Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. లో పవర్‌ ఫ్యాక్టర్‌ షాక్‌!
ADVERTISEMENT 

లో పవర్‌ ఫ్యాక్టర్‌ షాక్‌!

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
NANDI-PUMP-HOUSE-3.jpg

ఎత్తిపోతల పథకాలకు రియాక్టర్లు ఏర్పాటు చేయని ఫలితం 

దీంతో రూ.లక్షల్లో రావాల్సిన ఎనర్జీ చార్జీలు రూ.కోట్లలో.. 

ఒక్క నంది పంప్‌హౌస్‌కే రూ.7.8 కోట్లకు బదులు రూ.152 కోట్ల ఎనర్జీ చార్జీలు 

రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు మొత్తం 297 కనెక్షన్లు 

2014–15 నుంచి ఎత్తిపోతలకు మొత్తం రూ.36,435 కోట్ల విద్యుత్‌ బిల్లులు

సాక్షి, హైదరాబాద్‌: లో పవర్‌ ఫ్యాక్టర్‌.. ఎత్తిపోతల పథకాల విద్యుత్‌ చార్జీలను ఠారెత్తిస్తోంది. ఉండాల్సిన దానికంటే తక్కువ పవర్‌ ఫ్యాక్టర్‌ కలిగి ఉండటంతో ఎత్తిపోతల పథకాలకు ప్రతి నెలా రూ.లక్షల్లో రావాల్సిన ఎనర్జీ చార్జీలు రూ.కోట్లలో వస్తున్నాయి. ఉదాహరణకు.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన నంది పంప్‌హౌస్‌ నిర్వహణకు గత నవంబర్‌లో 3.2 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఎనర్జీ చార్జీలు యూనిట్‌కి రూ.6.3 పైసలు కావడంతో 3.2 లక్షల యూనిట్ల వినియోగానికి రూ.20.16 లక్షల ఎనర్జీ చార్జీలు మాత్రమే రావాలి.

కానీ, ఏకంగా రూ.3.84 కోట్లు వచ్చింది. నిబంధనల ప్రకారం పవర్‌ ఫ్యాక్టర్‌ 1 (యూనిటీ) ఉండాల్సి ఉండగా, నవంబర్‌లో నంది పంప్‌హౌస్‌ నామమాత్రంగా 0.04 పవర్‌ ఫ్యాక్టర్‌ కలిగి ఉండడంతో 3.2 లక్షల యూనిట్లు వాడినా.. 61 లక్షల యూనిట్లు వాడినట్టు లెక్కించి రూ.3.84 కోట్ల ఎనర్జీ చార్జీలను ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్‌) విధించింది. పవర్‌ ఫ్యాక్టర్‌ ఉండాల్సిన దాని కంటే తగ్గిపోతే గ్రిడ్‌ నిర్వహణలో సమస్యలు తలెత్తడంతోపాటు పెద్ద మొత్తంలో విద్యుత్‌ నష్టాలు వస్తాయి. వోల్టేజీ నిర్వహణలో సైతం సమస్యలు తప్పవు. పవర్‌ ఫ్యాక్టర్‌ స్థిరీకరణ కోసం రియాక్టర్‌ను వినియోగించాల్సి ఉంటుంది.  

రూ.7.8 కోట్ల బదులు 152 కోట్లు  
నంది పంప్‌హౌస్‌ వద్ద 12 ఎంవీఏఆర్‌ సామర్థ్యం గల రియాక్టర్‌ను ఏర్పాటు చేసి ఉంటే నవంబర్‌లో రూ.3.63 కోట్ల ఎనర్జీ చార్జీలు ఆదా అయ్యేవి. 2018 సెపె్టంబర్‌ నుంచి 2025 నవంబర్‌ వరకు నంది పంప్‌హౌస్‌ నిర్వహణకు 1.23 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వాస్తవంగా వాడినా, సగటున 0.04 పవర్‌ ఫ్యాక్టర్‌ మాత్రమే కలిగి ఉండటంతో 24.21 కోట్ల యూనిట్ల వినియోగానికి సంబంధించిన ఎనర్జీ చార్జీలను టీజీఎన్పీడీసీఎల్‌ విధించింది. అంటే, ఇప్పటివరకు మొత్తం రూ.7.8 కోట్ల ఎనర్జీ చార్జీలు మాత్రమే రావాల్సి ఉండగా, ఏకంగా రూ.152.53 కోట్ల ఎనర్జీ చార్జీలను విధించింది.

కాళేశ్వరం, దేవాదుల, ఇతర ఎత్తిపోతల పథకాలకి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 297 విద్యుత్‌ కనెక్షన్లుండగా, 2014–15 నుంచి గత నవంబర్‌ వరకు మొత్తం రూ.36,435 కోట్ల విద్యుత్‌ బిల్లులు వచ్చాయి. దేవాదుల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ఎత్తిపోతల పథకాలు ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోయినా విద్యుత్‌ బిల్లులు ఇలా భారీగా పెరగడానికి లోపవర్‌ ఫ్యాక్టర్‌ కూడా ఒక కారణమని విద్యుత్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.  

సమన్వయ లోపం... 
ఎత్తిపోతల పథకాలను నీటిపారుదల శాఖ నిర్మించినా వాటికి సంబంధించిన సబ్‌ స్టేషన్ల నిర్వహణను ట్రాన్స్‌కోకు అప్పగించారు. ఎత్తిపోతల పథకాలకు ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 13 కనెక్షన్లు, దేవాదులకు 13 కనెక్షన్లతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలకి సంబంధించి 171 కనెక్షన్లు కలిపి మొత్తం 297 విద్యుత్‌ కనెక్షన్లుండగా, వాటికి సంబంధించిన ప­వ­ర్‌ ఫ్యాక్టర్‌ స్థిరీకరణ కోసం రియాక్టర్లు ఏర్పాటు చేయలేదు.

దీంతో ఏటా రూ.వందల కోట్ల ఎనర్జీ చార్జీలను ప్రభుత్వం డిస్కంలకు అనవసరంగా చెల్లించాల్సి వస్తోంది. సామర్థ్యం ఆధారంగా రూ.రెండు మూడుకోట్లు మాత్రమే వ్యయం చేసే రియాక్టర్లను ఏర్పాటు చేసుకుంటే ఈ అనవసర ఎనర్జీ చార్జీల నుంచి సర్కారుకు ఉపశమనం లభించేది. నీటిపారుదల శాఖ అధికారులకు అవగాహన లేకపోవడంతోపాటు ట్రాన్స్‌కో, డిస్కంలతో సరైన సమన్వయం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తినట్టు విమర్శలు వస్తున్నాయి.   

ఎనర్జీ చార్జీలు ఏమిటి? 
విద్యుత్‌ బిల్లుల్లో ఎనర్జీ చార్జీలు, డిమాండ్‌ చార్జీలు (ఫిక్స్‌డ్‌ చార్జీలు)తోపాటు ఇతర చార్జీలు, విద్యుత్‌ సుంకం కలిపి అయ్యే మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఇందులో ఎన్ని యూనిట్ల విద్యుత్‌ వాడితే అంత మేరకు ఎనర్జీ చార్జీలను విధిస్తారు. ఇక కాంట్రాక్టెడ్‌ మ్యాగ్జిమ్‌ డిమాండ్‌ ఆధారంగా ప్రతి నెలా స్థిరమైన చార్జీల­ను ఫిక్స్‌డ్‌ చార్జీలుగా డిస్కంలు విధిస్తాయి. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
Lift Irrigation Schemes
Irrigation Department
Electricity
Electricity Charges
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.