అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒక్కటే. అది మనుషుల్లోనైనా, మూగ జీవాల్లోనైనా. ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ ఇటిక్యాల పహాడ్ లో ఆవు దూడపై పులి దాడి చేసింది. అయితే పశు యజమాని, ఆవు దూడపై పులి దాడి చేసిన చోటును గాలిస్తుండగా, అది చూసిన ఆవు.. వారిని తన వెంట తీసుకెళ్లింది.