Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. 'ధర'ఖాస్తు దడ
ADVERTISEMENT 

'ధర'ఖాస్తు దడ

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 12, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aly.jpg

ఉద్యోగాల దరఖాస్తు ఫీజు 5 రెట్లు పెంచిన టీజీపీఎస్సీ

2024 గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో దరఖాస్తు రుసుం రూ.200

తాజాగా విడుదల చేసిన ఏఈ పోస్టుల అప్లికేషన్‌ ఫీజు రూ.1,000గా ప్రకటన

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలని వెల్లడి 

నిరుద్యోగుల ఆగ్రహం..పెనుభారం పడుతుందంటూ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) షాకిచ్చింది. ఇప్పటివరకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము రూ.200 ఉండగా.. తాజాగా దీన్ని ఐదు రెట్లు పెంచింది. అంటే ఇకపై ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే రూ.1,000 ఫీజు చెల్లించాలన్నమాట. గత వారం టీజీపీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉద్యోగాలకు సంబంధించి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రహదారులు, భవనాల శాఖ పరిధిలో 222 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) 49, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిధిలోని 19 అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. 

ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు రుసుమును రూ.1,000గా ఖరారు చేసింది. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1,000 చొప్పున అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అయితే వీరి దరఖాస్తు ఫీజు గతంలో రూ.100 మాత్రమే కావడం గమనార్హం. 

అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని పరీక్షలన్నీ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడంతో టీజీపీఎస్సీకి నిర్వహణ ఖర్చు చాలావరకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దరఖాస్తు రుసుమును ఏకంగా 5 రెట్లు పెంచడంపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే వేలల్లో ఫీజు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీల కంటే చాలా ఎక్కువ
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన రాష్ట్ర ప్రభుత్వం..యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ కూడా తమకు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీలు రోల్‌ మోడల్‌ అని ప్రకటించింది. అయితే యూపీఎస్సీ పరీక్షలకు ఫీజు రూ.100 నుంచి రూ.200 మధ్యనే ఉండటం గమనార్హం. ఇక ఎస్‌ఎస్‌సీ నిర్వహించే ప్రధాన పరీక్షలకు ఫీజు రూ.100 మాత్రమే ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.  

అభ్యర్థులపై పెను భారం!
గ్రూప్‌1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియంతా టీజీపీఎస్సీ ద్వారానే జరుగుతుంది. నోటిఫికేషన్లు వెలువడినప్పుడు అభ్యర్థులు సైతం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో నోటిఫికేషన్‌కు 4 లక్షల నుంచి 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సందర్భాలున్నాయి. 

2024 గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు ఏకంగా 4 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. చివరగా భర్తీ చేసిన గ్రూప్‌–4 ఉద్యోగాల కోసం 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో దరఖాస్తు రుసుము 5 రెట్లు పెంచుతూ తాజాగా కమిషన్‌ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ అభ్యర్థులపై, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులపై పెనుభారం మోపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
Government jobs
TGPSC
Applications
Payment
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.