తెలంగాణ మున్సిపల్ కార్పొషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీనే సత్తాచాటింది. మొత్తం ఏడు కార్పొరేషన్లకు గాను నాలుగింట కాంగ్రెస్ హవా చూపెట్టింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో విజయం సాధించింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకంది కొత్తగూడెం, నిజామాబాద్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీ రాలేదు.
కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ 22 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ 22 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 8 డివిజన్లలో, సీపీఎం ఒక డివిజన్లో, బీజేపీ ఒక డివిజన్లో మాత్రమే గెలిచింది. నిజామాబాద్ కార్పొరేషన్ 60 డివిజన్లో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ కార్పొరేషన్ని గెలుచుకోలేక పోయింది. బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజ న్లలో విజయం సాధించగా బీఆర్ఎస్ ఒక చోటు గెలుపొందింది.
| కార్పొరేషన్ | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | సీపీఐ | ఎంఐఎం | ఇతరులు |
| కరీంనగర్ (66) |
14 |
09 |
30 |
- |
03 |
10 |
| రామగుండం (60) |
38 |
13 |
01 |
01 |
- |
07 |
| నిజామాబాద్ (60) |
17 |
01 |
28 |
- |
14 |
- |
| మహబూబ్నగర్ (60) |
30 |
15 |
07 |
- |
03 |
05 |
| మంచిర్యాల (60) |
44 |
08 |
05 |
- |
- |
03 |
| కొత్తగూడెం (60) |
22 |
08 |
01 |
22 |
- |
07 |
| నల్లగొండ (48) |
27 |
09 |
04 |
- |
02 |
06 |