Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఎస్‌ఆర్‌ఎం, విట్‌కు చెరో 100 ఎకరాలు
ADVERTISEMENT 

ఎస్‌ఆర్‌ఎం, విట్‌కు చెరో 100 ఎకరాలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 22, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cbn.jpg

అమరావతిలో కట్టబెట్టేందుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ 

సాక్షి, అమరావతి: రాజధానిలో భూములు కేటాయించినందుకు ఒకపక్క కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎకరానికి రూ.నాలుగైదు కోట్ల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అదే చోట ప్రైవేట్‌ సంస్థలకు వందల ఎకరాలను భారీ తగ్గి­ంపు ధరలకు కట్టబెడుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థల ప­ట్ల ఒకలా.. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించే పైవే­ట్‌ సంస్థల పట్ల మరోలా వ్యవహరించడంపై విస్మ­యం వ్యక్తమవుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజ«­దాని రైతుల నుంచి తీసుకున్న భూములను గతంలో ఇచ్చిన ప్రైవేట్‌ సంస్థలకే మళ్లీ మళ్లీ పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఎస్‌ఆర్‌ఎం, విట్‌ అమరావతిలో ఎకరం రూ.2 కోట్లు చొప్పున ఒక్కో సంస్థకు వంద ఎకరాలు చొప్పున కేటాయించేందుకు తాజాగా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. కాగా ఈ రెండు ప్రైవేట్‌ యూనివర్సిటీలకు గతంలోనే టీడీపీ హయాంలో ఎకరం రూ.50 లక్షలు చొప్పున ఒక్కో విద్యాసంస్థకు అమరావతిలో ఏకంగా 200 ఎకరాలు కేటాయించడం గమనార్హం. 

తాజాగా కేటాయిస్తున్నవి దీనికి అదనం. సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పార్దసారథి మీడియాకు వెల్లడించారు. నాలా చట్టం 2006 వల్ల సాగు భూములు వ్యవసాయే­త­ర అవసరాల మార్పిడికి అనుమతి పొందే ప్రక్రియ సంక్లిష్టతతో ఉన్నందున ఈ చట్టం రద్దు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు ఆర్డినెన్స్‌ జారీకి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 

నాలా చట్టం ర­ద్దు నేపథ్యంలో అందుకు అనుగుణంగా  ఆంధ్రప్రదేశ్‌ మె­ట్రోపాలిటన్‌ రీజియన్‌–అర్బన్‌ డెవల‹­³మెంట్‌ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ ప్లానింగ్‌ చట్టం 1920, ఆంధ్రప్రదేశ్‌ మునిసిపాలిటీలు చట్టం 1965లకు సవరణల ప్రతిపాదనను ఆమోదించినట్లు చెప్పారు. కేబినెట్‌ ఇతర నిర్ణయాలు ఇవీ.. 

» గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2,954 చదరపు గజాల మునిసిపల్‌ భూమి గతంలో 33 సంవత్సరాలు లీజుకు కేటాయించగా ఇప్పుడు ఎకరం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లపాటు లీజు పెంచుతూ ఆమోదం.  
» హోటళ్లు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపులో మరిన్ని రాయితీలు కల్పించేందుకు పర్యాటక విధానంలో మార్పులకు ఆమోదం. 
»  చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం పీపీపీ విధానంలో అభివృద్ధి. భూసేకరణ, ఇతర అవసరాలకు హ­డ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆమోదం.  
»  ఆంధ్రప్రదేశ్‌ సర్క్యులర్‌ ఎకానమీ – వ్యర్థ పదార్థాల పునరి్వనియోగ విధానం 2025–30కు ఆమోదం.  
» ఐఎంఎఫ్‌ఎల్, బీర్, వైన్, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్‌ కమిటీ నిర్ణయించిన ధరలకు ఆమోదం. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ధరల నిర్ణయం. 
» అధికార భాషా కమిషన్‌ పేరు ‘‘మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్‌’’గా మార్పు 
» అమరావతి క్యాపిటల్‌ సిటీలో క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ కింద ల్యాండ్‌ పూలింగ్‌ జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఈపీసీ కింద టెండర్లకు అనుమతి. మౌలిక సదుపాయా­ల కోసం రూ.904.00 కోట్లకు పరిపాలనా ఆమోదం.  
»  గ్రామ, వార్డు సచివాలయాల్లో వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ నుంచి ‘విద్య’ తొలగించి వార్డు సంక్షేమ, అభివృద్ధి సెక్రటరీకి అప్పగించేందుకు ఆమోదం. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 పోస్టులు సృష్టించడంతో పాటు మొత్తం 2,778 పోస్టులు డిప్యుటేషన్, ఔట్‌ సోర్సింగ్‌లో భర్తీకి ఆమోదం. 
»  మాన్యువల్‌ స్కావెంజర్స్‌ నియామకంపై నిషేధం. ఆ వృత్తిలో ఉన్నవారికి పునరావాస చర్యలకు ఆమోదం. ఏపీ యాచక చట్టంలో వికలాంగులు, కుష్టు వ్యాధి బాధితుల పట్ల వివక్షపూరిత పదాలను తొలిగించే ముసాయిదా బిల్లుకు ఆమోదం. 
» పుష్కర ఎత్తిపోతల పథకంలో ప్రెజర్‌ మెయిన్‌ పైపు మార్చేందుకు రూ.51.67 కోట్లకు పరిపాలన అనుమతి. 
»  ఏఎస్‌ఆర్‌ జిల్లా చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 100 పడకల ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు ఆమోదం. 
» అంతర్జాతీయ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ సాయి మైనేనికి స్పోర్ట్స్‌ కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌– ఐ సర్వీసెస్‌) ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.  
»  పల్నాడు జిల్లా గుండ్లపాడులో హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇచ్చేలా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. 
»  వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలం వడ్డిరాల, దొడియం గ్రామాల్లో 1,200.05 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా అదానీ సోలార్‌ ఎనర్జీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం. 
» ఆంధ్రప్రదేశ్‌ సముద్ర విధానం 2024–29 సవరణకు ఆమోదం. 
» నారావారిపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 50 పడకల సీహెచ్‌సీగా అప్‌గ్రెడేషన్‌.  
»  చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరుగానిపల్లెలో కేంద్రీయ విద్యాలయ పాఠశాల ఏర్పాటుకు వీలుగా 7.74 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా అప్పగించేందుకు ఆమోదం. 
» గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర నిధులతో ‘సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ యోగా అండ్‌ నేచురోపతి’ ఏర్పాటుకు 12.96 ఎకరాల ప్రభుత్వ భూమి ఆయుష్‌ శాఖకు అప్పగించేందుకు ఆమోదం. 
» అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయ భవనంలో నిర్మాణ పనుల నిర్వహణకు  రూ.160 కోట్లకు పరిపాలనా అనుమతి. 
» 62 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యూటీ ఇస్తూ గతంలో జారీ చేసిన జీవోకు ఆమోదం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
capital
private educational institutions
Lands
Chandrababu Naidu
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.