Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మరోసారి ఎస్సీలే లక్ష్యంగా బాబు కుతంత్రం
ADVERTISEMENT 

మరోసారి ఎస్సీలే లక్ష్యంగా బాబు కుతంత్రం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 10, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bau.jpg

విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన వైనం

మద్యం కేసులో నిందితులకు నిబంధనల మేరకే బెయిల్‌ మంజూరు

అది జీర్ణించుకోలేక రగిలి పోతున్న బాబు అండ్‌ కో

సాక్షి, అమరావతి: ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుం­టారా..? అంటూ గతంలో ఎస్సీలను ఘోరంగా అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఎస్సీలను లక్ష్యంగా చేసుకు­న్నారు. మద్యం కేసులో నిందితు­లకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధి­కారి భాస్కరరావు ఇటీవల వరుసగా బెయిళ్లు మంజూరు చేస్తూ వస్తుండటంతో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్సీ అయిన ఆయన్ను లక్ష్యంగా చేసుకుని న్యాయ చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని విధంగా తన ఆస్థాన న్యాయవాది సిద్దార్థ లూథ్రా చేత హైకోర్టులో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. 

భాస్కరరావు నిబంధనల మేరకు తన విచక్షణాధికారాన్ని ఉపయో­గించి వైఎస్సార్‌సీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేస్తుండటాన్ని సహించలేని చంద్రబాబు.. ఆ న్యాయాధికారిపై తన అసహనాన్ని, ఆక్రోశాన్ని లూథ్రా ద్వారా వెళ్లగక్కించారు.  వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో లూథ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాస్కరరావును ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా బహిరంగంగానే తెలిపారు. 

భాస్కరరావు తాము చేస్తున్న ప్రతీ వాదనను తోసిపుచ్చుతు­న్నారని, తమ వాదనలను ఏ మాత్రం పరిగణన­లోకి తీసుకోకుండా వైఎస్సార్‌సీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేసేస్తున్నారని లూథ్రా కోర్టుకు నివేదించారు. ఇటీవల మిధున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు సందర్భంగా తాము చేసిన ఏ వాదనను కూడా ఆయన పట్టించుకోకుండా తీర్పు ఇచ్చారని తెలి­పారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద, సెక్షన్‌ 164 కింద సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలను సైతం ఆయన పరిగణ­న­లోకి తీసుకోలేదన్నారు. 

అంతేకాక గూగుల్‌ టేకౌట్‌ను కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్ని ఆధా­రాలు సమర్పించినా వాటిని ఆరోపణలనే పేర్కొంటూ ఆధారాల్లేవని చెబుతున్నారని తెలిపారు. మిధున్‌రెడ్డి ఏ నేరం చేయలేదంటూ క్లీన్‌ చీట్‌ ఇచ్చేశారన్నారు. బెయిలు మంజూరు సమయంలో భాస్కరరావు ఏ ఒక్క నిబంధనను కూడా పాటించలేదని తెలిపారు. 

మిధున్‌రెడ్డికి బెయిల్‌ తీర్పును కొట్టేయాలని పిటిషన్‌
మద్యం కేసులో మిధున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తీర్పులోని అంశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా మిధున్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తూ ఇచ్చిన తీర్పులోని పలు అంశాలను స్టే చేయాలని, లేని పక్షంలో మిగిలిన నిందితులు ఆ అంశాలను ఆధారంగా చేసుకుని బెయిల్‌ పొందే అవకాశం ఉందని సిట్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదించారు. 

దర్యాప్తు మొత్తం ప్రభావితం అయ్యేలా మిధున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయాధికారి బెయిల్‌ ఇచ్చారని తెలిపారు. దీని వల్ల మొత్తం దర్యాప్తే నిర్వీర్యమై పోతుందన్నారు. మిధున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసే సమయంలో అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని లూథ్రా తెలిపారు. ఇదిలా ఉండగానే న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వీలుగా పార్లమెంటరీ కార్యదర్శి నుంచి సెప్టెంబర్‌ 26న మిధున్‌రెడ్డికి మెయిల్‌ వచ్చిందన్నారు. 

అప్పుడు మిధున్‌రెడ్డి జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం న్యూయార్క్‌ వెళ్లేందుకు వీలుగా మిధున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు పాస్‌పోర్టును వెనక్కి ఇచ్చేసిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి షరతులు విధించలేదన్నారు. ఈ సందర్భంగా సిట్‌ తరఫున లూథ్రా ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై పలు ఆరోపణలు చేశారు.  

