Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల ఫలితాలపై వివాదం
ADVERTISEMENT

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల ఫలితాలపై వివాదం

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 19, 2026 03:44 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
BUS-BHAVAN-2.jpg

రీజియన్‌ స్థాయి గుర్తింపు ఎన్నికల్లో ఆనవాయితీ విధానాన్ని పాటించకపోవడమే కారణం 

మొత్తం ఓట్లలో 50 శాతంకంటే ఎక్కువ ఓట్లు పొందాలన్న విధానానికి స్వస్తి 

సాధారణ మెజారిటీ ఆధారంగా విజేత ప్రకటన 

ఇది అధికార పార్టీ అనుకూల కూటమి కోసమే చేశారంటూ మిగతా యూనియన్ల ఆరోపణలు 

న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఈయూ కూటమి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, ఎన్నిక ఫలితాల మీద వివాదం చెలరేగింది. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు మొదలైనప్పటి నుంచి అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా ఈసారి రీజి­యన్‌ స్థాయి గుర్తింపును కట్టబెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. దీనిపై ఇతర యూనియన్లు తీవ్ర ఆగ్రహం వ్య­క్తం చేస్తుండగా, రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కించుకున్న ఈయూ కూటమి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈనెల 9న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా అదే రోజు కౌంటింగ్‌ పూర్తి చేయడంతో విజేతలెవరో తేలిపోయింది. 

14, 15 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌కు వీలు కల్పించడంతో అధికారికంగా ఫలితాలను ఈనెల 17 రాత్రి వెల్లడించారు. ఇందులో రాష్ట్రస్థాయి గుర్తింపులో టీఎంయూ, ఎన్‌ఎంయూలతో కూడిన ఈయూ కూటమి 4,670 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, రీజియన్‌ స్థాయి గుర్తింపు విషయంలోనే వివాదం మొదలైంది. సాధారణంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేస్తారు. ఒకటి రాష్ట్రస్థాయి గుర్తింపునకు, రెండోది రీజియన్‌ స్థాయి గుర్తింపునకు వేస్తారు. రాష్ట్రస్థాయి గుర్తింపులో ఏ యూనియన్‌కు ఆధిక్యత వస్తే ఆ యూనియన్‌ విజయం సాధించినట్లవుతుంది. కానీ, రీజియన్‌ స్థాయిలో మాత్రం మెజారిటీ ఓట్లు కాకుండా మొత్తం ఓట్లలో 50 శాతం కంటే కనీసం ఒక ఓటు వచ్చిన యూనియన్‌ను విజేతగా ప్రకటిస్తారు. 

ఇది ఆర్టీసీలో యూనియన్‌ ఎన్నికలు మొదలైనప్పుడు జరిగిన ఒప్పందం. అప్పటి నుంచి దీన్ని అనుసరిస్తున్నారు. 50 శాతం కంటే కనీ­సం ఒక ఓటు ఏ యూనియన్‌కు రాకుంటే ఏ యూనియన్‌­నూ కూడా విజేతగా ప్రకటించరు. అప్పుడు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు యూనియన్‌గా ఎన్నికైన యూనియన్‌ను ఆ రీజియన్‌ గుర్తింపు యూనియన్‌గా ప్రకటించడం ఆ పద్ధతిలో భాగం, తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏడు రీజియన్‌లలో 50 శాతం కంటే ఒక ఓటు చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌ రీజియన్లలో టీఎంయూ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి రీజియన్లలో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్, ఖమ్మంలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌లు విజయం సాధించాయి. మిగతా రీజియన్‌లలో ఆ పద్ధతిలో ఓట్లు పోల్‌ కాలేదు.  

ఆనవాయితీకి భిన్నంగా.. 
కానీ, తాజాగా ప్రకటించిన ఫలితాల్లో, మిగతా రీజియన్‌ల­లో ఆనవాయితీకి భిన్నంగా సాధారణ మెజారిటీ పొందిన యూనియన్లను విజేతగా ప్రకటించారు. దీంతో మెదక్, వరంగల్‌ రీజియన్లలో ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్, నల్గొండలో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్, హైదరాబాద్‌ రీజియన్‌లో టీఎంయూలు విజేతలుగా నిలిచాయి. ఇందులో ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌లు కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన టీడబ్ల్యూయూ కూటమిలో ఉన్నాయి. ఫలితంగా, రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కించుకోలేకపోయిన ఆ కూటమి, రీజియన్లలో మెజారిటీ రీజియన్లు సాధించినట్లయింది. 

అధికార పార్టీ జోక్యం వల్లనే ఇలా జరిగిందని వైరి కూ­ట­మిలోని యూనియన్లు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆ­న­వాయితీ ప్రకారం ఫలితాలు లెక్కించి ఉంటే, ఏ యూనియన్‌కు కూడా మెజారిటీ దక్కని నాలుగు రీజియన్లు రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కించుకున్న ఈయూ ఖాతాలోకి చేరేవి. అలా కా­కుండా ఇప్పుడు అధికార పార్టీ కూటమికి దక్కేలా పావులు కదిపారన్నది వాటి ఆరోపణ. అయితే, ఆనవాయితీగా వస్తు­న్న విధానానికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధ నిబంధన కాదని, సింగరేణి, రైల్వే యూనియన్‌ ఎన్నికల్లో ఇలాంటి పద్ధతి లేదని, మిగతా సంస్థల్లో మెజారిటీ ఓట్లే ప్రాతిపదిక అని, ఇప్పుడు ఆరీ్టసీలో కూడా దాన్నే అనుసరించారని, దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని అధికార పార్టీ బలపరిచిన కూటమిలోని యూనియన్లు పేర్కొంటున్నాయి.

 డిపోల్లో గెలిచాం...
9 రీజియన్లలో గుర్తింపు మాదే: మొగుళ్ల రాజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌తో కలిసి తాము మొత్తం 51 డిపోల్లో విజయం సాధించామని అధికార కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ) వెల్లడించింది. రాష్ట్రంలోని 97 డిపోలకు గాను 51 డిపోల్లో గెలవడంతో పాటు 14 రీజియన్లలో తొమ్మిదింట గుర్తింపు తమకే వచ్చిందని, నాన్‌ ఆపరేషన్‌ పరిధిలోనికి వచ్చే బస్‌భవన్‌తో సహా ఆర్‌ఎం కార్యాలయాలు, వర్క్‌షాప్‌లు కలిపి ఎనిమిది యూనిట్లలోనూ తామే గెలిచామని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ విజయం కార్మికుల్లో కాంగ్రెస్‌ పార్టీ పట్ల, తమ యూనియన్‌ పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనమని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కార్మీకుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ కూటమికి మద్దతు తెలిపిన కార్మీకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఎన్నికల్లో తమపై కార్మికులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ఆ ప్రకటనలో రాజిరెడ్డి స్పష్టం చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
RTC union elections
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. రాత్రంతా భయానకం

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. రాత్రంతా భయానకం

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..  ఆటోలో 17 మంది!

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోలో 17 మంది!

మరిన్ని వార్తలు

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. రాత్రంతా భయానకం

హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. రాత్రంతా భయానకం

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

ఎగసిపడుతున్న మంటలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎగసిపడుతున్న మంటలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft