Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సికింద్రాబాద్‌–పుణే మధ్య వందే భారత్‌ రైలు
ADVERTISEMENT 

సికింద్రాబాద్‌–పుణే మధ్య వందే భారత్‌ రైలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
train.jpg

మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం

స్లీపర్‌ సర్వీసును ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ఆ కేటగిరీ అయితే.. కొంత జాప్యం జరిగే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌–పుణే మధ్య త్వరలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ మార్గాన్ని రైల్వేబోర్డు నోటిఫై చేసినా.. రైల్‌ రేక్‌ సిద్ధంగా లేకపోవటంతో ప్రారంభించలేదు. ఈ క్రమంలో త్వరలో ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో.. అది ముగిశాక ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది సర్వీసు కొనసాగుతోంది. అది రోజూ మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరుతుంది. వందే భారత్‌ను ఉదయమే బయలుదేరేలా నడిపే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.

స్లీపర్‌ కేటగిరీపై పరిశీలన!
వందే భారత్‌ రైళ్లలో స్లీపర్‌ కేటగిరీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇటీవలే నమూనా రైలు సిద్ధమైంది. ఆ రైలు రేక్స్‌ తయారవుతున్నాయి. ట్రయల్‌రన్‌ తర్వాత వాటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 16 రూట్లను ఈ రైళ్లకోసం ఖరారు చేశారు. మరిన్ని మార్గాలను కూడా ఎంపిక చేయనున్నారు. సికింద్రాబాద్‌–పుణే మధ్య వందే భారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే అంశాన్ని కూడా రైల్వే బోర్డు పరిశీలిస్తోంది.

ఈ నగరాల మధ్య ప్రస్తుతమున్న పుణే శతాబ్ది రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతోంది. కానీ రాత్రివేళ సర్వీసు పెట్టాలన్న డిమాండ్‌ చాలా కాలం నుంచి ఉంది. ఈ క్రమంలో రాత్రివేళ వందే భారత్‌ స్లీపర్‌ సర్వీసును ప్రారంభించి.. ఆ తర్వాత సాధారణ వందే భారత్‌ను శతాబ్ది స్థానంలో ప్రవేశపెట్టాలన్నది రైల్వే యోచన అని సమాచారం.

నాగ్‌పూర్‌ సర్వీసు విఫలంతో..
సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ మధ్య 20 కోచ్‌లతో వందే భారత్‌ రైలు సేవలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల మధ్య నిత్యం నాలుగు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్‌కు డిమాండ్‌ లేకుండా పోయింది. ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కూడా ఉండటం లేదు. నెల గడుస్తున్నా దీనికి ఆదరణ పెరగకపోవటంతో కోచ్‌ల సంఖ్యను తగ్గించి.. ఎనిమిది కోచ్‌లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుణే సర్వీసు ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

సికింద్రాబాద్‌–పుణే మధ్య సర్వీసులు తక్కువ. పైగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలు కావడం, ప్రయాణికుల డిమాండ్‌ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్‌ సర్వీసు విఫలమయ్యే చాన్స్‌ లేదని ప్రాథమికంగా తేల్చారు. వందే భారత్‌ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. సాధారణ వందే భారత్‌ సర్వీసా? స్లీపర్‌ సర్వీసా? అన్నదానిపై మహారాష్ట్ర ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Secunderabad
pune
Vande Bharat Express
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.