Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఒక్క వానకే.. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై వ‌ర‌ద‌!
ADVERTISEMENT 

ఒక్క వానకే.. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై వ‌ర‌ద‌!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kothaguda-flyover-Flood.jpg

ఒక్క వానకే నడుము లోతులో వరద నీటి ప్రవాహం.. 

నీట మునిగిన అండర్‌ పాస్‌

ఫ్లై ఓవర్‌పై వరద నీరు చేరడం కనీవినీ ఎరగం... కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ఫ్లైఓవర్‌పై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.. ఫ్లై ఓవర్‌ కింద ఉన్న అండర్‌ పాస్‌ నీట మునగడం, మరో వైపు కొత్తగూడ జంక్షన్‌లో భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులకు దిక్కుతోచలేదు. హైద‌రాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లై ఓవర్, అండర్‌ పాస్, జంక్షన్‌ నీట మునగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి హైడ్రా మాన్‌సూన్, జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు బాధ్యత వహించాల్సిందేనని వాహనదారులు పేర్కొంటున్నారు.. మ్యాన్‌హోల్స్‌ కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో శేరిలింగంపల్లి వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలో పని చేస్తున్న మాన్‌సూన్‌ బృందాలు, శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జోనల్‌ కమిషనర్‌ అన్ని విభాగాల అధికారులతో వరద పరిస్థితులపై సమన్వయ సమావేశం నిర్వహించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకపోవడంతో భారీగా వరద నీరు (Flood Water) చేరినట్లు స్పష్టమవుతోంది. ఫ్లై ఓవర్‌ పైన, అండర్‌ పాస్, జంక్షన్‌లో వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలో మీటరు ప్రయాణానికి దాదాపు 45 నిమిషాలకు పైగా పట్టిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

గోదారిని తలపించిన ఫ్లై ఓవర్‌...
అంజయ్యనగర్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ వరకు ఉన్న ఫ్లై ఓవర్‌ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై భారీగా వరద నీరు చేరింది. ప్రతి ఫ్లై ఓవర్‌పై వర్షం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వరద నీరు వెళ్లేలా ప్రతి 20 అడుగులకు ఓ రద్రం, కిందికి ఓ పైపును అమర్చుతారు. ఎంత భారీ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని నిర్వహణ లేకపోవడంతో చెత్త, ప్లాస్టిక్‌ కాగితాలతో నిండి పోయాయి. దాదాపుగా అన్ని రంద్రాలు నిండటంతో వరద నీరు కిందికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో భారీ వర్షానికి ఫ్లై ఓవర్‌పై దాదాపు మూడు అడుగుల లోతు నీరు చేరింది. రాకపోకలకు వీలు లేకుండా మారడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మోటార్లు కాలిపోవడంతో నీట మునిగిన అండర్‌ పాస్‌..  
వరద నీటిని పరిగణలోకి తీసుకోకుండా సరైనా ప్లాన్‌ లేకుండా కొత్తగూడ జంక్షన్‌లో అండర్‌ పాస్‌ను ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినప్పుడు వరద నీటితో నిండి పోవడం, వాహనాల రాకపోకలు స్తంభించడం జరుగుతూనే ఉంది. దీంతో అధికారులు కరెంట్‌ మోటార్లు బిగించి వచ్చిన వరద వచ్చినట్లే బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం భారీ వర్షానికి వరద నీరు చేరింది. మోటార్లు కాలిపోవడంతో వరదను తొలగించే పరిస్థితి లేకపోవడంతో అండర్‌ పాస్‌ పూర్తిగా నిండిపోయింది. డీజిల్‌ ఇంజన్లతో రాత్రంతా వరద నీటిని తోడారు. వరద నీటి తొలగింపు పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  


జంక్షన్‌ జామ్‌.. 
కొత్తగూడ జంక్షన్‌తో పాటు మియాపూర్‌  రోడ్డులో భారీగా వరద నీరు చేరింది. హర్ష టయోటా ముందు వరద పోటెత్తడంతో మియాపూర్‌ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.  శుక్రవారం రాత్రి హైడ్రా మాన్‌సూన్‌ టీం వరదను తొలగించే ప్రయత్నాలు చేసినా గంటల తరబడి వాహనదారులు వరదనీటిలోనే ఉన్నారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్, మాదాపూర్‌ వైపు, మాదాపూర్‌ నుంచి మియాపూర్‌ వైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చ‌ద‌వండి: అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Kothaguda
Flyover
Hyderabad Rains
HYDRAA
ghmc
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో వర్షం.. మరో రెండు గంటల్లో..

హైదరాబాద్‌లో వర్షం.. మరో రెండు గంటల్లో..

హైడ్రా.. చట్టానికి అతీతం కాదు

హైడ్రా.. చట్టానికి అతీతం కాదు

'క్యూర్‌' ఎన్నిక‌ల‌పై ఉత్కంఠ‌!

'క్యూర్‌' ఎన్నిక‌ల‌పై ఉత్కంఠ‌!

హైడ్రాలో బైక్‌ టీమ్‌లు

హైడ్రాలో బైక్‌ టీమ్‌లు

మేం జీహెచ్‌ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?

మేం జీహెచ్‌ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?

జీహెచ్‌ఎంసీలో విలీనమైన ప్రాంతాల‌కు మ‌హ‌ర్ద‌శ‌

జీహెచ్‌ఎంసీలో విలీనమైన ప్రాంతాల‌కు మ‌హ‌ర్ద‌శ‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.