళాశాలలకు వెళ్లి విద్యార్థులు, లెక్చరర్ల నుంచి అభిప్రాయాలు సేకరించడం చర్చనీయాంశమైంది.  కమిటీ సిఫారసులు చేసిన ఇన్ని రోజుల తర్వాత అభిప్రాయ సేకరణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

గతంలోని ట్రిపుల్‌ మేజర్‌ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సింగిల్‌ మేజర్‌ విధానాన్ని రద్దు చేసి డ్యూయల్‌ మేజర్‌ను అమలు చేస్తే.. ఏపీలో డిగ్రీ చదివిన విద్యార్థులు మూడు రకాల డిగ్రీ పట్టాలతో కనిపిస్తారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతుందని కొందరు అధికారులు వాదిస్తున్నారు. అందుకే సింగిల్‌ మేజర్‌ విధానంలో పొరపాట్లను సవరించి కొనసాగించాలని చెబుతున్నారు.  

అఫిలియేషన్‌ ప్రాసెస్‌ ఎక్కడ?
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అఫిలి­యేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గతంలో ఈ ప్రక్రియ ఉచితమే. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ సాంకేతిక విభాగం డబ్బులు ఇస్తే తప్ప చేయబోమని తెగేసి చెబుతోంది. ఒక్కో కళాశాల రూ.3,500 చెల్లించాల్సి ఉంది. 

డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా.. అన్ని కళాశాలలు వర్సిటీల నుంచి అఫిలియేషన్‌ పొందాల్సి ఉండగా.. ప్రక్రియ నిధులతో ముడి­పడి ఉండటంతో తీవ్ర జాప్యం జరుగు­తోంది. దీనికి తోడు కళాశా­లలను సింగిల్‌ మే­జర్‌ నుంచి డ్యూయల్‌ మేజర్‌కు కన్వర్ట్‌ చేయ­డానికి సమయం పడుతుంది. వీటన్నింటి ఫలి­తం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

కళాశాలలకు నోటీసులు..
ప్రస్తుతం 1300 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందులో గత మూడేళ్లలో 270 కళాశాలల్లో 25శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉన్నాయి.  సున్నా ప్రవేశాలు ఉన్నవి 3 కళా­శా­లలు ఉన్నాయి. వీటికి ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక కమిటీ ఎదుట ఆయా కళాశాలలు వివరణ ఇవ్వా­లని ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిస్తే తప్ప ఆ  కళాశాలలకు అనుమతులు విషయం తేలదు. 

వీటితోపాటు కొత్తగా నియోజకవర్గ, మండల హెడ్‌ క్వార్టర్‌లో కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. డిగ్రీ విద్యలో 4.55 లక్షల సీట్లు ఉంటే పట్టుమని 39 శాతం సీట్లు కూడా భర్తీ కావట్లేదు. ఇలాంటి తరుణంలో కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
degree admissions
Education Department
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.