Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. పంచాయితీ కాదు.. పరిష్కారం కావాలి
ADVERTISEMENT 

పంచాయితీ కాదు.. పరిష్కారం కావాలి

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 10, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
revanth-reddy.jpg

ఏపీ సహా సరిహద్దు రాష్ట్రాలతో మేం నీటి వివాదాలు కోరుకోవడం లేదు

సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులకు మీరు అడ్డంకులు సృష్టించొద్దు

మీరు సృష్టించే సమస్యల వల్ల అనుమతులు రావడం లేదు

బ్యాంకు రుణాలే కాదు కేంద్ర ఆర్థిక సహకారం కూడా అందడం లేదు

కూర్చొని మాట్లాడుకుందాం.. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిద్దాం

ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే.. మేం 10 అడుగులు వేస్తాం

జల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి పొందే ఆలోచన లేదన్న సీఎం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్‌ పార్టీకి లేదు. సరిహద్దు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో మేము ఎలాంటి వివాదాలను కోరుకోవడం లేదు. పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాం. తద్వారా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆశిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన తెలంగాణ ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రాలు అడ్డంకులు సృష్టించొద్దు. మీరు సృష్టించే సమస్యల వల్ల తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలే కాదు.. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం కూడా అందకుండా పోతోంది. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిద్దాం.

ఇందుకోసం ఏపీ ఒక అడుగు ముందుకేస్తే... పది అడుగులు ముందుకు వేసే తత్వం మాది. పక్క రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ఓ సూచన చేస్తున్నా. నీళ్ల వివాదాన్ని రాజకీయం చెయ్యొద్దు. రాజకీయాలకు అతీతంగా చర్చించి, సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపిద్దాం. ఇందుకోసం న్యాయ స్థానాలు, ఇతరుల సమక్షంలో కూర్చొనే కంటే మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడం ఉత్తమం. మీకు పంచాయితీలు కావాల్నా? నీళ్లు కావాల్నా? నేనైతే జలాలు కావాలనే కోరుకుంటా. వివాదాలు కావాల్నా? పరిష్కారం కావాల్నా? అంటే పరిష్కారమే కోరుకుంటా..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగర శివార్లలోని రావిర్యాల ఫ్యాబ్‌సిటీలో ‘సుజెన్‌ మెడికేర్‌ ఫ్లూయిడ్స్‌’తయారీ యూనిట్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.  

పక్క రాష్ట్రంతో సయోధ్య అవసరం 
‘కృష్ణా బేసిన్‌లో పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరయ్యాయి. కానీ ఏపీ అభ్యంతరాల వల్ల వాటికి పర్యావరణ, సీడబ్య్లూసీ అనుమతులు, బ్యాంకులు, కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ఇది రాష్ట్రానికి భారంగా పరిణమిస్తోంది. ఇక్కడ డేటా సెంటర్లు పెట్టాలంటే విద్యుత్‌తో పాటు నీరు కూడా కీలకం. కృష్ణానది నుంచి ఇక్కడికి నీటిని తరలించాలన్నా..యాదాద్రి నుంచి కరెంట్‌ తరలించాలన్నా.. పరస్పర సహకారం అవసరం. తెలంగాణకు పోర్టు రావాలన్నా..ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు వేయాలన్నా పక్క రాష్ట్రంతో సయోధ్య, సహకారం అవసరం. అలాగే అమరావతి అభివృద్ధి కావాలంటే హైదరాబాద్‌ సహకారం కూడా ఉండాలి..’అని సీఎం అన్నారు.  

ప్రపంచ దేశాలతోనే పోటీ 
‘రాష్ట్రంలో పారిశ్రామిక, ఇంధన, పర్యాటక, ఎండోమెంట్, మెడికల్‌ పాలసీలను తీసుకొచ్చాం. త్వరలో ఎడ్యుకేషన్‌ పాలసీ కూడా తీసుకురానున్నాం. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్ల రంగంలో రాష్ట్రం పోటీ పడుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి అనుగుణంగా పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుర్గాంవ్‌తో తెలంగాణ పోటీ పడుతోందనే చర్చ పదేపదే జరుగుతోంది. దీనికి పుల్‌స్టాఫ్‌ పెట్టి జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్, టోక్యో, న్యూయార్క్‌ నగరాలతో పోటీ పడాలని ఆలోచన చేస్తున్నాం.

యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లు ప్రారంభించే పరిశ్రమలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. సహాయ సహకారాలు అందజేసి ప్రోత్సహిస్తుంది. దేశ బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. నాలుగు కోవిడ్‌ వ్యాక్సిన్లలో మూడు ఇక్కడి నుంచే వచ్చాయి. సిలికాన్‌ వ్యాలిలోని ఐటీ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్న వారు హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. సక్సెస్‌ స్టోరీలు సృష్టించాలి. ప్రభుత్వం ఇప్పటికే 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచి్చంది. మరో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరికి ప్రైవేటు రంగంలోనూ అవకాశం కల్పించాలి. ఐఎస్‌ఎస్‌ల కన్నా ప్రైవేటు రంగంలోనే ప్యాకేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ప్రైవేటు రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు.  

ఉపాధి అవకాశాలకు పెద్దపీట:.శ్రీధర్‌రాబు 
మెడికేర్, ఫార్మా, లైఫ్‌సైన్స్‌కు సంబంధించిన ఎకో సిస్టమ్‌లో నాలుగు ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ ప్రధానంగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. పరిశ్రమలకు అనుగుణంగా పాలసీలు ఉండాలని భావించి, ఆ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విదేశీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  

ఒడిఎన్‌ మాల్‌ను ప్రారంభించిన సీఎం 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఒడిఎన్‌ మాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, అజహరుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓడిఎన్‌ మాల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
water disputes
Revanth Reddy
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.