Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. సమగ్ర భూ సర్వే రద్దు
ADVERTISEMENT 

సమగ్ర భూ సర్వే రద్దు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 16, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babu12.jpg

భూములు, సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు

వైఎస్సార్‌సీపీ అనాలోచితంగా రీ సర్వే చేపట్టింది.. గతంలో నేనూ ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా

ఇకపై భూ యజమానులు వచ్చి కోరితే మినహా సర్వేలు చేయం

మీ భూమి కబ్జా చేస్తే ఫిర్యాదు చేయండి.. వెంటనే తిరిగి ఇప్పిస్తాం.. గుజరాత్‌ మోడల్‌లో ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తెస్తాం

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తు­న్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్‌ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు­–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజ­మానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భూములు, సహజ వనరులకు సంబంధించి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ యజమానులకు రక్షణ కలి్పంచేందుకు గుజరాత్‌ తరహాలో ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఈ చట్టం ప్రకారం కబ్జాదారులే భూమి తమదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వారి భూములను వెనక్కి ఇప్పిస్తామ­న్నారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం పేరుతో గత సర్కారు భూ దోపిడీకి కుట్రలు పన్నితే తాము రద్దుకు క్యాబినెట్‌లో తీర్మానం చేశామన్నారు. నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఏపీలో అమలు చేశారన్నారు. అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయడంతో పేదలకు హక్కులు కలి్పంచినట్టే చేసి వైఎస్సార్‌ సీపీ నాయకులు దోచేశారన్నారు. భూ దందాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. 

రూ.35 వేల కోట్ల భూ దోపిడీ 
వైఎస్సార్‌ సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. రీ సర్వేతో భూ హద్దులు మార్చేశారన్నారు. అసైన్‌మెంట్, అసైన్డ్, చుక్కల, నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్‌ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్‌ సీపీ కార్యాలయాలకు రూ.300 కోట్ల విలువైన 40.78 ఎకరాలను కేటాయించుకున్నారని చెప్పారు.

తమకున్న సమాచారం మేరకు రూ.35 వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. 22–ఏలో భూములను చేర్చి అక్రమాలు చేశారని, అసైన్డ్‌ భూములను వైఎస్సార్‌సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని ఆరోపించారు. పుంగనూరులో భూ వ్యవహారాలను పునఃపరిశీలన చేస్తున్నామన్నారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

బెదిరింపులు, భారీ జరిమానాలతో లీజులను లాక్కుని గనులు కొల్లగొట్టారన్నారు. అధికారులను డిప్యూటేషన్లపై తెచ్చి పథకం ప్రకారం దోపిడీ చేశారన్నారు. ఇసుక, లేటరైట్, ఇతర ఖనిజ నిక్షేపాలతో రూ.19 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. తమ హయాంతో పోలిస్తే ఎర్ర చందనం విక్రయాల ద్వారా గత ఐదేళ్లలో 27 శాతం మాత్రమే ఆదాయం వచి్చందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో, అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

ఏం చేయాలో అర్థం కావట్లేదు.. 
రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవంతులు కట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మద్యం, గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాజకీయ వివక్షకు తావులేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఒక్క కిలో కూడా ఖనిజం దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో దోపిడీని ప్రశి్నస్తే దాడులు చేశారని, మడ అడవులను కబ్జా చేసి ఇళ్ల స్థలాలిచ్చారని చెప్పారు.

తప్పులు చేసిన అధికారులను తొలగిస్తే దోమల మందు కొట్టించేందుకు కూడా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు.  విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిలో వాటా కొట్టేయాలని చూశారన్నారు. దసపల్లా భూముల్లో అక్రమంగా అపార్ట్‌మెంట్లు నిరి్మంచారని చెప్పారు. హయగ్రీవ భూముల్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారని చెప్పారు. టీడీఆర్‌ బాండ్లలోనూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. శారదా పీఠానికి ఎకరా రూ.లక్షకే 15 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులు, తిరుపతిలో మఠం భూములనూ కొట్టేశారన్నారు.

చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించి రిజి్రస్టేషన్‌ చేసుకున్నారని చెప్పారు. భూ కబ్జాలపై ఫిర్యా­దులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు లాక్కు­న్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్‌ లీజ్‌ ఓనర్లను బెదిరించి వైఎస్సార్‌సీపీ నాయకులకే అమ్మేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. క్వార్జ్, లేటరైట్‌ను దోచేసి సొంత సిమెంట్‌ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి మనుషులకు ఇష్టానుసారం లీజులిచ్చారన్నారు. పోలవరం కుడి కాల్వ పనుల్లో రూ.800 కోట్ల మట్టిని తరలించారని ఆరోపించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Lands
Natural Resources
White Paper
Chandrababu Naidu
Andhra Pradesh
Comprehensive land survey
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.