Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. చదువుల విప్లవానికి తూట్లు.. సర్కారు ప్రచార పాట్లు
ADVERTISEMENT 

చదువుల విప్లవానికి తూట్లు.. సర్కారు ప్రచార పాట్లు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 8, 2024 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
banner.jpg
  • మెగా పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌ అంటూ మెగా దగా
  • ‘తల్లికి వందనం’ అంటూ ఊరూరా ఊదరగొట్టి ఇప్పుడు కిమ్మనని నేతలు
  • ఒక్కొక్కరికి రూ.20 వేలు.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామని హామీ     
  • గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచిన తొలి రోజే విద్యా కానుక అందజేత
  • ఇప్పుడు 6 నెలలు గడిచినా అరకొరగా పంపిణీ  
  • ఐబీ, టోఫెల్‌ను అటకెక్కించిన కూటమి సర్కారు..  ఇంగ్లిష్‌ మీడియంపైనా అక్కసు.. సీబీఎస్‌ఈకి మంగళం 
  • ఏటా పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్‌ తరగతులు, సబ్జెక్ట్‌ టీచర్లు హుళక్కే
  • ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ‘ప్రైవేటు’కు మేలు చేసే కుట్ర..  ఈ ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌కు వలస 
  • విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో టీచర్లకు స్థాన చలనం..  గ్రామీణ ప్రాంత స్కూళ్లు మూతపడే పరిస్థితి తీసుకొచ్చిన వైనం 
  • పేద పిల్లలపై వివక్ష చూపుతున్న ప్రభుత్వం..  ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారో తెలియని దుస్థితి 
  • ఏజెన్సీల మార్పుతో గందరగోళం.. నాణ్యత లేని మధ్యాహ్న భోజనం 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చదువుల వెలుగులతో ప్రకాశించిన సర్కారీ బడులకు ఇప్పుడు చంద్ర గ్రహణం పట్టింది. నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ అందించాలనే ఉన్నత ఆశయంతో వైఎస్‌ జగన్‌ తెచ్చిన సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్‌ మీడియం, టోఫెల్, ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌­(ఐబీ), పిల్లలకు ఏటా ట్యాబ్స్, డిజిటల్‌ తరగతులు, సబ్జెక్టు టీచర్లు  వంటి వాటికి చంద్రబాబు సర్కారు మంగళం పాడుతోంది. 

ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి.. ప్రవేట్‌కు ధారాదత్తం చేయడం ద్వారా తన వాళ్లకు మేలు చేసేందుకు కుట్ర పన్నింది. పేద విద్యార్థులు అంతర్జాతీ­యంగా రాణించాలన్న గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తూ అద్భుత పథకా­లను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లల బంగారు భవిత కోసం వైఎస్‌ జగన్‌ గొప్ప సంస్కరణలతో బాటలు వేస్తే.. చంద్రబాబు ప్రభు­త్వం వాటికి గండి కొడుతోంది. నాణ్యమైన చదువుల విప్లవానికి తూట్లు పొడుస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నాడు–­నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం బాగు పరిస్తే.. ఇప్పుడు తామొచ్చాకే వాటిని ఉద్దరిస్తున్నట్లు కూటమి సర్కారు కలరింగ్‌ ఇస్తోంది. ఇందులో భాగంగా మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్స్‌ పేరిట ఆర్బాటాలకు తెరలేపింది. 

మరోవైపు గత ప్రభు­త్వంలో అమలైన ఒక్కో కార్యక్ర­మాన్ని తెరమ­రుగు చేస్తోంది. బడిఈడు ఉన్న ప్రతి ఒక్కరినీ బడికి పంపేలా ప్రోత్సహిస్తూ వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన అమ్మ ఒడి స్థానంలో తల్లికి వందనం పథ­కాన్ని అమలు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేక పోయింది. ‘జగన్‌ రూ.15 వేలు ఇస్తున్నారు.. మేమొస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం’అని నమ్మించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ హామీని అమలు చేయకుండా మోసం చేసింది.

సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్,ఐబీ శిక్షణకు మంగళం పాడింది. ప్రైవేట్‌ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా తెర వెనుక మంత్రాంగం నడిపిస్తూ పైకి మాత్రం ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం పాటు పడుతున్నట్లు గొప్ప­లు చెప్పుకుంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకా­యిలు చెల్లించక పోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఓ వైపు ఇక్కట్లు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి­స్తోంది. ఆరు నెలలుగా విద్యా రంగం అభివృద్ధికి చేసిందేమీలేక పోగా.. గత ప్రభుత్వం తెచ్చిన చదువుల విప్లవాన్ని తన ఖాతాలో జమ చేసుకునేందుకు మాత్రం పావులు కదిపింది.  

