Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మసిపూసి.. అక్రమ అరెస్టు
ADVERTISEMENT 

మసిపూసి.. అక్రమ అరెస్టు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 30, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babu.jpg

ఎంపీ మిథున్‌ రెడ్డిని జైలుకు పంపడం వెనుక కుట్ర ఇదీ 

సాధారణ వ్యాపార లావాదేవీ వక్రీకరణ 

పూర్తి ఆధారాలు సమర్పించిన పీఎల్‌ఆర్‌ కంపెనీ 

అయినా పదే పదే అదే అభియోగంతో ముందుకెళ్లిన సిట్‌ 

మరో వైపు రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వైపు కన్నెత్తి చూడని వైనం 

చంద్రబాబు డైరెక్షన్‌లో సిట్‌ ద్వంద్వ వైఖరి.. 

కక్ష సాధింపునకు ఇదే నిదర్శనం

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాజ­కీయ కక్షతోనే ఎంపీ మిథున్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగానే ఆయన్ను సిట్‌ అరెస్టు చేసిన విషయం విదితమే. అందుకు ఎంపీ మిథున్‌ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పీఎల్‌ఆర్‌ కంపెనీ సాధారణ లావాదేవీలకు కుట్ర పూరితంగా సిట్‌ వక్ర భాష్యం చెప్పింది. పీఎల్‌ఆర్‌ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టులను సబ్‌ కాంట్రాక్టు చేసేందుకు డికార్ట్‌ కంపెనీ 2019లో ఒప్పందం చేసుకుంది.

కాంట్రాక్టు పనుల బ్యాంకు గ్యారంటీ, ఈఎండీ కోసం రూ.5 కోట్లు చెల్లిం­చింది. కానీ కోవిడ్‌ వ్యాప్తి అనంతర పరిణా­మాల్లో డికార్ట్‌ కంపెనీ సబ్‌ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగింది. దాంతో ఆ కంపెనీ తమకు చెల్లించిన రూ.5 కోట్లను పీఎల్‌ఆర్‌ కంపెనీ వాపసు చేసింది. ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ. ఆ అధికారిక రికార్డులను కూడా పీఎల్‌ఆర్‌ కంపెనీ సమరి్పంచింది. (2014–24 వరకు) కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్‌ అధికారులు పరిశీలించారు.

అయినా సరే  కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తద్వారా ప్రజల్ని తప్పు­దారి పట్టించేందుకు సిట్‌ యతి్నంచింది. కాగా మిథు­న్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు కావడంతో సిట్‌ అభి­యోగాల్లో పస లేదన్నది స్పష్టమైంది. మిథున్‌ కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ కంపెనీకి డికార్ట్‌ లాజిస్టిక్స్‌ అనే కంపెనీ రూ.5 కోట్లు బదిలీ చేయడం మద్యం కుంభకోణం కోసమేనని సిట్‌ నిరాధార అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను మిథున్‌ రెడ్డి, పీఎల్‌ఆర్‌ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టినా సిట్‌ పదే పదే అదే అభియోగం ఆధారంగానే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసింది.   

ఇదీ అసలు వాస్తవం    
అసలు వాస్తవాలను మిథున్‌ రెడ్డి తరఫు న్యాయ­వాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానానికి నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎందుకు కేసు పెట్టరు?
⇒ ఈ అక్రమ కేసు కుట్రలో చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్‌ కేసిరెడ్డితో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) వ్యాపార భాగస్వామి అనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. మంత్రి లోకేశ్‌కు బినామీగా పేరుపడిన ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార వ్యవహారాలపై అందుకే సిట్‌ దృష్టి సారించడం లేదు. 

⇒ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021­లోనే రాజ్‌ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన ‘ఫ్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటా­దారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్‌ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ.. హైదరాబాద్‌లోని ఒకే చిరునామా (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్‌ 403, ప్లాట్‌ నంబర్‌ 9)తో రిజిస్టర్‌ అయ్యాయి. 

⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్‌ ఐడీ( ్చఛిఛిౌun్టటఃఠీటజ్చిnఠిజీజీnజట్చpట్జౌ్ఛఛ్టిట. ఛిౌఝ)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్‌ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని.. మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యం. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్‌ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిని చేశారు.  

⇒  కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు.  అటువంటి కేశినేని చిన్నితో రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్‌ బండారం బట్టబయలవుతుంది. రాజ్‌ కేసిరెడ్డితోపాటు ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితరులపై సిట్‌ నమోదు చేసింది అక్రమ కేసేనన్నది బయట పడుతుంది. ఇదంతా చంద్రబాబు రెడ్‌బుక్‌ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు మొత్తం కుట్ర బహిర్గతమవుతుంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
illegal arrests
mithun reddy
Andhra Pradesh
illegal case
Chandrababu Naidu government
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.