Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కళ్లెదుటే అభివృద్ధి
ADVERTISEMENT 

కళ్లెదుటే అభివృద్ధి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 13, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jagan111_0.jpg

విజయవాడలో రిటైనింగ్‌వాల్, రివర్‌ ఫ్రంట్‌ పార్కును ప్రారంభించిన సీఎం జగన్‌

రూ.500 కోట్లతో నిర్మించిన కృష్ణా రిటైనింగ్‌ వాల్‌తో వరదల నుంచి నిశ్చింత

రూ.239 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు శంకుస్థాపన

31,866 మంది పేదలకు సంపూర్ణ  హక్కులతో పట్టాలు జారీ  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కళ్లెదుటే ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా రాష్ట్రంలో కొంతమంది మాత్రం ఒప్పుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఏకంగా రూ.400 కోట్లతో అంబేడ్కర్‌ పార్కును మీ కళ్లెదుటే ప్రారంభించి పూర్తి చేశామని గుర్తు చేశారు. గత సర్కారు హయాంలో బెజవాడలో ఓ ఫ్లైఓవర్‌ కూడా పూర్తి కాని దుస్థితి నెలకొనగా మనందరి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్‌లు నిర్మించామని చెప్పారు.

మంగళవారం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్‌ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, కృష్ణా రివర్‌ ఫ్రంట్‌ పార్కు (కృష్ణ జలవిహార్‌)లను ప్రారంభించారు. రూ.239 కోట్లతో నగరంలో ఐదు చోట్ల నిర్మించే మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. õవిజయవాడ పురపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారులకు సీఎం జగన్‌ స్వయంగా వీటిని అందించారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ఏమన్నారంటే..



లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలను అందజేస్తున్న సీఎం జగన్, వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి

31,866 పట్టాల రెగ్యులరైజ్‌... 

ఈరోజు విజయవాడలో వివిధ కేటగిరీలకు సంబంధించి 31,866 పట్టాలను రెగ్యులరైజ్‌ చేసి ఆయా కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 22 ఏ కింద చేర్చడంతో హక్కులు లేక, రిజిస్ట్రేషన్‌ జరగక ఇబ్బంది పడుతున్న దాదాపు 21 వేల మంది వీరిలో ఉన్నారు. ఈ దుస్థితిని తొలగిస్తూ విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్‌లో 16 కాలనీల వాసులకు మంచి చేస్తున్నాం. భ్రమరాంబపురంలో ఇళ్లు కట్టుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు రెగ్యులరైజ్‌ కాకపోవడంతో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్నట్లు అవినాష్‌ నా దృష్టికి తెచ్చాడు. వీటన్నింటికీ పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్‌ జరుగుతోంది. ఎలాంటి వివాదాలు లేని 9,125 పట్టాలను కూడా రెగ్యులరైజ్‌ చేస్తున్నాం.

రూ.400 కోట్లతో అంబేడ్కర్‌ పార్కు

విజయవాడలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేడ్కర్‌ పార్కుకు అందరి కళ్లెదుటే పునాది రాయి వేయడంతోపాటు ప్రారంభించటాన్ని కూడా చూశారు. గతంలో విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు వెళ్లాలంటే ఒక్క ఫ్లై ఓవర్‌ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి 58 నెలల వ్యవధిలో పెండింగ్‌ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో నిర్మించాం. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ కూడా కలిపితే ఇంకో ఫ్లై ఓవర్‌ కూడా సాకారమైంది. ఇవన్నీ మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి.

బెజవాడ ట్రాఫిక్‌ కష్టాలకు విముక్తి

గుంటూరు నుంచి ట్రాఫిక్‌ విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ కష్టాలకు విముక్తి కల్పిస్తూ కాజ నుంచి చిన్న అవుటపల్లి వైపు వెళ్లేలా చేపట్టిన ఔటర్‌ పనుల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. మరో రెండు నెలల్లో దీన్ని ప్రారంభించేలా పనులు జరుగుతున్నాయి. 58 నెలలుగా మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ ప్రతి అడుగూ అభివృద్ధి దిశగా వేస్తున్నాం. మనందరి ప్రభుత్వంలో స్కూళ్లు, హాస్పటళ్లు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో వ్యవసాయం బాగుపడింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా ఎప్పుడూ చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రూపాయి  లంచం లేకుండా వివక్షకు తావులేకుండా అర్హులందరికీ పారదర్శకంగా మేలు చేస్తున్నాం. 

కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, కల్పలతారెడ్డి, మొండితోక అరుణకుమార్, రుహూల్లా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆసిఫ్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పడమట స్నిగ్థ, నీటి పారుదల, మున్సిపల్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశిభూషణ్, శ్రీలక్ష్మి, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీ­రావు, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్, నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఆర్‌డీవో భవాని శంకర్, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.

రూ.500 కోట్లతో కరకట్ట గోడలు..

కృష్ణా నదికి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా దాదాపు రూ.500 కోట్లతో కరకట్ట గోడలు నిర్మించాం. గతంలో వరద వస్తే కృష్ణలంక ప్రాంతం నీట మునిగేది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇలా గోడ కట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. కృష్ణలంక ప్రాంతంలో అక్క­చెల్లెమ్మలు, పిల్లలు, అవ్వలు, తాతలు సాయం­త్రం పూట ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కు సుందరీకరణ పనులు చేపట్టాం.

చిత్తశుద్ధితో నిర్మించారు  

వరద వచ్చినప్పుడల్లా మా ప్రాంతంలోని ఇళ్లు ముంపునకు గురయ్యేవి. దీన్ని పరిష్కరించేందుకు ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. వారధి దిగువనే కాకుండా, ఎగువన కూడా నిర్మించారు. ఎగువ ప్రాంతంలో పార్కు అభివృద్ధి చేస్తాననడం సంతోషంగా ఉంది.     – కసగోని జ్యోతి, రణదివెనగర్‌ 

శాశ్వత పరిష్కారం లభించింది 

రాణిగారితోట తారకరామనగర్‌ కరకట్ట దిగువన కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాం. తుపానులు వచ్చినప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లం. వరద ముంపునకు గురైన మా ప్రాంతాన్ని సీఎం జగన్‌ కళ్లారా చూసి చలించిపోయి గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోడ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించింది.     – ఏలూరి వినయ్, తారకరామనగర్‌  

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం 

మేం 45 ఏళ్లుగా విజయవాడ నందమూరినగర్‌లో ఉంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఒక బీ–ఫారం పట్టా ఉన్న ఇల్లు కొనుక్కున్నాను. అయితే ఎప్పుడు ఎవరొచ్చి ఖాళీ చేయమంటారోనని నిత్యం భయంతో కాలం వెళ్లదీశాను. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి తిండి ఉండేది కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... పోయాయి. ఎప్పటి నుంచో అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ ఫలితం లేకుండా పోయింది. బీ–ఫారం పట్టాకు సంపూర్ణ భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.      – చోడవరపు దుర్గ, నందమూరినగర్, విజయవాడ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YS Jagan Mohan Reddy
irrigation
retaining wall
riverfront
vijayawada
Andhra Pradesh
devineni avinash
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.