Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. వ్యవసాయం.. యువరైతు దూరం!
ADVERTISEMENT 

వ్యవసాయం.. యువరైతు దూరం!

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 12, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
farm.jpg

సాక్షి, వరంగల్‌: రాష్ట్రంలో వ్యవసాయానికి యువరైతులు దూరమవుతున్నారు. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూ కమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోక ఈ రంగాన్నే వీడుతున్నారు. నగరీకరణకు అనుగుణంగా గ్రామాల్లోనూ జీవనోపాధి ఖర్చులు పెరగడంతో అంత మేర ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మరలుతున్నారు. 

ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డెవలప్‌మెంట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్, గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ ఇంక్యుబేటర్, ట్రాన్స్‌ఫార్మింగ్‌ రూరల్‌ ఇండియా సంస్థలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థలు ‘స్టేట్‌ ఆఫ్‌ రూరల్‌ యూత్‌ ఎంప్లాయ్‌మెంట్‌–2024’ పేరుతో ఇటీవల నివేదికను  విడుదల చేశాయి.

వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో యువ రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొనేందుకు లేదా ఇతర రంగాలను ఎంచుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 60 శాతం మంది యువత సాగును వీడారని పేర్కొంది. 

చిన్న కమతాలు ఎక్కువే... : రాష్ట్రంలో సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్‌ (2.47 ఎకరాలు) నుంచి 0.89 హెక్టార్ల (2.19 ఎకరాలు)కు తగ్గింది. కుటుంబాల విభజనతో భూముల పంపకంతోపాటు కొత్తగా సాగు, జీవనోపాధి కోసం సొంతంగా భూముల కొనుగోళ్లకు మొగ్గు చూపడం తదితర కారణాలతో చిన్న కమతాలు పెరిగాయి. 2.47 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని సన్నకారు, 2.48 నుంచి 4.94 ఎకరాలను చిన్నకారు, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాలను పాక్షిక మధ్యతరహా, 9.89 నుంచి 24.77 ఎకరాలుంటే మధ్యతరహా, 24.78 ఎకరాలకన్నా పైన ఉంటే పెద్ద భూకమతంగా పేర్కొంటున్నారు.

 రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, భద్రాద్రి జిల్లాల్లో 1.5, 1.4, 1.3 హెక్టార్ల విస్తీర్ణం సగటున ఉంటే కరీంనగర్, వరంగల్‌ జిల్లా, మెదక్‌ జిల్లాల్లో 0.75, 0.74, 0.60 హెక్టార్లుగా సగటు విస్తీర్ణం ఉంది. రాష్ట్రంలో చిన్న కమతాలతో సేద్యం ఎక్కువగా జరుగుతుందని ఇటీవల విడుదలైన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక పేర్కొంది.  

వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన ఇతని పేరు గారె రాజు. అతనికి వారసత్వంగా ఎకరం భూమి ఉంది. ఇది పంట సాగుకు సరిపోకపోవడంతో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. ట్రాక్టర్‌ కూడా కొన్నాడు. 2020 నుంచి 2024 వరకు రూ. లక్షలు వెచ్చించి వ్యవసాయం చేసినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదు. దీంతో ఫొటోగ్రఫీని జీవనాధారంగా మార్చుకున్నాడు. వ్యవసాయంపై ప్రేమ ఉన్నా సాగు ఖర్చులకు తగ్గట్టు లాభాల్లేక సాగుకు దూరమైనట్లు చెప్పాడు. 

పెట్టుబడి ఖర్చుకు తగ్గ ఆదాయం రాక అవస్థలు 
» చిన్న భూకమతాలు, వాతావరణ అనిశ్చి తి, తక్కువ దిగుబడులూ కారణం  
» కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ  ఉపాధి వైపు అడుగులు 
» స్టేట్‌ ఆఫ్‌ రూరల్‌ యూత్‌ ఎంప్లాయ్‌మెంట్‌–2024 నివేదికలో వెల్లడి 
»  యువతకు నైపుణ్యాల పెంపుతో ఆదాయం పెంచొచ్చంటున్న నిపుణులు 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలి
వ్యవసాయానికి దూరమవుతున్న యువతకు బ్రేక్‌ వేయాలంటే విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను విస్తృతంగా నెలకొల్పాలి. మొక్కజొన్నల నుంచి పేలాల తయారీ, మామిడి నుంచి గుజ్జు తీయడం, మిరపకాయ నుంచి కారం... ఇలా వివిధ పరిశ్రమలను గ్రామాల్లో నెలకొల్పాలి. అలాగే యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలి.  – ఉమారెడ్డి, ఏడీఆర్, వరంగల్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం

ట్రైనింగ్‌ కోర్సులు అందించాలి 
యువ రైతులకు పంటల సాగు పద్ధతులపై సరి్టఫికెట్‌ ట్రైనింగ్‌ కోర్సులు అందించాల్సిన అవసరం ఉంది. యాంత్రీకరణతో కూడిన యాజమాన్య పద్ధతులు తీసుకురావాలి. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను విస్తృతం చేయాలి. ఈ కేంద్రాల ద్వారా పనిముట్లను అద్దెకు ఇస్తే యువ రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలి. అప్పుడే యువ రైతులకు మేలు జరుగుతుంది.     – కె. భాస్కర్, సంచాలకుడు,  జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం, మహబూబాబాద్‌ జిల్లా  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Employment
Agriculture
young farmer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.