Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ప్రచారం.. వారమే!
ADVERTISEMENT 

ప్రచారం.. వారమే!

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
PANCHAYITHI-ELECTIONS-3.jpg

ఎంపీటీసీ, జెడ్పీటీసీల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు

రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడొద్దు 

సమావేశాలు, ర్యాలీల నిర్వహణకూ అనుమతి తప్పనిసరి  

కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలు  

స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దు 

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియే ఆగిపోవచ్చని స్పష్టికరణ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9న మండల, జిల్లా పరిషత్‌ తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ప్రకటన వెలువడిన రోజు నుంచి మూడురోజుల్లో నామినేషన్ల దాఖలు ముగియనుంది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. ఈ కాలంలో వారు ఓటర్లకు అవగాహన కల్పన, ఎన్నికల ప్రచారానికి, కార్యకర్తలు, ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే పోలింగ్‌ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.  

⇒ రాత పూర్వక అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడొద్దు..అదీ నిర్ణీత సమయం వరకే అనుమతి ఉంటుందని పేర్కొంది.  
⇒ సమావేశాలు, ర్యాలీల నిర్వహణలో ఆయా ప్రదేశాలకు అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.  
⇒ అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలియజేయాల్సిఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలున్నాయని, వీటి ముద్రణదారుల వివరాలు, అడ్రస్‌ వంటివి తప్పకుండా వాటిపై పేర్కొనాలని తెలిపింది.  

⇒ ప్రచారం నిర్వహించేటప్పుడు నైతికతకు ప్రాధాన్యతనిస్తూ, స్నేహపూర్వక పోటీ వాతావరణాన్ని దెబ్బతీసేలా అభ్యర్థులు వ్యవహరించొద్దని సూచించింది.  
⇒ ఎన్నికల సమయంలో ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు తావు లేకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలని పేర్కొంది.  

⇒ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగిపోవచ్చు. ఓటర్లకు ఏ రకంగానూ లంచం ఇచ్చేందుకు, అనుచిత ప్రవర్తనతో ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించొద్దని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. 
⇒ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదైనా వాహనంలో పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచొద్దు.  
⇒ ఎస్‌ఈసీ విధించిన అభ్యర్థుల వ్యయ పరిమితి మాత్రం పూర్వకాలం నాటిదే కొనసాగుతోంది. జెడ్పీటీసీగా పోటీచేసే వారి వ్యయ పరిమితి రూ.4 లక్షలుగా ఉంది.  

విద్వేష భావాలు రెచ్చగొడితే అంతే...  
ఎన్నికల లబ్ధి కోసం అభ్యర్థి లేదా అతడి అనుమతితో ఏజెంట్, ఇతరులు మతం, జాతి, కులం, వర్గం లేదా భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాల సృష్టి, వ్యక్తుల మధ్య విద్వేష పూరిత భావాలు లేదా దేశంలోని వివిధ తరగతుల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టడం వంటి వాటిని కూడా అవినీతి చర్యగానే పరిగణిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. విద్వేషాలతో రెచ్చగొట్టిన వారు ఒకవేళ గెలిచినా సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు పొడిగించే జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు.  

ఏదో ఒక నామినేషనే ఉంచుకోవాలి 
ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసి ఉంటే, అందులో ఏదో ఒకటి ఎంచుకొని మిగిలిన వాటిని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అభ్యర్థులు సమర్పించిన అన్ని నామినేషన్లు తిరస్కరణకు గురై ఎక్కడి నుంచైనా పోటీకి అనర్హులుగా మిగిలిపోతారు. ఉదాహరణకు రెండు చోట్ల ఎంపీటీసీగా లేదా రెండు చోట్ల జెడ్పీటీసీగా నామినేషన్లు వేసి విత్‌ డ్రా చేసుకోకపోతే అనర్హులు అవుతారు. ఒక చోట ఎంపీటీసీగా, మరో చోట జెడ్పీటీసీగా పోటీ చేసినా, ఆ నామినేషన్లు చెల్లుబాటు అవుతాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
mptc
ZPTC
Election Campaign
Telangana
Election Commission of India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.