Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. 9 ఏళ్లలో సాగునీటికి రూ.లక్ష కోట్లు
ADVERTISEMENT 

9 ఏళ్లలో సాగునీటికి రూ.లక్ష కోట్లు

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CAG-REPORT-TELANGA.jpg

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్య, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత

రూ.1.42 లక్షల కోట్ల మూలధన వ్యయంలో రూ.లక్ష కోట్లకు పైగా సాగునీటి రంగానికే...

తొమ్మిదేళ్లలో విద్యారంగంలో మూలధన వ్యయం కేవలం రూ.2,250 కోట్లు 

వైద్యానికి రూ.6,496 కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.11 వేల కోట్లు 

రెవెన్యూ వ్యయంలో విద్య, వ్యవసాయానికే ప్రాధాన్యత... రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఏటా రూ. 9,300 కోట్లు  

అన్ని రంగాల్లో కలిపి మొత్తం ఖర్చు రూ.11.68 లక్షల కోట్లు..  

ఆరు రంగాలకు రూ.5.34 లక్షల కోట్లు.. అనివార్య ఖర్చులు రూ.3.9 లక్షల కోట్లు 

2013–14 నుంచి 2022–23 వరకు రాష్ట్రాల ఆర్థిక పురోగతి నివేదికలో వెల్లడించిన కాగ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి తొమ్మిది సంవత్సరాలలో సాగునీటి రంగానికి ప్రభుత్వం రూ.1,14,145 కోట్లు ఖర్చు చేసినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించింది. అందులో మూలధన వ్యయం కింద రూ.1,03,894 కోట్లు, రెవెన్యూ వ్యయం కింద రూ.10,251 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. స్టేట్‌ ఫైనాన్సెస్‌ (2022–23) పేరుతో రూపొందించిన నివేదికను ఇటీవల జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో కాగ్‌ విడుదల చేసింది. 

పదేళ్ల విశ్లేషణ పేరుతో 2013–14 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, రెవెన్యూ రాబడులు, ఖర్చులు, రాష్ట్రాల సొంతపన్నుల ఆదాయం, కేంద్రం నుంచి పలు రూపాల్లో అందే సాయం, అప్పులు, చెల్లింపులు, అనివార్యంగా చేయాల్సిన ఖర్చులు ఆ పదేళ్ల కాలంలో ఎలా పెరిగాయి.. అన్ని రాష్ట్రాలు ఎలా ఖర్చు పెట్టాయి.. జీఎస్డీపీలో ఈ రంగాల ఖర్చులు, అప్పుల శాతం ఎంత? ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి అనుగుణంగా ఏ రాష్ట్రాలు ఎలా ఖర్చు చేస్తున్నాయనే అంశాలను విశ్లేషించింది. అయితే, తెలంగాణ రాష్ట్రం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ఏర్పాటైనందున తొమ్మిదేళ్ల గణాంకాలను అందులో పొందుపరిచారు.  

ఒకటిరెండు రంగాలే.. 
కాగ్‌ నివేదిక ప్రకారం అనేక రంగాల్లో దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతూ తొమ్మిదేళ్ల తన ప్రయాణాన్ని కొనసాగించింది. మొదటి తొమ్మిదేళ్లలో సాగునీరు, విద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టు రెవెన్యూ, మూలధన ఖర్చుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. తొమ్మిదేళ్లలో రూ.1.42 లక్షల కోట్లను మూల ధన వ్యయం కింద ఖర్చు పెట్టగా, రూ.లక్ష కోట్లకు పైగా ఒక్క సాగునీటి రంగంలోనే ఆస్తుల కల్పనకు ఖర్చు చేశారు. 


ఆ తర్వాత రవాణా రంగంలో రూ.20 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.11 వేల కోట్లు వెచ్చించారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో మాత్రం మూలధన వ్యయం ఆశించిన మేర జరగలేదు. రెవెన్యూ వ్యయం విషయానికి వస్తే.. విద్యకు రూ.1,08,941 కోట్లు, వ్యవసాయా నికి రూ. 1,08,881 కోట్లు వెచ్చించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తొమ్మిదేళ్లలో రూ.76,440 కోట్లు ఖర్చు చేశారు. 


మూలధన వ్యయంతో కలిపి ఏడాదికి సగటున రూ.9,300 కోట్లు ఖర్చు చేశారని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఇక, తొమ్మిదేళ్లలో మొత్తం బడ్జెటరీ ఖర్చు (రెవెన్యూ, మూల ధన వ్యయం కలిపి) రూ.11,68,401 కోట్లు. అందులో విద్య, వైద్యం, సాగునీరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు రూ.5,34,346 కోట్లు వెచ్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల కింద అనివార్యంగా చేయాల్సిన వాటి కోసం రూ.3,95,941 కోట్లు ఖర్చు పెట్టినట్లు కాగ్‌ నివేదిక తెలిపింది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Comptroller and Auditor General (CAG)
Irrigation sector
Rural Development
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.