Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. సీమకు సైంధవుడు..
ADVERTISEMENT 

సీమకు సైంధవుడు..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 11, 2024 Sakshi Read Time Read Time: 7 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Seema-Babu2.jpg

చంద్రబాబు నిర్వాకాలపై మండిపడుతున్న సీమ రైతన్నలు

తెలుగుగంగ కెనాల్‌లైనింగ్, బ్రహ్మంసాగర్‌ లీకేజీలపై నాడు మొద్దు నిద్ర

వైఎస్‌ జగన్‌ వచ్చాక రూ.600 కోట్లతో తెలుగుగంగ కెనాల్‌కు లైనింగ్‌

దేశంలోనే తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను మళ్లించకుండా నాడు చంద్రబాబు ద్రోహం చేయగా, నేడు గరిష్టంగా ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి చాటుకుంటున్నారని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతిలో పూర్తి సామర్థ్యం మేరకు నీటి తరలింపు పనులను పూర్తి చేయడంతోపాటు తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు, అవుకు రిజర్వాయర్లు,  గాలేరు–నగరిలో భాగమైన గండికోట, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండలతోపాటు చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని ఇప్పటికే పూర్తి చేయగా రెండో సొరంగం కూడా దాదాపుగా పూర్తి అయింది. నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించడం ద్వారా ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు హక్కుగా దక్కిన జలాలను వాడుకోవడం కోసం రాయలసీమ ఎత్తిపోతలను సీఎం వైఎస్‌ జగన్‌ చేపడితే దానిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారని రైతులు మండిపడుతున్నారు.

శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన చోట కొత్త ప్రాజెక్టులను నిరి్మంచడం కోసం రాయలసీమ కరవు నివారణ పథకం కింద సీఎం జగన్‌ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం గుర్తించేలా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్‌ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

హంద్రీ–నీవా సుజల స్రవంతి..
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.

తన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి సింహ భాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్‌హౌస్‌ నిర్మించిన మహానేత వైఎస్‌.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా నీటిని తరలించేలా ముచ్చుమర్రి ఎత్తిపోతల 2007, ఆగస్టు 31న చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు.  

నాడు అలా..

  • విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22(ప్రైస్‌ ఎస్కలేషన్‌), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2017 జనవరి 3న జాతికి అంకితం చేసిన నాటి సీఎం చంద్రబాబు.. ఇది తన ఘనతే అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.

  • హంద్రీ–నీవా అంతర్భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేందకు చేపట్టిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమే‹Ùకు కట్టబెట్టిన చంద్రబాబు.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు.

  • మహానేత వైఎస్‌ పూర్తి చేసిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా టీడీపీ హయాంలో ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా సీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేశారు.

నేడు ఇలా..

  • వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక.. శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు.

  • హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు.

  • హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో మిగిలిన పనులను పూర్తి చేసి.. ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు.  ప్రతి ఏటా డిజైన్‌ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారు.

తెలుగు గంగ..
శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్‌ కడప(1.67 లక్షల ఎకరాలు), ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు) కలిపి మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది తెలుగుగంగ ప్రాజెక్టు ఉద్దేశం.  

నాడు అలా...

  • పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఎస్సార్‌ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కలువ) ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు చేరే జలాల్లో 15 వేల క్యూసెక్కులను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌కు తరలించేలా 7.8 కి.మీ. పొడవున తవ్విన లింక్‌ కెనాల్‌కు లైనింగ్‌ చేయకపోవడం వల్ల 6 నుంచి 7 వేల క్యూసెక్కులను కూడా తరలించేందుకు వీలయ్యేది కాదు. దీంతో వెలిగోడు రిజ­ర్వాయర్‌(16.95 టీఎంసీలు) నిండేది కాదు. లింక్‌ కెనాల్‌కు లైనింగ్‌ చేసి పూర్తి సామర్థ్యంతో నీటిని తరలించడం ద్వారా వెలిగోడును సకాలంలో నింపాలన్న ఆలోచన కూడా 2014–19 మధ్య చంద్రబాబు చేయలేదు.

  • వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్రహ్మంసాగర్‌కు ఐదు వేల క్యూసెక్కులను తరలించేలా 42.566 కిమీల పొడవున తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్‌ చేయకపోవడంతో 2 నుంచి 2,500 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి. బ్రహ్మంసాగర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు. మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి. తెలుగుంగ ప్రధాన కాలువకు లైనింగ్‌ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేసిన పాపాన పోలేదు. ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతులను దెబ్బతీశారు.

