Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. విదేశాల వైపు.. నర్సుల చూపు
ADVERTISEMENT 

విదేశాల వైపు.. నర్సుల చూపు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
111.jpg

యువతలో పెరుగుతున్న ఆసక్తి

ఏపీ నుంచి గత ఏడాది నర్సింగ్‌ కౌన్సిల్‌లో 2,821 ఫారిన్‌ వెరిఫికేషన్‌లు

ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,662 పూర్తి

రూ.లక్షల్లో జీతం... ఇండియాతో పోలిస్తే తక్కువ పని ఒత్తిడి... వీలైతే వసతి సౌకర్యం.. ఇలా అన్ని అంశాలు కలసి వస్తుండటంతో విదేశాల్లో నర్సుల ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే ఏపీ నుంచి కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న యువ నర్సుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. 

విదేశాలకు వెళ్లే వారి సర్టిఫికెట్‌లను నర్సింగ్‌ కౌన్సిల్, నర్సింగ్‌ కళాశాలల్లో వెరిఫికేషన్‌ చేస్తారు. ఈ విధంగా 2023లో ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో 2,821 వెరిఫికేషన్‌లు చేపట్టారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌ మధ్య 1,662 వెరిఫికేషన్‌లు పూర్తయ్యాయి.  – సాక్షి, అమరావతి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేష కృషి
యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్లో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నర్సింగ్‌ కౌన్సిల్‌తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్‌ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జర్మనీ, జపాన్‌వంటి దేశాలకు పంపేందుకు అక్కడి భాషల్లో శిక్షణ కూడా ఇప్పించింది.

పెద్ద దేశాల్లో విస్తృత అవకాశాలు
భారత్‌ నుంచి ఎక్కువ మంది ఐర్లాండ్, సింగపూర్, అరబ్‌ దేశాలకు వెళ్తున్నారు. ఆ దేశాల్లో కొన్నేళ్లు పని చేసి నైపుణ్యం పెంచుకుని ఆస్ట్రేలియా, అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళుతున్నారు. నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు పూర్తి చేసి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలపైగా గొడ్డు చాకిరి చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య వేతనాలు ఇస్తు­న్నట్టు నర్సులు చెబుతున్నారు. 

అదే యూఎస్‌ఏలో సగటున నెలకు రూ.3.15 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.4.70 లక్షలు, జర్మనీలో రూ.3.15 లక్షలు, సింగపూర్‌లో రూ.2.50 లక్షలపైనే ఉంటోంది. దీనికి తోడు అక్కడ పని గంటలు కూడా మనతో పోలిస్తే చాలా తక్కువ.. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకోవడంతో వలసలపై ఆసక్తి పెరుగుతోంది. 

యూకేలో భారతీయులే అధికం
విదేశాల్లో మన వైద్యులు, సిబ్బంది చాలామందే పనిచేస్తున్నట్లు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. యూకే 2022–23 ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ ప్రకారం ఆ దేశంలో కొత్తగా రిక్రూట్‌ అయిన వైద్యుల్లో 20%, నర్సుల్లో 46% భారతీయులు ఉన్నట్టు వెల్లడైంది. నర్సింగ్, మిడ్‌వైఫరీ రిజిస్టర్‌ బోర్డ్‌ ఐర్లాండ్‌లో 2023లో 15,060 మంది భారతీయ నర్సులు నమోదు చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. 2022లో 11,957 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు.  

విద్యార్హతలునర్సింగ్‌ రంగంలో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాలనుకునే వాళ్లు తొలుత బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో అర్హత సాధించాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర/నేషనల్‌ నర్సింగ్‌ కౌన్సెల్‌లో రిజిస్ట్రర్‌ చేసుకుని ఉండాలి. కనీసం రెండేళ్ల క్లినికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓటీ, ఐసీయూ వంటి విభాగాల్లో అనుభవజ్ఞులైన వారికి విస్తృత అవకాశాలుంటాయి. 

విదేశాలు వెళ్లాలంటే...
ఎంపిక చేసుకున్న దేశాన్ని బట్టి అక్కడి నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి వీసా ప్రాసెస్‌ చేస్తారు. ఉదాహరణకు కెనడా వెళ్లాలనుకునే వాళ్లు తొలుత నేషనల్‌ కౌన్సిల్‌ లైసెన్సర్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్‌) అర్హత సాధించాలి. దీంతో పాటు ఐఈఎల్‌టీఎస్‌/టోఫెల్‌ వంటి ల్యాంగ్వేజ్‌ పరీక్షలో అర్హత సాధిస్తే.. వారికి వీసా ప్రాసెస్‌ చేసి, అక్కడ ఉద్యోగం చేయడానికి వీలు కల్పిస్తారు. అదే సింగపూర్‌ వెళ్లాలనుకునే వాళ్లు ఎస్‌ఎన్‌బీ లైసెన్స్‌ ఎగ్జామ్‌ పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇది పాసైన వాళ్లకు యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్‌ వంటి దేశాల్లోను పని చేయడానికి అర్హత లభిస్తుంది. 

భారత్‌లో కొరత
ఇదిలా ఉంటే, మన దేశంలో జనాభాకు సరిపడా ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదు వేల మందికి సగటున 10 మంది నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా దేశంలో కేవలం సుమారు 35 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఓ మోస్తరు పెద్ద ప్రైవేట్‌ ఆస్పత్రులు నర్సుల కొరతను అధిగమించేందుకు ఏకంగా కాలేజీలను కూడా ప్రారంభించడం పరిపాటిగా మారింది.

ఇమిగ్రేషన్‌ చెక్‌ రిక్వైర్డ్‌ (ఈసీఆర్‌) కింద ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 2015–21 మధ్య విదేశాలు వెళ్లిన నర్సుల సంఖ్య


 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
nurses
Nursing Colleges
India
abroad
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.