ADVERTISEMENT
వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని.. వాటిని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆందోళనలు చేపట్టింది. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కాకినాడ జిల్లాలో కదంతొక్కిన మహిళామణులు
- కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన
- మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అనిత రాజీనామా చేయ్యాలని డిమాండ్
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేత
21 Jul 2026, 02:57 PM
ఏలూరులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన
- కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు, అరాచకాలు నిరసిస్తూ... ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన
- ఏలూరు పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన.. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితా రెడ్డి
- నిరసనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు, ఏలూరు ఇన్చార్జ్ జయప్రకాష్
21 Jul 2026, 02:53 PM
హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి
- కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రీకాకుళం మహిళా విభాగం ఆందోళన
- మహిళలపై అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్
- శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
- కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉలాల భారతి, జిల్లా ఉపాధ్యక్షురాలు మెంటాడ పద్మావతితో పాటు పలువురు మహిళా నేతలు
అనిత నువ్వు కూడా ఒక మహిళవే కదా.. ఎందుకు ఆ మౌనం..? pic.twitter.com/4EPYfYVGwQ
— Sakshi (@SakshiNews) July 21, 2026
21 Jul 2026, 02:20 PM
పల్నాడు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
- రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడులు అత్యాచారాలు, హత్యలు అరాచకాలు నిరసిస్తూ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మహిళల భారీ ర్యాలీ
- అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి వినతి పత్రం ఇచ్చిన సత్తెనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
- నిరసనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు, కార్యకర్తలు
21 Jul 2026, 02:13 PM
భీమవరంలో భారీ నిరసన ర్యాలీ
- పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆధ్వర్యంలో కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా
- ప్రకాశం చౌక్ వద్ద నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టిన జిల్లా మహిళా విభాగం నాయకులు
- పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత, నర్సాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె శ్రీ వెంకటరమణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల
21 Jul 2026, 02:09 PM
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT