Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఊబకాయానికి ఉటోపియా విరుగుడు!
ADVERTISEMENT 

ఊబకాయానికి ఉటోపియా విరుగుడు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 27, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
diabetis.jpg

శరీరంలో కొవ్వును కరిగించే టీకా ఆవిష్కరణ 

ఆకలిని చంపుకోకుండానే బరువు తగ్గే మార్గం 

ఉటోపియా థెరపాటిక్‌ శాస్త్రవేత్త గోపి కడియాల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలో అత్యధిక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. శరీరంలో కొవ్వు పెరుగుతున్నాకొద్ది.. కొత్త కొత్త వ్యాధులు కూడా పెరుగుతాయి. ఊబకాయాన్ని తగ్గించుకొనేందుకు కొందరు శారీరక శ్రమ చేస్తే.. మరికొందరు ఆకలిని తగ్గించే ఒజెంపిక్‌ వంటి మందులపై ఆధారపడుతున్నారు. 

ఇకపై ఇలాంటి కష్టతరమైన పనులతో అవసరం లేకుండా ఒక్క టీకాతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని చెబుతోంది ఉటోపియా థెరపాటిక్స్‌ సంస్థ. ఊబకాయాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా ఆవిష్కరణలో సంస్థ సీఈవో డాక్టర్‌ గోపి కడియాల కీలక భూమిక పోషించారు.  

ఇది ఎలా పనిచేస్తుందంటే..: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఊబకాయాన్ని తగ్గించే మందుల్లో అత్యధికం ఆకలిని తగ్గించటం ద్వారా శరీరంలోని కొవ్వును కరిగించే పని చేస్తాయి. ఈ విధానంలో దుష్ప్రభావాలు కూడా అధికమే. అందుకు భిన్నంగా ఉటోపియా సిద్ధం చేసిన టీకా ఆకలిని తగ్గించకుండానే.. నేరుగా శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. తద్వారా ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. 

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా ఈ టీకా నియంత్రిస్తుందని ఉటోపియా చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉదయ్‌ సక్సేనా తెలిపారు. ఈ టీకాను ఇప్పటికే కోళ్లు, ఎలుకలపై ప్రయోగించి చూశామని, శరీరానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్స్‌ 42 శాతం వరకు తగ్గినట్లు గుర్తించామని డాక్టర్‌ గోపి కడియాల చెప్పారు. అలాగే పొట్ట భాగంలో ఉండే విసరల్‌ ఫ్యాట్‌ 24 శాతం తగ్గిందని, ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌లో ఎలాంటి దు్రష్పభావాలు కానీ.. కండర నష్టం, ఆకలి తగ్గిపోవడం వంటివి కనిపించలేదని వెల్లడించారు. 

త్వరలో ఈ టీకాను మనుషులపై కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. వచ్చే ఫలితాల ఆధారంగా టీకాను అందరికీ అందుబాటులోకి తెస్తామని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఉటోపియా థెరపాటిక్‌ సంస్థకు బయో ఆసియా–2025 సదస్సులో టాప్‌–5 ఉత్తమ స్టార్టప్‌లో ఒకటిగా అవార్డు రావటం విశేషం.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Fat
vaccine
Telangana
obesity
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.