సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత గురయ్యారు. వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు తెలిసింది. దీంతో, బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ADVERTISEMENT
ADVERTISEMENT