Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి: ఉండవల్లి అరుణ్‌కుమార్‌
ADVERTISEMENT 

మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి: ఉండవల్లి అరుణ్‌కుమార్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 22, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vunda.jpg

చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల నుంచి కనీస స్పందన కరువు

హైకోర్టు ఆదేశాలతోనైనా చలనం వస్తుందని భావిస్తున్నా

గత ప్రభుత్వం ఇంప్లీడ్‌ కావడంతో కేసుకు బలం చేకూరింది 

ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి 

2006లో నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది 

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌  

మార్గదర్శి చిట్స్‌ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్‌కు చేరి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్లింది. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి నిర్వాహకులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. మార్గదర్శిపై పోరాడుతున్న వారిని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాపై రూ.50 లక్షల పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్‌లో ఉంది. మార్గదర్శి చిట్‌ ఫండ్‌ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే.. ఆ కేసు నుంచి బయటడతాను. కేసు వేయడంతో చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తోంది.           
– ఉండవల్లి అరుణ్‌కుమార్‌  

సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టులో వాస్తవాలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాల నుంచి కనీస స్పందన కరువైందని ఆరోపించారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతోనైనా వాళ్లలో చలనం కలుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. 

రాజమహేంద్రవరంలోని ఓ బుక్‌ హౌస్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇంప్లీడ్‌ కావడంతో ఈ కేసుకు బలం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు దివంగత  రామోజీరావు, కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎలా స్పందిస్తారో తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే గౌరవం దక్కుతుందన్నారు. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప.. అన్యాయం జరగదని చెప్పారు. 

రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలని కోరారు. మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించిన వడ్డీల గురించి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. డిపాజిట్ల సొమ్ము అందరికీ అందిందా? లేదా? అన్న విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించిందన్నారు. డిపాజిట్‌దారుల వివరాలను పెన్‌ డ్రైవ్‌లో నింపి ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించానని తెలిపారు. తాము ఎవరికి డబ్బు చెల్లించామన్న వివరాలను మార్గదర్శి 70 వేల పేజీల్లో నింపి సుప్రీంకోర్టుకు అందించిందని చెప్పారు.  

నాడు చెప్పిందే.. నేడు నిజమైంది 
2006 నవంబర్‌ 6వ తేదీన అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరానికి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణ విషయంలో తాను ఏం ఫిర్యాదు చేశానో అదే విషయాన్ని ఆర్‌బీఐ సైతం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొందని ఉండవల్లి చెప్పారు. మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం పేరుతో డిపాజిట్ల వసూళ్లలో 45ఎస్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసిందన్నారు. 

మార్గదర్శిపై తన పోరాటాన్ని కొందరు తప్పు పట్టారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చేసిన విమర్శల్లో నిజం లేదన్నారు. కేసు పోరాటంలో తనకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని స్పష్టం చేశారు. చిట్‌ ఫండ్‌ చట్టాలకు తాము అతీతం అని మార్గదర్శి భావించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ చిట్‌ ఫండ్‌ కంపెనీ కూడా చట్టాలు పాటించడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల కాకినాడలో జయలక్ష్మి చిట్‌ ఫండ్‌ కంపెనీ ఎత్తేశారని ఉదహరించారు. రామోజీ నిబంధనలు పాటించక పోవడంతో మిగిలినవి సైతం అదే దారిలో వెళుతున్నాయన్నారు.  

విలీన మండలాలను కాపాడుకోవాలి  
రాష్ట్ర విభజన విషయంలో విలీన మండలాలు తెలంగాణ పరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరçఫున గతంలో వైఎస్‌ జగన్‌ ఎలా అఫిడవిట్‌ ఫైల్‌ చేశారో ఇప్పుడు కూడా అదే చేయా­లని చంద్రబాబును కోరారు. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రా­నికి ప్రత్యేక హోదా ఉన్నట్టు విశాఖపట్నంకు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త నీతి ఆయోగ్‌కు చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైందని, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.  

ఓట్ల శాతంపై కదలికేదీ?   
మహారాష్ట్రకు చెందిన ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ ఏపీలో పోలైన ఓట్ల కన్నా 12.54 శాతం ఓట్లు, ఒడిశాలో 12.4 శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించినట్టు ప్రకటించిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పీపుల్స్‌ రిప్రజెంటేషన్‌ యాక్ట్‌ ప్రకారం పోలింగ్‌ పూర్తయి.. ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డి్రస్టాయ్‌ చేయమని ఎన్నికల కమిషనర్‌ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయా­లని డిమాండ్‌ చేశారు. ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలని కోరారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Margadarsi Chits
Vundavalli Aruna Kumar
Chandrababu Naidu
Revanth Reddy
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.