Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ‘కృష్ణా’తీరం.. ఆధ్యాత్మిక తరంగం
ADVERTISEMENT 

‘కృష్ణా’తీరం.. ఆధ్యాత్మిక తరంగం

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 30, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
krishna.jpg

ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విశిష్టత    

ఆదరణ లేక మరుగున పడిన ఆధ్యాత్మిక క్షేత్రాలు     

పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధిపరచాలంటున్న స్థానికులు

తెలంగాణ – కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండలానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. జీవ నదులు.. రాజుల సంస్థానాలు.. రుషులు తపస్సు చేసిన ప్రాంతాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఘనకీర్తి సముపార్జించుకున్న ప్రాంతం కృష్ణా మండలం. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విశిష్టతతో ప్రసిద్ధికెక్కాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రసిద్ధ ప్రాంతాలు ఆదరణకు నోచుకోక మరుగున పడ్డాయి. చారిత్రాత్మక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరచాలని స్థానికులు కోరుతున్నారు. – కృష్ణా

నారాయణపేట జిల్లాలోని కృష్ణా మండలంలో 22 కిలోమీటర్ల మేర కృష్ణానది (Krishna River) 3 కిలోమీటర్ల మేర భీమా నది ప్రవహిస్తోంది. ఈ రెండు నదులు తంగిడి గ్రామంలో కలుస్తాయి. నదీ తీర ప్రాంతా­ల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు (Temples) ఉన్నాయి. కు­సుమర్తి గ్రామంలో కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే భీమా నది ఒడ్డున కృష్ణ ద్వైపాయన మ­ఠం ఉంది. ఆ రుషి మంత్రాలయం గురు రాఘవేంద్ర మహాస్వాములకు ముందే ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారు. ఆయన తపస్సుకు సాక్షాత్తు భగవంతుండు ప్రత్యక్షమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ వేద పాఠశాల కూడా నిర్వహించినట్టు ఇక్కడి పురోహితులు చెబుతున్నారు.  

తంగిడిలో సంగమ క్షేత్రం..  
కృష్ణా, భీమా నదులు కలిసే తంగిడి సంగమ క్షేత్రంలో ఎందరో రుషులు తపస్సు ఆచరించినట్టు ఆధారాలున్నాయి. నది అటువైపు కర్ణాటక (Karnataka) ప్రాంతంలో ప్రసిద్ధ శివాలయం ఉంది. అక్కడ ఇప్పటికీ ఈ ప్రాంత విశిష్టత గురించి శిలా శాసనాలు ఉన్నాయి. ఇటువైపు కొంతకాలం క్రితం దత్త పీఠాధిపతి విఠల్‌బాబా దత్త భీమేశ్వర ఆలయం నిర్మించారు.   

గూర్జాల్‌ గ్రామ సమీపంలోని కృష్ణానది మధ్యలో ఒక బండపై శివలింగం, నంది విగ్రహాలు ఉన్నాయి. అవి కదిలిస్తే కదులుతాయి. కానీ నది ప్రవాహానికి అంగుళం కూడా కదలవు. ఇక్కడ నది ఒడ్డునే సిద్ధలింగ మహాస్వాములు తపస్సు ఆచరించి.. ఓ మఠం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ పూజలు నిర్వహిస్తూ.. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.   

కృష్ణా గ్రామంలో నది ఒడ్డున దత్తాత్రేయ మందిరం, శివాలయం ఉన్నాయి. ఇక్కడ కూడా రుషులు తపస్సు ఆచరిస్తూ.. స్థానికులకు తమ మహిమలను చూపించే వారు. అందులో ఒకరైన శ్రీ క్షీరలింగేశ్వర మహాస్వాములు 47 రోజులపాటు కేవలం ఒకమారు మాత్రమే పాలు సేవించి ఘోర తపస్సు ఆచరించారు. ఆయన శిష్యులు ఇక్కడ ఏటా మకర సంక్రాంతి పండగ రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.   

