Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అవునూ..  మన అడవుల్లో ఏనుగెందుకు లేదు?
ADVERTISEMENT 

అవునూ..  మన అడవుల్లో ఏనుగెందుకు లేదు?

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 11, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ele.jpg

మీరు ఓ విషయాన్ని గమనించారా? మన రాష్ట్రంలో జూలో తప్ప అడవుల్లో ఏనుగులు లేవు. చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉన్నాయి. దక్షిణాదిలో అయితే.. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మందలు మందలుగా కనిపిస్తే.. ఇటు ఏపీలోనూ పదుల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. మరి తెలంగాణలో ఎందుకు లేవు? ఇటీవలే ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ డాక్యుమెంటరీకి ఆస్కార్‌ పురస్కారం దక్కిన నేపథ్యంలో ఏనుగుల మీదకు అందరి దృష్టి మళ్లింది. ఈ నేపథ్యంలో అసలు గజరాజు తెలంగాణలో ఎందుకు లేడు? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు రాడు? అన్న  విషయంపై ఓ లుక్కేద్దామా..  – సాక్షి, హైదరాబాద్‌



ఎందుకు లేవు.. ఎందుకు రావు.. 

♦తెలంగాణలో ఏనుగులు కనిపించకపోవడానికి ప్రధానంగా భౌగోళిక, వాతావరణ పరిస్థితులే కారణం. తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాలు భౌగోళికంగా దక్కన్‌ పీఠభూమిపై ఉండటంతోపాటు అడవుల మధ్య ‘డ్రై ఏరియా’ కారణంగా చారిత్రకంగానే ఇక్కడ ఏనుగులు లేవు. తెలంగాణకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని జిల్లాలన్నీ (పూర్వపు హైదరాబాద్‌ స్టేట్‌లోని) పొడి వాతావరణం, వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలే. రాయచూర్, గుల్బర్గా, అకోలా, బీదర్, నాందేడ్‌ తదితర చోట్లా ఏనుగులు లేకపోవడంతో తెలంగాణలో ఏనుగుల ప్రవేశానికి అవకాశాలు లేకుండా పోయాయి. 

♦ఏనుగులు స్థిర నివాసం ఏర్పరుచుకోవాలంటే దట్టమైన అడవులు, పచ్చదనం అవసరం. కనీసం 1,000–1,500 మిల్లీమీటర్ల వర్షపాతముండే ప్రాంతాలు కావాలి. తేమ వాతావరణం ఉండాలి. కనీసం 7, 8 నెలల పాటైనా అడవుల్లోని చెట్లు ఆకులు కలిగి ఉండాలి. గడ్డి ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఒక్కో ఏనుగుకు సగటున రోజుకు 150 నుంచి 200 కేజీల మేత అవసరం. ఒక గుంపులో ఐదు ఏనుగులుంటే రోజూ టన్ను మేత కావాలి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి దట్టమైన అడవులు లేకపోవడం వల్ల.. పెద్ద పులులు, ఇతర జంతువులు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి, స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నా ఏనుగులు మాత్రం రావడం లేదు. 

♦ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగులున్న చిత్తూరు, విజయనగరం జిల్లాల నుంచి తెలంగాణలోకి రావడానికి ఎలాంటి అడవుల కనెక్షన్‌ లేదు. మధ్యలో మైదాన ప్రాంతాలను దాటి ఏనుగులు ఇటు వచ్చేందుకు అవకాశాల్లేవు. ఏపీ సరిహద్దుల్లో ఖమ్మంకు ఆనుకుని పశ్చి మగోదావరి, మహబూబ్‌నగర్‌కు ఆనుకుని కర్నూలు, నల్లగొండ వైపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏనుగులు లేవు. దీనితో తెలంగాణలోకి వచ్చే పరిస్థితి లేదు. 

♦ గతంలో ఉమ్మడి ఏపీలోకి రెండు మార్గాల్లో ఏనుగులు వచ్చాయి. ఒకటి.. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అడవుల నుంచి వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాలు కూడా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఆయా చోట్ల ఏనుగుల సంతతి పెరగడంతో పొరుగునే ఉన్న ఏపీలోకి ప్రవేశించాయి. స్థిరనివాసం ఏర్పరుచుకునే వాతావరణం, పరిస్థితులు ఉండడంతో ఇక్కడే ఉండిపోయాయి. 

♦ ఇక రెండోది.. ఒడిశాకు పలుమార్లు భారీ వరదలు రావడంతో సరిహద్దుల్లోని విజయనగరం జిల్లాకు కొన్ని ఏనుగులు వలస వచ్చాయి. తిరిగి వెళ్లకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయాయి. అదేవిధంగా జార్ఖండ్‌ నుంచి కూడా ఏనుగులు వలస వచ్చాయి. 

చారిత్రకంగా, భౌగోళికంగా, ఇతర ప్రధాన కారణాలతో తెలంగాణలో ఏనుగులు లేవు. ఏపీలోని నాగార్జునసాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఏనుగులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగును నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒక కారిడార్‌ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు.

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెద్దపులులు అసలు లేకపోవడం, ఇటు తెలంగాణలో ఏనుగులు లేకపోవడంతో.. రెండు ప్రాంతాల్లో పరస్పరం పులులు, ఏనుగులను మార్పిడి చేస్తే బావుంటుందని అంచనా వేశారు. ఈ విధంగా చేయడం ద్వారా మొత్తం ఉమ్మడి ఏపీవ్యాప్తంగా పుష్కలంగా వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్యంతో కూడిన మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.  – ఎ.శంకరన్, ఓఎస్డీ, తెలంగాణ అటవీ శాఖ, వైల్డ్‌ లైఫ్‌ విభాగం  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
elephants
Oscar
Telangana
Sankaran
documentary
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.