నేడు ఇలా..

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌ వరకూ లింక్‌ కెనాల్‌ను, వెలిగోడు రిజర్వాయర్‌ నుంచి బ్రహ్మంసాగర్‌ వరకూ ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ కాలువల ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు నీటిని తరలించడానికి మార్గం సుగమం చేశారు. దీంతో 2019, 2020, 2021, 2022లో వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు.

    వెలిగోడు రిజర్వాయర్‌

  • బ్రహ్మంసాగర్‌ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్‌ వాల్‌ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వకు లైన్‌ క్లియర్‌ చేశారు.  2021–22 నుంచే  బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తూ రైతుల జీవన ప్రమాణాలను పెంచేలా సీఎం జగన్‌ కృషి చేశారు.

    బ్రహ్మంసాగర్‌

గాలేరు – నగరి సుజల స్రవంతి..
శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 1.55, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షలకు సాగునీరు, ఐదు లక్షల మందికి తాగునీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాళెం, వామికొండ, సర్వారాయసాగర్‌ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు.

నాడు అలా...

  • 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద తవ్వాల్సిన జంట సొరంగాల్లో ఫాల్ట్‌ జోన్‌(పెలుసుమట్టి)లో 165 మీటర్ల మేర మాత్రమే పనులు చేయాలి. వాటిని చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక సొరంగానికి ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయకుండా కాలువ
    (లూప్‌)తో సరిపుచ్చారు.

  • కమీషన్లు రావనే కారణంతో గాలేరు–నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు పునరావాసంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను పట్టించుకోలేదు.

  • చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పది టీఎంసీల సామర్థ్యం) నిర్వాసితులకు కూడా చంద్రబాబు పునరావాసం కల్పించలేదు. ఏటా కేవలం సగటున రెండు మూడు టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు.

నేడు ఇలా..

  • సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అంటే పది వేల క్యూసెక్కులను తరలించేలా అభివృద్ధి చేయించారు.  రెండో సొరంగంలో ఫాల్ట్‌ జోన్‌లో మిగిలిపోయిన పనులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనంతో పూర్తి చేశారు. ఇప్పుడు గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్‌ క్లియర్‌ చేశారు. శ్రీశైలానికి వరద వచ్చిన 30 రోజుల్లోనే గాలేరు–నగరి కింద ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేలకు పెంచిన సీఎం జగన్‌ ఆ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది.

    గండికోట రిజర్వాయర్‌

  • గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో గండికోటలో ఏటా 26.85 టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించి.. రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (ఆరు టీఎంసీలు), వామికొండసాగర్‌(1.6 టీఎంసీలు), సర్వారాయసాగర్‌(3.06 టీఎంసీలు)లలోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు.

  • చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో ఏటా పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతుల జీవితాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వెలుగులు నింపారు.

రైతుల హక్కులు నాడు తాకట్టు.. నేడు పరిరక్షణ

  • విభజన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించింది. శ్రీశైలం నిర్వహణను ఆంధ్రప్రదేశ్‌కు, నాగార్జునసాగర్‌ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. తెలంగాణ సర్కార్‌ తన భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని ఏపీకి అప్పగించకుండా తన అధీనంలోనే ఉంచుకోవడంపాటు ఏపీ భూభాగంలోని నాగార్జునసాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను కూడా అ«దీనంలోకి తీసుకుంది. రాష్ట్ర హక్కులను హరించేలా తెలంగాణ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు.

  • శ్రీశైలంలో 834(మల్యాల), 795(ముచ్చుమర్రి) అడుగుల నుంచి హంద్రీ–నీవా ద్వారా రోజుకు 3850 క్యూసెక్కులు మాత్రమే తరలించే సామర్థ్యం ఏపీకి ఉంది. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 881 అడుగుల్లో నీటి మట్టం శ్రీశైలంలో ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. తెలంగాణ సర్కార్‌ రోజూ 6.5 టీఎంసీలను తోడేస్తే శ్రీశైలంలో నీటి మట్టం పెరగదు. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు నీళ్లందవు. ఓటుకు కోట్లు కేసుకు జడిసి బాబు నోరుమెదపలేదు.

  • వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఇది  పూర్తయితే  తనకు భవిష్యత్‌ లేదని చంద్రబాబు  అడ్డంకులు సృష్టిస్తున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
AP 175
AP Politics
Andhra Pradesh
Chandrababu Naidu
rayalaseema
Krishna - Godavari basin
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.