Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. దళిత ఐపీఎస్‌ల పట్ల వివక్ష, వేధింపులు
ADVERTISEMENT 

దళిత ఐపీఎస్‌ల పట్ల వివక్ష, వేధింపులు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
IPS.jpg

ఐపీఎస్‌లు మొదలు కానిస్టేబుళ్ల వరకు వందలాది మందిపై కక్ష సాధింపు

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న దళిత సంఘాలు

సాక్షి, అమరావతి: దళిత ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. అక్రమ కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతూ వేధిస్తోంది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీవీ సునీల్‌కుమార్, సంజయ్, జాషువా తదితరులకు ఎదురవుతున్న అవమానాలు, వేధింపులు, అక్రమ అరెస్టులు, విచారణకు సమన్లే అందుకు తార్కాణం. ఇక వచ్చే నెల 4న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌కు సమన్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కుట్రను మరోసారి బహిర్గతం చేసింది. 

దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నినదించే డీజీ స్థాయి ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమారే స్వయంగా వివక్షకు గురికావడం విస్మయ పరుస్తోంది. ఆయనకు ఏడాదిపాటు పోస్టింగు ఇవ్వలేదు. అనంతరం ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయడంతోపాటు సస్పెండ్‌ చేసి, వేధింపులను తీవ్రతరం చేసింది. ఆరు నెలలుగా ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు. పీవీ సునీల్‌కుమార్‌.. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకుని మరీ వ్యక్తిగత పనుల మీద చేసిన విదేశీ పర్యటనలను కూడా వక్రీకరించి అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం. 

ఇక సీనియర్‌ దళిత ఐపీఎస్‌ అధికారి కాస్త ఖరీదైన వాచీ ధరించడాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి వత్తాసు పలికే ఎల్లో మీడియా భరించలేక పోవడం విభ్రాంతి పరిచింది. ఆయన వాచీ మీద కూడా ఎల్లో మీడి­యా దుష్ప్రచారానికి పాల్పడింది. గతంలో ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు.. ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై చేసిన ఆరోపణలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతుండటం గమనార్హం. ఆ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

⇒ మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ కూడా చంద్రబాబు ప్రభుత్వ బాధితుడిగా మారారు. ఆయన కేవలం మూడు నెలలపాటు అగ్ని మాపక శాఖ ఇన్‌చార్‌్జగా అదనపు డీజీగా వ్యవహరించారు. అగ్ని మాపక శాఖ పరికరాల కొనుగోలు, బిల్లుల చెల్లింపుతో ఆయనకు నేరుగా ప్రమేయం లేదు. కానీ సంజయ్‌పై అక్రమ కేసు నమోదు చేసి సస్పెండ్‌ చేసింది. అనంతరం ఏకంగా అరెస్టు చేసి జైలు పాలు చేసింది. ఇప్పటికీ అక్రమ కేసులో ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 



⇒ సీనియర్‌ దళిత ఐపీఎస్‌ అధికారి జాషువాకు కూడా పోస్టింగు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. 
⇒ దళిత అధికారి విశాల్‌ గున్నీని అక్రమ కేసులో సస్పెండ్‌ చేసింది. 
⇒ రిటైర్డ్‌ దళిత పోలీసు అధికారి విజయ్‌ పాల్‌పై అక్రమ కేసు నమోదు చేసింది. రాజకీయ కక్ష సాధింపుతో ఆయన్ను అరెస్టు చేసి జైలు పాలు చేసింది. 
⇒ ఇలా ఐపీఎస్‌లు డీఎస్పీ నుంచి ఎస్సై వరకు ఎంతో మంది దళిత పోలీసు అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది.

ఏపీలో దళిత ఐపీఎస్‌ అధికారులకు వేధింపులు 
దళిత ఐపీఎస్‌ అధికారులపై వివక్ష, వేధింపులు హరియాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో మరింత తీ­వ్ర­ంగా సాగుతున్నా­యి. కుల వివక్షకు గురైన హరియాణలో పూరన్‌ కుమార్‌ అనే దళిత ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ, అంతకంటే తీవ్ర స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఏపీలో దళిత ఐపీఎస్‌ అధికా­రుల పట్ల వివక్షను ప్రదర్శించడమే కాకుండా, వారి­ని అక్రమ కేసులతో వేధిస్తున్నారు. 

సీని­యర్‌ ఐపీఎస్‌ అధికా­రులు పీవీ సునీల్‌ కుమార్, సంజయ్‌లపై నమోదు చేసిన అక్రమ కేసులే ఇందుకు నిదర్శనం. అక్రమ కేసులు బనా­­యించి ఐపీఎస్‌ సంజయ్‌ని జైల్లో పెట్టా­రు. దళిత, అణగారిన వర్గాల హక్కుల కోసం నినదించే పీవీ సునీల్‌ కుమార్‌ను కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోంది. ఈ వేధింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నా.
– ‘ఎక్స్‌’లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu government
Dalits
IPS officers
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.