Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఫీజులకు బూజు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
ADVERTISEMENT 

ఫీజులకు బూజు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 1, 2025 Sakshi Read Time Read Time: 6 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AP-Govt-Students.jpg

రూ.7,800 కోట్లు బకాయి పెట్టిన బాబు సర్కారు 

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌లోనే

రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా పేరుకుపోయిన బకాయిలు

కాలేజీల ఒత్తిళ్లు తట్టుకోలేక అప్పులు చేసి కడుతున్న తల్లిదండ్రులు 

ఫీజులు కట్టలేదని ప్రభుత్వ వర్సిటీల్లో సైతం సర్టిఫికెట్లు ఇవ్వని దుస్థితి 

షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులను అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. 

నేరుగా కాలేజీలకే ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తామని చెప్పి మొండిచెయ్యి 

పాక్షికంగా ఫీజుల విడుదలతో పిల్లల చదువులకు పెను గండం..

సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను అథఃపాతాళానికి దిగజార్చింది. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతుండగా.. పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం పిల్లలను వేధిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్‌ యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్‌ గత  ఏడాదిన్నరకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించే కుయుక్తులు పన్నుతూ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికి తరువాత చేతులు ఎత్తేసింది. 

ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఎనిమిది క్వార్టర్ల ఫీజుల డబ్బులు రూ.5,600 కోట్లు, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో రూ.2,200 కోట్లతో కలిపి ఏకంగా రూ.7,800 కోట్ల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. నిధులను తొక్కిపెట్టి అరకొరగా, పాక్షిక చెల్లింపులతో విద్యార్థులను సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. తేలికగా ఎగ్గొట్టవచ్చనే దురుద్దేశంతోనే తల్లుల ఖాతాలో కాకుండా, తాము కాలేజీల ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. ఉన్నత విద్యలో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు చేసి మాజీ సీఎం వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి ఐదేళ్ల పాటు అండగా నిలిచారు. త్రైమాసికం వారీగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. 

2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికం ఫీజులు ఏప్రిల్‌లో ప్రాసెస్‌ చేసి మే నెలలో విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకున్నారు. అనంతరం అధికారంలోకి వచి్చన చంద్రబాబు సర్కారు సుమారు ఎనిమిది క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేసింది.    

ప్రభుత్వ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల నిలుపుదల.. 
చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే గానీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోమనే పరిస్థితికి ఉన్నత విద్య దిగజారిపోయింది. చివరికి ప్రభుత్వ వర్సిటీలు సైతం ఇదే బాటలో పయనిస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపేశాయి. సర్కారు బాధ్యతారాహిత్యానికి బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విలువైన ఉద్యోగ అవకాశాలు, పీజీ విద్య సీట్లను కోల్పోతున్న దుస్థితి దాపురించింది. ఎంటెక్, పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. 

ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 2014–19లో టీడీపీ హయాంలో  16.73 లక్షల మంది విద్యార్థులకు బకాయి పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను అనంతరం వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులకు మంగళం పలికి ఆర్నెల్లకు ఒకసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేస్తామంటూ కళాశాలలను, విద్యార్థులను నిలువునా ముంచేసింది.   

ఆర్థిక ఇబ్బందుల్లో కళాశాలలు.. 
రాష్ట్రవ్యాప్తంగా 230కిపైగా ఇంజనీరింగ్‌ కళాశాలలు, 1,250 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో బోధన సాగిస్తున్నాయి. ఇందులో 70 శాతం సీట్లు కనీ్వనర్‌ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి బోధిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు సుమారు రూ.7,800 వేల కోట్ల చెల్లింపులు నిలిపివేయడంతో నిర్వహణ భారాన్ని భరించలేక అటు కాలేజీలు ఇటు విద్యార్థులు ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి, పుస్తెలు తాకట్టు పెట్టి ఫీజులు కడుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.  

వసతి దీవెనకు మంగళం.. 
పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు హాస్టల్‌ మెయింటెనెన్స్‌ (వసతిదీవెన) ద్వారా ఆరి్థక సాయం అందించి ఆదుకున్నారు. భోజన, వసతి ఖర్చుల కోసం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫీజులను నీరుగార్చగా.. వసతి దీవెనను ఏకంగా ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు ఎగ్గొట్టింది. హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఇచ్చే అంశాన్ని పక్కన పడేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్య అభ్యసిస్తున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు బృందం నమ్మబలికింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టింది.    

విద్యకు లోటు బడ్జెట్‌
ఒక్కో విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.2,800 కోట్లు, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లు  కేటాయింపులు చూపించి నిధులు మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. అదే వైఎస్సార్‌ సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ఫీజుల కోసం రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కారు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు సైతం చెల్లించింది. కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు నిశ్చింతగా చదువుకునేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భరోసా కల్పించింది. ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన కోసమే ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది.  

‘ఎక్స్‌’లో ట్వీట్ల పిట్టలా లోకేశ్‌! 
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పర్యవేక్షణలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచ స్థాయి విద్య, క్వాంటం సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజులు చెల్లిస్తున్నాం.. ఇదిగో ఇచ్చేస్తున్నాం.. అంటూ ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేశ్‌ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గతేడాది జూన్‌ నుంచి మొదలు కాగా ఈ ఏడాది నవంబర్‌ వచి్చనా బకాయిలు చెల్లించకపోవడంతో కొండలా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేశ్‌ అక్టోబర్‌ చివరిలో కంటి తుడుపుగా విదిల్చారు.    


పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం రూ.60 వేలు ఫీజు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ ద్వారా సమాచారం పంపించింది. తమకు రీయింబర్స్‌మెంట్‌ జమ కానందున ఫీజులు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.

కదిరిలోని ఎస్‌ఎంజేఎల్‌ డిగ్రీ కాలేజీతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి విద్యార్థులను పరీక్షలకు పంపించారు. కొందరు బాలికలను చదువు మానిపించి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. 


ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నపరెడ్డి గారి గంగిరెడ్డి  సొంతూరు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటుపల్లె కొత్తపల్లి. ఆయన కుమార్తె గౌరీప్రియ రాజంపేటలో ఇంజనీరింగ్‌ రెండో ఏడాది చదువుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో రూ.45 వేలు అప్పు చేసి కాలేజీలో చెల్లించారు. రెండో ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని వాపోతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి బీటెక్‌ ఎలాంటి ఆర్థిక ఆటంకాలు లేకుండా పూర్తయిందని గుర్తు చేసుకుంటున్నారు.  

ఎంబీఏ పూర్తయి ఏడాదిన్నర..  
రామచంద్రపురం కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశా. ఫీజు చెల్లించలేదని సరి్టఫికెట్లు ఇవ్వడంలేదు. రూ.48,500 వరకు కట్టాలని చెబుతున్నారు. నాన్న ఇటుక బట్టీలో కార్మి­కుడు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా 
– ఎస్‌.గంగరాజు, సందిపూడి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  

నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించా 
మా కుమార్తె తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో ఏడాది చదువుతోంది. ఇప్పటి వరకు ఫీజు రీయిబర్స్‌మెంట్‌ అందలేదు. కళాశాల యాజ­మాన్యం ఒత్తిడిని తట్టుకోలేక బంగారు నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించాం. నా భర్త చనిపోయారు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నా.  
    – సుభద్రమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతి

మానసికంగా కుంగిపోతున్నా.. 
కర్నూలు జీఎన్‌ఎంలో నర్సింగ్‌ మూడో ఏడాది చదువుతున్నా. గతంలో మా అమ్మ ఖాతాలో జగనన్న విద్యా దీవెన సకాలంలో జమయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమకాలేదు. పెండింగ్‌ ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. ఇంట్లో ఫీజులు అడగలేక.. కాలేజీలో ఒత్తిళ్లు తట్టుకోలేక మానసికంగా  కుంగిపోతున్నా. ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. 
– కె.సురేష్‌, నర్సింగ్‌ విద్యార్థి
సి.బెళగల్‌ మండలం, ముడుమూల  

మా పీక పట్టుకుంటుంది.. 
మా అబ్బాయి కార్తికేయ భీమిలి మండలంలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ మూడో ఏడాది చదువుతున్నాడు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఒక క్వార్టర్‌ ఫీజు మాత్రమే జమ చేసింది. అప్పటికే కళాశాల యాజమాన్యం రూ.20 వేలు చొప్పున వసూలు చేసింది. జిరాక్స్‌ షాపుపై ఆధారపడి జీవిస్తున్న నేను అతి కష్టం మీద ఆ డబ్బులు కట్టా. లేదంటే సెమిస్టర్‌ పరీక్షలు రాయనివ్వబోమంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉందనే కాలేజీలో చేర్చాం. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుంటే యాజమాన్యం మా పీక పట్టుకుంటుంది. 
    – గంటా రాజు, భీమిలి మండలం  

సకాలంలో ఇస్తే మాకీ అవస్థలుండవు 
నా కుమారుడు హుసేన్‌ అమీద్‌ బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. మాకు ఎలాంటి చర, స్థిర ఆస్తులు లేవు. చిన్న దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఏటా ప్రభుత్వం సకాలంలో ఫీజులు జమ చేస్తే మాకీ అవస్థలు ఉండవు. 
    – హుసేన్‌బీ, విద్యార్థి తల్లి, పాములపాడు, నంద్యాల జిల్లా

చిల్లి గవ్వ ఇవ్వలేదు.. 
నా కుమారుడు రోషన్‌ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. కళాశాలలో ఫీజు కట్టకపోతే పంపొద్దు అంటూ బెదిరిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం సాయం చేస్తుందనే ధైర్యంతో ఉన్నత విద్యలో చేరి్పంచాం.  
– బాబు, విద్యార్థి తండ్రి, చిత్తూరు

మదనపల్లె సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతున్న విజయ్‌బాబుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ చదివిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు అప్పులు చేసి జూన్‌లో రూ.25 వేలతో మొదటి ఏడాది ఫీజు కట్టారు. ఉన్నత చదువులు చదవాలని ఆశతో ప్రభుత్వాన్ని నమ్ము­కుని ఎంబీఏలో చేరితే తన పరిస్థితి తల్లకిందులైందని.. రెండో ఏడాదీ ఫీజు తానే కట్టుకోక తప్పదని విజయ్‌బాబు వాపోతున్నాడు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Amaravati
Fee reimbursement scheme
Chandrababu Naidu
Nara Lokesh Babu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.