Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఇంటి వద్దకే రాములోరి కల్యాణ తలంబ్రాలు
ADVERTISEMENT 

ఇంటి వద్దకే రాములోరి కల్యాణ తలంబ్రాలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Bhadrachalam-Swamy.jpg

సాక్షి, హైద‌రాబాద్‌: వచ్చే నెల 6న భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు ఇళ్ల వద్దనే రాములోరి తలంబ్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ‌ ఆర్టీసీ ఏటీఎం సి.రవీందర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్గో సేవా విభాగం ద్వారా ఈ సదుపాయం కల్పించనున్నారు. ఎంజీబీఎస్‌లోని కార్గో, పార్శిల్‌ బుకింగ్‌ కౌంటర్లో భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కల్యాణం జరిగిన తర్వాత ముత్యాలతో కూడిన తలంబ్రాలను అడ్వాన్స్‌గా బుకింగ్‌ చేసుకున్న వారికి పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఎంజీబీఎస్‌ (MGBS)  లాజిస్టిక్స్‌ ఇన్‌చార్జి 91542 98741, 91542 98865లలో సంప్రదించవచ్చు.  

కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


బ్రహ్మోత్సవాల అంకురార్పణ జాప్యంపై విచారణ
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి (Srirama Navami) బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఈనెల 13వ తేదీన ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అడిషనల్‌ కలెక్టర్‌ కృష్ణవేణి గురువారం రంగనాయకుల గుట్టపై గల కాటేజీలో విచారణ చేపట్టారు. అర్చకులు, ఈఓను పిలిచి ఆరా తీశారు. ప్రధానార్చకులు విజయరాఘవన్‌, కోటి రామస్వరూప్‌, స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాస రామానుజాచార్యులను విడివిడిగా విచారించారు.

ఈ వేడుకలకు బ్రహ్మగా వ్యవహరించాల్సిన ఓ అర్చకుడిని పర్ణశాలకు పంపించారని, ఆయన ప్రాముఖ్యతను ముందుగానే లిఖితపూర్వకంగా ఈఓ దృష్టికి తెచ్చామని అర్చకులు వివరించినట్లు తెలుస్తోంది. ఈఓ వ్యవహారశైలితోనే ఆలస్యమైందని వారు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత విచారణకు ఈఓ రమాదేవిని పిలవగా ఆమె తన వాదన చెప్పారని తెలిసింది. టెంపుల్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ (Temple Special Protection) వారు నిర్వహించిన తనిఖీలు, దీనిపై ఏఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అర్చకుడిపై డిప్యూటేషన్‌ చర్యలు తీసుకున్నామని, పాలనాపరమైన నిర్ణయాలు, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని పేర్కొన్నట్లు సమాచారం.

చ‌ద‌వండి: దేవాల‌యాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?

కాగా, ఇరు వర్గాల వాదనలపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు కృష్ణవేణి వెల్లడించారు. విచారణలో వరంగల్‌ డీసీ సంధ్యారాణి, హైదరాబాద్‌ డీసీ కృష్ణప్రసాద్‌, ఖమ్మం ఏసీ వీరస్వామి పాల్గొన్నారు. కాగా, కృష్ణవేణిని శ్రీరామనవమి ఉత్సవాల ప్రత్యేకాధికారిగా నియమించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
srirama navami
Bhadrachalam Ram temple
TSRTC
Home Delivery
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భద్రాచలం : రామయ్య పెళ్లి పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం (ఫొటోలు)

భద్రాచలం : రామయ్య పెళ్లి పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం (ఫొటోలు)

ఆర్టీసీ ప్రయాణం చల్లచల్లన..

ఆర్టీసీ ప్రయాణం చల్లచల్లన..

మీరు దిగాల్సిన స్టాప్‌ వచ్చింది..!

మీరు దిగాల్సిన స్టాప్‌ వచ్చింది..!

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

శివరాత్రికి ప్రత్యేక బస్సులు

ఆర్టీసీ బస్సుల్లోనూ రెట్రో ఫిట్‌మెంట్‌

ఆర్టీసీ బస్సుల్లోనూ రెట్రో ఫిట్‌మెంట్‌

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.