Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ముంపు ప్రాంతానికి రక్షణ కవచం
ADVERTISEMENT 

ముంపు ప్రాంతానికి రక్షణ కవచం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 12, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Riverfront_20Park.jpg

విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం 

రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం 

12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదిక 

రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కు 

నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  చేతుల మీదగా ప్రారంభం

లబ్బీపేట (విజయవాడ తూర్పు):  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీ­ల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్‌గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే.

దీంతో వరద మొద­లవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామా­న్ల­తో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్‌ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్‌ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడ­ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి,  రివర్‌ఫ్రంట్‌ పార్కును ప్రారంభించనున్నారు.  

దశాబ్దాలుగా ముంపు సమస్య 

నగరంలో కృష్ణా నది దిగువన ఉన్న ఈ కాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాలు ముంపుకు గురయ్యేవి. వాటిలో తారకరామనగర్, రణ«దీర్‌నగర్, భూపేష్‌ గుప్తా కాలనీలు 3 లక్షల క్యూసెక్కులు వరదకే మునిగిపోయేవి. పోలీస్‌కాలనీ, రామలింగేశ్వర్‌నగర్‌ తదితర ప్రాంతాలు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే ముంపునకు గురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా ఈ సమస్యపై దృష్టి సారించారు. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలని తలంచారు.

తొలి విడతగా రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, తూతూమంత్రంగా నాసిరకంగా చేశారు. దీంతో చిన్నపాటి వరదకే కాలనీలన్నీ మునిగిపోయాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టమైన రక్షణ గోడ నిర్మించి, ఈ కాలనీలకు వరద నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో దశలో రూ. 134.43 కోట్లు వెచ్చించి కోటినగర్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో పద్మావతి ఘాట్‌ నుంచి వారధి వరకు మూడో దశలో రూ.235.46 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. 

ముస్తాబైన రివర్‌ ఫ్రంట్‌ పార్కు 

కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్‌ ట్రాక్, సిట్టింగ్‌ ఏరియా, ఓపెన్‌ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు.

ముంపు సమస్యకు పరిష్కారం  

ఒకప్పుడు కృష్ణానదికి వరద వచ్చిందంటే కరకట్ట ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యేవా­రు. ఇళ్లను కాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది. ఎంతో మంది పాలకులు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిటైనింగ్‌ వాల్‌ను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. తొలుత వారధి దిగువన నిర్మాణం చేపట్టారు. హామీ ఇవ్వని ఎగువ ప్రాంతంలో కూడా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టారు. అంతే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు.  – దేవినేని అవినాష్, వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు ఇన్‌చార్జి

 వరద ప్రాంతాలకు రక్ష   

కృష్ణానది పరివాహక ప్రాంతాలు వర­ద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టింది. రూ. 369.89 కోట్లతో రెండు దశల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలైన రణధీర్‌నగర్, భూపేష్గుప్తా నగర్, తారకరామ నగర్‌ తదితర ప్రాంతాలకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు కృష్ణా నదికి వరద వచ్చినా ముంపు సమస్య ఉండదు. అంతే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కును కూడా అభివృద్ధి చేశాం. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు.– ఎస్‌ డిల్లీరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
YS Jagan Mohan Reddy
construction
retaining wall
vijayawada
riverfront
park
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.