Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకివ్వాల్సిందే
ADVERTISEMENT 

స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకివ్వాల్సిందే

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 2, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
MADHAV.jpg

వాళ్ల పార్టీకి 80%.. వీళ్ల పార్టీకి 15%.. మనకేమో 5 శాతమట..

కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేవు 

బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతల నిరసన గళం 

కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కేలా పని చేస్తా: పీవీఎన్‌ మాధవ్‌  

సాక్షి, అమరావతి: ‘ప్రతీసారి వాళ్లది 80 శాతం. ఇంకొకళ్లది 15 శాతం. మనది 5 శాతమే అంటున్నారు. ఏందయ్యా 5 శాతం. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి ఊహించుకోండి. పేరుకే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. అసలు కూటమి పాలనలో బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం, గుర్తింపు రెండూ లేవు. ఇప్పటివరకు ఎన్ని నామినేటెడ్‌ లిస్టులు ఇచ్చినా కొన్ని పోస్టులు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఏడాదిలోపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లే ఇస్తామంటే కుదరదు. 

మా వాటా మాకు ఇవ్వాల్సిందే..’ అంటూ టీడీపీ తీరును పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ ఎన్నికైనట్లు ప్రకటించే కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలోని ఒక ఫంక్షన్‌ హాలులో నిర్వహించారు. పీవీఎన్‌ మాధవ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటకకు చెందిన ఎంపీ పీసీ మోహన్‌ అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణపత్రాన్ని అందించారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. తొలుత ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ‘కూటమిలో మన పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవం. నామినేటెడ్‌ పదవుల భర్తీ కోసం ఎన్నిలిస్టులు వచ్చినా బీజేపీకి కొన్ని పోస్టులు కూడా ఇవ్వలేదు’ అని ధ్వజమెత్తారు. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లడుతూ ‘బీజేపీకి ఉన్నది ఐదు శాతమే అంటున్నారు. 

ఏందయ్యా ఐదు శాతం. రెడిక్యూలెస్‌’ అంటూ తీవ్రంగా స్పందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఐదు శాతం సీట్లు ఇస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. కూటమితో కలిసి ఉండాలని, అయితే, బీజేపీ వాటాను తప్పకుండా పొందాల్సిందేనని చెప్పారు. బీజేపీలో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు 15 నుంచి 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని, వారికి న్యాయం చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. ‘బీజేపీ కనుక కూటమిలో కలవకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఏవిధంగా ఉండేవో తెలుసుకోవాలి..’ అంటూ పరోక్షంగా టీడీపీ నేతలను హెచ్చరించారు.  

ఒకచేతిలో బీజేపీ జెండా... ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా: మాధవ్‌  
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలను సమన్వయం చేసుకుంటూ ‘ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో ఎన్డీఏ అజెండా’ అన్నట్టు ముందుకు సాగుతానని చెప్పారు. 

ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గౌరవం దక్కేలా, గర్వపడేలా పని చేస్తానని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సమయంలో తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉందన్నారు. జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్రం సహకారంతోనే రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. 

మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదు 
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడిగా నా తండ్రి పని చేశారు. మా కుటుంబం, బీజేపీ వేర్వేరు కాదన్నట్లు మా తండ్రి వ్యవహరించారు. మా అక్కల పేర్లు కూడా ముఖర్జీ, ఉపాధ్యాయ అని వచ్చేలా పెట్టారు. తొలి పుస్తెను పార్టీకి కట్టాను. ఆ తర్వాత నీకు కట్టాను అని మా నాన్న అమ్మకు చెప్పారంట. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాపై నమ్మకంతో పార్టీ జాతీయ నాయకత్వం అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తా’ అని మాధవ్‌ చెప్పారు. 

ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల తన పదవీకాలంలో ప్రోత్సహించిన, విభేదించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదలు అని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ మాధవ్‌ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.     

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
bjp
NDA government
TDP
local body elections
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.