Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. అద్దె చెల్లించమన్నందుకు ట్రాన్స్‌జెండర్లతో హల్‌చల్‌
ADVERTISEMENT 

అద్దె చెల్లించమన్నందుకు ట్రాన్స్‌జెండర్లతో హల్‌చల్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time Apr 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook

హైదరాబాద్‌: అద్దె వివాదంలో ఇంటి యజమానిపైకి ట్రాన్స్‌ జెండర్లతో పాటు రౌడీలను పంపించి దౌర్జన్యానికి దిగిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌ నగర్‌లో నివాసం ఉంటున్న మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఇందుకూరి నిర్మలాదేవికి ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ వెనక భవనం ఉంది. ఈ భవనాన్ని గత ఏడాది జూన్‌లో ఆద్య ఎడ్యుకేషన్‌ సొసైటీకి లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. 

ముందుగానే అడ్వాన్స్‌ చెల్లించడంతో పాటు నెలనెలా అద్దె ఇస్తానంటూ ఆద్య ఎడ్యుకేషన్‌ సొసైటీ నిర్వాహకులు, మాజీ ఐఏఎస్‌ కుమారుడు గొబ్బూరు సాయి కృష్ణకిషోర్‌ చెప్పారు. కాగా యజమాని నిర్మలాదేవికి, సాయి కృష్ణకిషోర్‌ మధ్య అద్దె విషయమై గొడవ జరుగుతోంది. దీనికితోడు గతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 14లో ఉన్న అధ్యాస్‌ జూనియర్‌ కాలేజీకి సంబంధించిన 16 నెలల అద్దె బకాయిలు ఉండడంతో గత ఫిబ్రవరిలో ఖాళీ చేయించారు. 

ఈ నేపథ్యంలో నిర్మలాదేవిని కలిసిన కృష్ణకిషోర్‌  ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం ఎన్టీఆర్‌ భవన్‌ పక్కనున్న కొత్త భవనాన్ని ఇవ్వాలని కోరాడు. అయితే తనకు గతంలోనే అద్దె సరిగా ఇవ్వలేదని, గతంలో అనేక వివాదాలు ఉన్నందున కళాశాల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదని చెప్పింది. అయితే అప్పటికే ఈ భవనాన్ని ఇంటరీ్మడియట్‌ సెంటర్‌గా ప్రకటించడంతో చివరి క్షణంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఏకంగా జిల్లా కలెక్టర్‌ కోరడంతో అందుకు ఆమె అంగీకరించింది. 

కాగా పరీక్షల అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని నిర్మలాదేవి కోరినా పట్టించుకోకపోవడంతో నాలుగురోజుల క్రితం ఆమె వచ్చి తాళాలు వేసుకుంది. శనివారం మధ్యాహ్నం నిర్మలాదేవి అక్కడ ఉండగా సుమారు 10మంది రౌడీలతో పాటు హిజ్రాలు ఒక్కసారిగా భవనంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించడమేగాక నిర్మలాదేవిని బయటకు తరిమివేశారు. దీంతో ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  ఆరుగురు ట్రాన్స్‌ జెండర్లు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మలాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Transgenders
banjara hills police station
Crime News
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.