సీబీఎస్‌ఈకి మంగళం 
» గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది.. తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్‌ జగన్‌ సర్కారు వెయ్యి ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్‌ మీడియం రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన చంద్రబాబు అన్నంత పని చేశారు. 

»   2023–24 విద్యా సంవత్సరం నుంచి  ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అందుబా­టు­లోకి తెచ్చింది.  అయితే ఇటీవల పదో తరగతి విద్యా­ర్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో ట్యాబ్స్‌ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్, పెన్‌ విధా­నంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యా­ర్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.

‘టోఫెల్‌’ రద్దు 
» పదో తరగతి, ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరంలో జగన్‌ ప్రభుత్వం టోఫెల్‌ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్‌ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్‌ జూనియర్‌ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. 

»  నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్‌)లు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన టోఫెల్‌ జూనియర్‌ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,285 మ­ందికిగాను 4,17,879 మంది (82 శాతం) విద్యా­ర్థులు పరీక్ష రాశారు. 

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్‌ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా పోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫె­ల్‌ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. 

ఐబీ శిక్షణకూ అదే గతి 
»  ‘టోఫెల్‌ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’ అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే కూటమి ప్రభుత్వం టోఫెల్‌ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది.

»  అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్‌ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్‌ ప్రభుత్వ పాఠ­శాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపో­యింది. వాస్తవానికి ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్‌పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్ని తొలగించడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. 

కిట్లు పంపిణీలోను కూటమి కునికిపాట్లు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్కూళ్లు తెరిచిన రోజునే పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, బూట్లు సక్రమంగా అందలేదు. స్టూడెంట్‌ కిట్లను అరకొరగా కూటమి నేతలతో పంపిణీ చేయించారు. గతంలో విద్యా కానుక కిట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో వస్తువుల సరఫరాదారు నుంచి పాఠశాలకు చేరే దాకా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేది. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంతా తారుమారైంది.

‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు 
» ప్రభుత్వ తీరు కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్లిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్‌ మీడియంను సైతం రద్దు చేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్‌ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్‌ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు.

» మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ’రేషనలైజేషన్‌’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్‌ పోస్టులను ప్రభు­త్వం రద్దుచేసే అవకాశముందని ఉపా­ధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నా­యి.



స్పష్టతలేని తల్లికి వందనం
» పేద పిల్లల చదువులను ప్రోత్సహించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అద్భుతంగా అందించింది. పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో 2019 జూన్‌లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టడం ద్వారా డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్‌లోనే రూ.15 వేలు చొప్పున అందించింది.

»  2022–23కు సంబంధించి గతేడాది జూన్‌ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం ద్వారా ఏకంగా రూ.26,067.28 కోట్ల సాయం చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్‌లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా, కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. 

»ఇప్పటి వరకు తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించక పోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.  తీరా గద్దె నెక్కాక ఈ పథకం అమలు గురించి మాట్లాడటమే మానేయడం గమనార్హం. ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చిన మేరకు 
‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

బాబు పాలనలోఅట్టడుగున జీఈఆర్‌
చంద్రబాబు గత పాలనలో 2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. 

అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్‌ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్‌ శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది.

భోజన ఏజెన్సీల మార్పు
రాష్ట్రంలో దాదాపు 80 వేలకు పైగా మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో ఏకంగా 46 వేల మందికిపైగా మార్చేసిన కూటమి ప్రభుత్వం.. అతి సామాన్యుల పొట్ట కొట్టింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులను ఇష్టానుసారం మార్చడంతో గందరగోళం ఏర్పడి, విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. కొన్ని చోట్ల కోడిగుడ్లను స్వాహా చేస్తున్నారు. భోజనానికి అందించే బియ్యంలో నాణ్యత లేదు. స్టాండర్డ్‌ మెనూ ఉండటం లేదు. కోడిగుడ్ల సైజు తగ్గింది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
YS Jagan Mohan Reddy
CBSE syllabus
English medium
Chandrababu Naidu
meetings
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.