ముడుమాల్‌ గ్రామంలో నది ఒడ్డున మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల సమకాలికులైన గురు యాదవేంద్ర మహాస్వాములు తపస్సు ఆచరించారు. గురు రాఘవేంద్ర స్వాములు ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు «ఇక్కడి నుంచి ధర్మ ప్రచారం ప్రారంభించారు. అలా వెళ్లిన గురురాఘవేంద్ర స్వాములు తుంగభద్ర నది ఒడ్డున ప్రస్తుత మంత్రాలయంలో మఠం ఏర్పాటు చేశారు. 

ఇక్కడున్న ఆయన సమకాలికుడు యాదవేంద్ర మహాస్వామి మాత్రం కేవలం పూజలు, తపస్సుకే ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడే ఉండిపాయారు. ఇక్కడ ఏటా ఫిబ్రవరి 22న యాదవేంద్ర స్వాముల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు విధిగా మంత్రాలయ పీఠాధిపతులు హాజరవుతారు. ఇక్కడ నాలుగు ద్వారాలతో కూడిన శివాలయం ఉంది. ఎక్కడైనా ఆలయ గర్భగుడికి ఓకే ద్వారం ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం శివాలయ గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం విశేషం. ముడుమాల్‌ సంస్థానం రాజులు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వారని.. యుద్ధ సమయంలో సైన్యంతో తూర్పున ఉన్న ద్వారం నుంచి ప్రవేశించి, పశ్చిమాన ఉన్న ద్వారం గుండా బయటికెళ్లే వారని చరిత్ర చెబుతోంది. 

మాగనూర్‌ మండలం కొల్పూర్‌లో కృష్ణానది ఒడ్డున సత్యపూర్ణ తీర్థ మహాస్వాముల మఠం ఉంది. ఈయన కూడా మంత్రాలయ రాఘవేంద్రస్వామి సమకాలికులే. ఈయన భక్తులు కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా ప్రసిద్ధికెక్కారు. ముడుమాల్‌ గ్రామంలో రాజులు సంస్థానాలను ఏర్పాటు చేసుకొని పరిపాలించారు. కృష్ణా, మా­గనూర్‌ మండలంలోని గ్రామాలతో పాటు కర్ణాటకలోని పలు గ్రామాలను ఈ రాజులు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కొ­ల్పూర్‌ సంస్థానంలో నది అటువైపు ఉన్న కర్ణాట­క ప్రాంతంతో పాటు ఇటువైపు ఉన్న కొన్ని గ్రా­మాలను వారు పరిపాలించారు. ప్రపంచ ప్రఖ్యా­తి గాంచిన కోహినూర్‌ వజ్రం కూడా కొల్పూర్‌ ప్రాంతానికి చెందినదిగా ప్రచారం ఉంది. 

ఈ వజ్రం (Diamond) చేపల వేటగాడికి నదిలో దొరికిందని.. అది కొల్పూర్‌ దొరకు ఇవ్వగా, ఆయన నిజాం ప్రభువుకు అప్పగించినట్లు ప్రచారంలో ఉంది. కొల్పూర్‌లో ఇప్పటికీ రాజమందిరాలు ఉన్నా­యి. వీరి వంశీకులే ప్రస్తుతం కర్ణాటకలోని ప్రసి­ద్ధ దేవసూగూర్‌ సూగురేశ్వర ఆలయాన్ని నిర్మించారు. సంస్థానాధీశులకు చెందిన లక్షలాది ఎక­రా­లు భూములను ఆచార్య వినోభాబావే స్వచ్ఛం­దంగా సేకరించి, పేదలకు పంచిపెట్టారు.

ఇక్కడే నిలువు రాళ్లు..  
ముడుమాల్‌ సమీపంలోని నది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు దేశంలో మరెక్కడా కనిపించవు. ఈ నిలువు రాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసుకున్నవని.. పురావస్తు శాఖకు చెందిన ప్రొఫెసర్‌ పుల్లారావు పరిశోధన ద్వారా ప్రపంచానికి తెలిసింది. 

సూర్య కిరణాలు ఒక వరుస నుంచి.. మరో వరుసకు ప్రయాణించే సమయాన్ని.. ఆది మానవులు రుతువులుగా భావించే వారని ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. మహోన్నతమైన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిలువురాళ్లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, మఠాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
krishna river
bhima river
spiritual center
Temples
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.