Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పేరుకే ఈసీలు.. దిక్కుతోచని వీసీలు
ADVERTISEMENT 

పేరుకే ఈసీలు.. దిక్కుతోచని వీసీలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 12, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
au.jpg

విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం     

17 నెలలుగా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశాలు లేవు 

ఈసీ సమావేశాల నిర్వహణకు వీసీలకు అనుమతి ఇవ్వని ఉన్నతవిద్య కీలక అధికారి 

తాను చెప్పినప్పుడు, తనకు నచ్చిన అజెండా ప్రకారమే నిర్వహించాలంటూ హుకుం 

2025–26 బడ్జెట్‌కు ఈసీ అప్రూవల్‌ లేకుండానే ఆర్థిక వ్యవçహారాల నిర్వహణ 

ఇప్పటికీ అరడజను వర్సిటీల్లో ఒక్కసారి కూడా ఈసీ సమావేశం పెట్టలేని దుస్థితి 

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. స్వతంత్ర సంస్థలుగా విద్యాసేవలను అందించాల్సిన విశ్వవిద్యాలయాలను అనధికారిక నిబంధనల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులను కాలరాస్తూ కనీసం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) సమావేశాలు నిర్వహించకుండా వర్సిటీల పాలన కుంటుపడేలా చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడునెలలు గడిచినా వర్సిటీల్లో ఇంతవరకు వార్షిక బడ్జెట్‌కు ఈసీ అప్రూవల్స్‌ లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. 

మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రపోజల్స్‌ సైతం సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత బడ్జెట్‌కే అప్రూవల్స్‌ లేకపోవడం వర్సిటీల ఆర్థిక వ్యవహరాల నిర్వహణపై తీవ్రప్రభావం చూపనుంది. బడ్జెట్‌ ఆమోదం లేకుండా ఖర్చు చేసేసిన తర్వాత వాటిని రాటిఫై చేసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వర్సిటీల చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కి అధిపతిగా వైస్‌ చాన్సలర్‌ (వీసీ) వ్యవహరిస్తారు. 

ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కళాశాల విద్యా శాఖ కమిషనర్‌/డైరెక్టర్లతో పాటు వర్సిటీలోని ఆచార్యులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛందసంస్థల వారు, విద్యావేత్తలు సభ్యులుగా నామినేట్‌ అవుతారు. మూడునెలలకు ఒకసారి ఈసీ సమావేశం నిర్వహించాలనేది ప్రాథమిక నిబంధన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలను కాలగర్భంలో కలిపేసింది.

17 నెలలుగా వర్సిటీల్లో పూర్తిస్థాయి ఈసీ సమావేశాలు నిర్వహించకుండానే కాలం గడిపేస్తోంది. దీంతో వర్సిటీల్లో పాలన, ఆర్థిక వ్యవహరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి అత్యవసరంగా తీసుకున్న నిర్ణయాలను రాటిఫై పేరుతో తర్వాత ఈసీ సమావేశాల్లో ఆమోదిస్తారు. కానీ కూటమి పాలనలో సాధారణ నిర్ణయాలను కూడా ఈసీ సమావేశాల్లేక రాటిఫై చేసుకోవడానికి వీలుకలగడంలేదు. వర్సిటీల్లో కీలకంగా వ్యవహరించే రిజిస్ట్రార్ల నియామకం విషయంలోను ఈసీ ఆమోదం తప్పనిసరి. 

ఉత్తరాంధ్రలోని ప్రముఖ వర్సిటీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రార్‌గా నియమితులైన వ్యక్తికి ఈసీ ఆమోదం పొందడానికి ఏడాది పట్టింది. ఇంతలో ఆ వ్యక్తి మారిపోయారు. వీసీ మరొకరిని రిజిస్ట్రార్‌గా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈసీ సమావేశమే జరగలేదు. అసలు ఈసీ ఆమోదం లేని వ్యక్తి వర్సిటీలో కీలక ఆర్థిక వ్యవహరాలు నడిపిస్తూ వాటిని రాటిఫై చేసుకునే ఆలోచన మొత్తం వర్సిటీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. ఇప్పటికీ అరడజనుకుపైగా వర్సిటీల్లో ఒక్కసారి కూడా ఈసీ సమావేశం నిర్వహించలేదంటే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తెలుస్తోంది. 

