Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా..?
ADVERTISEMENT 

కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా..?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 9, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
HIGH_COURT_OF_ANDHRA_.jpg

వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవనం విషయంలో మచిలీపట్నం మునిసిపల్‌ కమిషనర్‌పై హైకోర్టు మండిపాటు

చట్టం కంటే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు 

అలాంటి వారిని ఎక్కడ నిలబెట్టాలో మాకు బాగా తెలుసు 

ఒక అధికారిని కటకటాల్లోకి పంపితే అందరూ దార్లోకి వస్తారు 

లిఖితపూర్వక అఫిడవిట్‌ దాఖలు చేయండి 

మునిసిపల్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్‌సీపీ) మచిలీపట్నం టౌన్, ఈడేపల్లిలో నిబంధనలకు అనుగుణంగా నిరి్మంచిన పార్టీ కార్యాలయ భవనం విషయంలో మునిసిపల్‌ కమిషనర్‌ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసిన మచిలీపట్నం మునిసిపల్‌ కమిషనర్, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ పదే పదే నోటీసులు జారీ చేయడంపై మండిపడింది.

‘ఇంపాక్ట్‌ ఫీజు వసూలు చేసి ఆక్యుపెన్సీ సర్టీఫికెట్‌ (ఓసీ) జారీ చేయాలన్న మా ఆదేశాలకు విరుద్ధంగా, అలాగే సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మళ్లీ ఎలా నోటీసులు ఇస్తారు? మచిలీపట్నం మునిసిపల్‌ కమిషనర్‌ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయి.  సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపడుతాం. మా ఆదేశాల మేరకు ఎందుకు ఆక్యుపెన్సీ సర్టీఫికెట్‌ ఇవ్వలేదో, ఎందుకు పదే పదే నోటీసులు ఇస్తున్నారో కమిషనర్‌ వివరణ ఇవ్వాలి. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలి. కోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించా­రో స్పష్టంగా చెప్పాలి.  కోర్టు ఆదేశాలంటే నవ్వు­లాట అనుకుంటున్నారా? కోర్టు పవర్‌ ఏంటో రాష్ట్రంలోని అధికారులందరికీ చూపిస్తాం.  చట్టం కంటే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు.

 ఇలాంటి వారిని ఎక్కడ నిలబెట్టాలో తమకు బాగా తెలుసు. ఒక అధికారిని కటకటాల వెనక్కి పంపితే అధికారులందరూ దార్లోకి వస్తారు’’ అని హెచ్చరించింది.  వాదనల సమయంలో కమిషనర్‌ తరఫు న్యాయవాది ఆయన చర్యలను సమర్థిస్తుండగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటే కమిషనర్‌కు ఇంగ్లీష్‌ రాదని అనుకోవాలా? లేక అర్ధం కాలేదని అనుకోవాలా?’ అంటూ మండిపడ్డారు. తానిచ్చిన ఉత్తర్వులతో పాటు సీజే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని న్యాయమూర్తి గుర్తు చేశారు.  కమిషనర్‌ జారీ చేసిన నోటీసులను రద్దు చేస్తూ తదు­పరి విచారణ­ను ఫిబ్ర­వరి 9కి వాయిదా వేశారు.  ఈ మేర­కు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆక్యుపెన్సీ సర్టీఫికెట్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తే,. ఇవ్వడం సాధ్యం కాదన్నారు..
తమ పార్టీ కార్యాలయ భవనానికి ఆక్యు­పెన్సీ సర్టీఫికేట్‌ ఇవ్వాలన్న సింగిల్‌ జడ్జి ఆదేశాలకు, అలాగే తాము సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా అక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీపై నిర్ణయం తీసుకోవాలన్న సీజే ధర్మాసనం ఉత్తర్వులకు విరుద్ధంగా మచిలీçపట్నం మునిసిపల్‌ కమిషనర్‌ తిరిగి తమకు నోటీసులు జారీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి నిరాకరిస్తూ జారీ చేసిన ఎండార్స్‌మెంట్‌ను కూడా ఆయన సవాలు చేశారు.  నాని తరఫున న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పార్టీ కార్యాలయ భవన నిర్మాణంపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు వివరణలు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా  పదే పదే నోటీసులు ఇస్తున్నారన్నారు. భవన నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ, నిర్మాణ పనులను ఆపాలంటూ నోటీసు ఇచ్చారని తెలిపారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
YSRCP
office building
machilipatnam
Municipal Commissioners
Andhra Pradesh High Court
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.