Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మహిళ చేతికే మంత్రదండం
ADVERTISEMENT 

మహిళ చేతికే మంత్రదండం

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 17, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
women.jpg

62% పీఠాల్లో చైర్‌పర్సన్, మేయర్‌ స్థానాల్లో అతివలు

పుర పోరులో మహిళా ప్రభంజనం

జనరల్‌ కేటగిరీలోనూ మహిళలకు దక్కిన అవకాశం

పాలనలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే మరింత రాజకీయ భవిష్యత్తు

రాష్ట్రంలో మొత్తంమీద బీసీలకు 58 శాతం పదవులు

సాక్షి, హైదరాబాద్‌: పురపోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రంలో పురపాలనను వారు శాసించనున్నారు. అతివలకు రిజర్వ్‌ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్‌పర్సన్‌ స్థానాలను అలంకరించారు. కార్పొరేషన్లలో మాత్రం రిజర్వ్‌ చేసిన మూడు స్థానాల్లోనే మేయర్‌ పీఠాలను దక్కించుకున్నారు, మహిళలకు ఇతర రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సోమవారం నిర్వహించిన చైర్‌పర్సన్‌/మేయర్‌ ఎన్నికల ఫలితాల్లో 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఏకంగా 64 శాతం పదవులను మహిళలు దక్కించుకున్నారు. వారు ఏకంగా 72 చోట్ల పురపాలన పగ్గాలు చేపట్టారు. అయితే, ఎన్నికలు వాయిదా పడిన మరో 11 మున్సిపాలిటీల్లో ఇప్పటికే మహిళలకు 4 రిజర్వ్‌ అయ్యాయి. మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారు 76 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు అవుతుంది. అంటే దాదాపు 62 శాతం పదవులను దక్కించుకున్నట్లు అవుతుంది. మహిళలు వారికి కేటాయించిన 50 శాతం రిజర్వేషన్ల కంటే 12 శాతం అధికంగా పదవులు దక్కించుకుంటుండటం విశేషం.  

చట్టసభల్లోనూ అమల్లోకి వస్తే..  
మహిళలు తెరచాటు వ్యక్తులుగా కాకుండా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో.. 2029లో చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే.. ఎంతమంది మహిళా రాజకీయ వేత్తలు చట్టసభలకు వెళ్తారనేది ఆసక్తికరం. చైర్‌పర్సన్‌లుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు కూడా అధికంగా ఉండటం గమనార్హం. బీసీ, ఎస్సీ, అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లలోనూ వారు విజయం సాధించడం గమనార్హం. వార్డు సభ్యుల ఎన్నికలోనూ వారు అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లలో గెలుపొంది సత్తాచాటారు. రాష్ట్రంలో మహిళలకు పదవులు ఇస్తూ వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించడం మంచి పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


స్థానిక సంస్థల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. దీనివల్ల ఆ సమస్యల పరిష్కారానికి వారు ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. రాజకీయ నాయకులు తమకు అవకాశం రానిచోట తమ ఇంట్లోని మహిళలను రంగంలోకి దించారు. అయితే అధికారం అందుకున్న తరువాత పాలనపై తమదైన ముద్ర కనిపించాలంటే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే వారి భవిష్యత్తు రాజకీయంగా మరింత ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 
 
విద్యాధికులు 
చైర్‌పర్సన్‌/మేయర్‌ స్థానాలు అధిరోహించిన మహిళల్లో విద్యాధికులూ ఉన్నారు. వీరిలో 8 మంది పీజీ చేసిన వారు ఉంటే.. 23 మంది గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారున్నారు. ఒక డాక్టర్‌ ఉన్నారు. అలాగే, టెన్త్, ఇంటర్‌ చదివిన వారూ ఉన్నారు.  

బీసీలకు 58 శాతం పదవులు 
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జోరుగా ఆందోళన జరగడం, అది చట్టబద్ధత సాధించడానికి అనేక అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో 112 చైర్‌పర్సన్‌/మేయర్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీసీలకు 58.03 శాతం పదవులు దక్కాయి. ఇందులో ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా 22 పదవులు దక్కగా.. ఆ తరువాత గౌడ్‌లకు 8, ముదిరాజ్‌లకు 7, యాదవ సామాజిక వర్గానికి 5 చైర్‌పర్సన్‌ పదవులు లభించాయి. వీరు కాకుండా లింగాయత్‌. బెస్త, పద్మశాలి, స్వర్ణకారులు, బోయ, తేలి, కురుమ, రెడ్డిక సామాజిక వర్గాల వారూ ఉన్నారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
womens
Telangana Municipal Elections Results 2026
Municipal chairperson
Mayor Elections
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.