Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మురిపించిన ‘నైరుతి’
ADVERTISEMENT 

మురిపించిన ‘నైరుతి’

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
trsind.jpg

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు

సీజన్‌ సగటు వర్షపాతం 74.06 సెంటీమీటర్లు

నమోదైన సగటు 98.83 సెంటీమీటర్లు

33 శాతం అధికంగా కురిసిన వర్షాలు

ఏడు జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణం

ప్రస్తుతం వేగంగా నైరుతి ఉపసంహరణ ప్రక్రియ

ఈ నెల రెండోవారంకల్లా రాష్ట్రం నుంచి నిష్క్రమణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు ఈసారి నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలనిచ్చాయి. జోరు వానలతో సీజన్‌ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత వారానికి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్‌ నెలంతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్ప­డ్డాయి. 

జూలై మూడోవారం వరకు అదే పరిస్థితి కొనసాగింది. తర్వాత రుతుపవనాలు రాష్ట్రంపై అత్యంత చురుకుగా కదలటంతో మోస్తరు నుంచి భారీ, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో వర్షపాతం గణాంకాలు అమాంతం పైకి ఎగబాకాయి. సీజన్‌ ముగిసేనాటికి సాధారణాన్ని దాటి అధిక వర్షపాతానికి చేరింది.

33 శాతం అధిక వర్షపాతం
జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కాలాన్ని నైరుతి సీజన్‌గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో నాలుగు నెలల్లో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. సీజన్‌ ముగిసే నాటికి ఈసారి 98.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ సగటు కంటే 33 శాతం అధికంగా నమోదైంది. గతేడాది నైరుతి సీజన్‌లో 96.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా... ఈ సీజన్‌లో 3 శాతం అధికంగా నమోదైంది. 

నైరుతి సీజన్‌ తొలి రెండు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిశాయి. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో గణాంకాలు భారీగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. 84 శాతం నీటి వనరులతో పూర్తిగా నిండినట్లు నీటిపారుదల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

రెండోవారంలోగా ఉపసంహరణ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉప­సంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఉత్త­రాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల నుంచి ఉపసంహరణ పూర్తయింది. ఈ నెల రెండోవారం నాటికి రాష్ట్రం నుంచి నైరుతి విరమణ పూర్తవుతుందని వా­తావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విర­మణ సమయంలోనూ వర్షాలు ఆశాజనకంగా ఉండనున్నాయి. సాధారణం కంటే అధికంగా నమో­దు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్‌ వరకు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని చెబుతోంది.

33 జిల్లాల్లో వానలు సంతృప్తికరంగా కురిశాయి. 7 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, మరో 8 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదయ్యాయి. 128 మండలాల్లో అత్యధిక వర్షాలు, 299 మండలాల్లో అధికం, 191 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 3 మండలాల్లో మాత్రం సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు నమోదయ్యాయి. 

అత్యధిక వర్షాలు: మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, వనపర్తి

అధిక వర్షాలు: నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌–మల్కాజిగిరి, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిర్మల్, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం.

సాధారణ వర్షాలు: నిజామాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
rains
Meteorological Department (IMD)
southwest monsoon
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.