అంతా తానే అంటున్న అధికారి 
వైస్‌ చాన్సలర్‌ ముందుస్తు సమాచారంతో ఈసీ సమావేశం ఏర్పాటుచేసి కోరం ఉంటే అజెండా ప్రకారం నిర్ణయాలు ఆమోదింపజేసుకోవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖలోని ఓ కీలక అధికారి వర్సిటీలపై పట్టుకోసం వీసీలు, రిజిస్ట్రార్ల అధికారాలకు కత్తెర వేస్తూ ఈసీ సమావేశాలు జరగనివ్వకుండా చూడటం వర్సిటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈసీలో మెంబర్‌ మాత్రమే అయిన ఆ అధికారి.. గవర్నర్‌ ఆమోదంతో నియమితులైన వీసీలను, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ అధికారాలను బైపాస్‌ చేస్తూ ఈసీల నిర్వహణకు అడ్డుకట్టు వేస్తుండటం గమనార్హం. 

తనకు వీలైనప్పుడు, తనకు నచ్చిన అజెండా ప్రకారమే ఈసీ సమావేశం నిర్వహించాలని నిర్దేశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఉన్నప్పుడే ఈసీ సమావేశం నిర్వహణకు ఓకే చెబుతున్నారు. ఆ అధికారికి సమయం లేకపోతే ఎంతకాలమైనా వీసీలు అనుమతి కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో విచిత్రం.. ఆ అధికారి మాత్రం ఈసీ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరవుతారు. మిగిలిన సభ్యులు నేరుగా హాజరుకావాలని హుకుం జారీచేస్తుంటారు. 

కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సైతం వీసీలను తీవ్రంగా అవమానిస్తున్నట్లు విమర్శలున్నాయి. తన పరిధిలోకి రాని ఉన్నతవిద్య అంశంలో రాయలసీమ జిల్లాల్లోని ఓ కలెక్టర్‌ జోక్యం చేసుకోవడమేగాక, గౌరవంగా కలిసి సమస్యను వివరించేందుకు వెళ్లిన వీసీని బయట కూర్చోబెట్టి అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా పంపించటం విమర్శలకు దారి తీసింది. 

షాడోల రాజ్యం 
ఉన్నత విద్యాశాఖలో షాడోల పాలన నడుస్తోంది. విద్యాశాఖ మంత్రి ఓఎస్‌డీ షాడో మంత్రిగా వ్యవహరిస్తుంటే.. ఉన్నత విద్యాశాఖలోని కీలక అధికారికి ఎన్నడూ పాఠాలు చెప్పని ఓ సీనియర్‌ లెక్చరర్‌ అనుమతి లేని ఓఎస్‌డీ పోస్టు సృష్టించుకుని షాడో పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరు షాడోల దెబ్బకి ఉన్నత విద్యావ్యవస్థ, వర్సిటీలు కుప్పకూలిపోతున్నాయి. మంత్రి షాడోగా ఉన్న వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తుంటే.. ఉన్నతాధికారి షాడో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా సమాచారం పేరుతో ఫోన్లు చేయడమేగాక అజెండాలు కూడా నిర్దేశిస్తున్నారని పలువురు వీసీలు ఆవేదన చెందుతున్నారు. 

వాస్తవానికి మంత్రికి, కీలక ఉన్నతాధికారికి విద్యాసంబంధిత అంశాలను పట్టించుకునే తీరకలేదని, తమకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వటంలేదని వర్సిటీల అధికారులు పేర్కొంటున్నారు. బాబు పాలనలో విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
universities
Chandrababu Naidu
Andhra Pradesh
Education Department
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.