ఏకపక్షంగా స్టే ఇవ్వలేం
మిధున్‌రెడ్డికి బెయిలిస్తూ ఇచ్చిన తీర్పులోని అంశాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. మిధున్‌రెడ్డి వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి తదితరుల బెయిల్‌ పిటిషన్లపై విచారణ ఉందని, మిధున్‌రెడ్డికి ఇచ్చిన తీర్పులోని అంశాలను స్టే చేయాలంటూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తేల్చేంత వరకు తన ముందున్న వ్యాజ్యాలపై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నియంత్రించాలని లూథ్రా హైకోర్టును కోరారు. 

ఇందుకు అంగీకరించిన హైకోర్టు.. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాము నిర్ణయం వెలువరించేంత వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరుల పిటిషన్లపై విచారణ జరపొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సిట్‌ తరఫున ఇంకా హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

వ్యక్తిగత పర్యటన కాదు.. అది ప్రతిష్టాత్మక సమావేశం 
ఈ సమయంలో మిథున్‌ రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి స్పందిస్తూ, అనుబంధ పిటిషన్‌కు సంబంధించిన కాపీలను సిట్‌ తరఫు న్యాయవాదులు ఇప్పుడే తమకు అందచేశారన్నారు. వాటన్నింటినీ పరిశీలించి తగిన విధంగా స్పందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. మి«థున్‌రెడ్డి పాల్గొనే సమావేశం చాలా ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. ఈ సమావేశానికి వెళుతున్న అతి తక్కువ మందిలో మిథున్‌ రెడ్డి ఒకరని కోర్టు దృష్టికి తీసుకొ­చ్చారు. పార్లమెంట్‌ కార్యదర్శి నుంచి మెయిల్‌ వచ్చాక పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. 

సమావేశంలో పాల్గొనే హక్కు ఎంపీగా మిథున్‌రెడ్డికి ఉందని, దానిని పరిగ­ణనలోకి తీసుకునే ఏసీబీ కోర్టు పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చిందన్నారు. మిథున్‌ దేశం తరఫున ఆ సమావేశానికి వెళుతున్నారే తప్ప అది వ్యక్తిగత పర్యటన కాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. బెయిల్‌ మంజూరు చేసిన న్యాయాధికారికి ఉద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. 

ఎంపీ తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లడం లేదని, అధికారిక కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నారని.. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని పీఎంవో పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. చెవిరెడ్డి తదితరుల బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరుపుతుంది కాబట్టి, మిధున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌లోని అంశాలపై స్టే ఇవ్వాలని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. స్టే కావాలనుకుంటే అందుకు ప్రత్యేకంగా పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  

లూథ్రా సిఫారసు చేస్తే సరిపోతుందా?
ఏసీబీ కోర్టు జడ్జి భాస్కరరావును అక్కడి నుంచి బదిలీ చేయించాలని తాను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు లూథ్రా చెప్పిన నేపథ్యంలో ఓ న్యాయాధికారి బదిలీ అంత సులభమా అని సందేహం కలుగుతోంది. ప్రభుత్వం అనుకున్నంతనే న్యాయాధికారి బదిలీ జరిగిపోదు. న్యాయ­వాదులు ప్రభుత్వ పరిధిలో  హైకోర్టు నియంత్రణలో పని చేస్తుంటారు. వారిని బదిలీ చేసే అధికారం హైకోర్టుకే ఉంటుంది. ప్రభుత్వానికి కేవలం న్యాయాధికారుల బదిలీని నోటిఫై చేసే అధికారం మాత్రమే ఉంటుంది. 

న్యాయాధికారుల బదిలీల విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం. న్యాయాధికారుల బదిలీల విషయంలో పరిపాలన హెడ్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన సహచర సీనియర్‌ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఉంటారు. ఆ కమిటీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లూథ్రా సిఫారసు చేశారనో, ప్రభుత్వం అడిగిందనో బదిలీ చేయడం ఉండదు. అందునా సీఐడీకి నచ్చని విధంగా న్యాయాధికారి వ్యవహరిస్తున్నారనే కారణంతో బదిలీ చేయడం అన్నది జరిగే పని కాదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
MIDHUN REDDY
Andhra Pradesh
scs
Chandrababu Naidu
Siddharth luthra
Bhaskar Rao
Andhra Pradesh High Court
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.