Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నిరుపయోగ భూములపై నజర్‌
ADVERTISEMENT 

నిరుపయోగ భూములపై నజర్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 28, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
OPEN-LAND-5.jpg

పరిశ్రమల వద్ద వృథాగా ఉన్న భూముల లెక్కలు తీస్తున్న ప్రభుత్వం

సర్కారు ఇచ్చిన భూముల దుర్వినియోగంపై దృష్టి

లెక్కలు తేల్చేందుకు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నేతృత్వంలో కమిటీ

వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

గతంలో 65 సంస్థల నుంచి 1,960 ఎకరాలు తిరిగి వెనక్కి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సవాలుగా మారుతున్న నేపథ్యంలో.. గతంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్దేశించిన అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిరుపయోగంగా ఉన్న ప్లాట్ల లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. నిరుపయోగంగా ఉన్న భూములను అవసరమైతే స్వా«దీనం చేసుకుని.. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు కేటాయించాలని భావిస్తోంది.

ఇందుకోసం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మల్సూర్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి చెందిన ఇద్దరు అధికారులను ఇందులో సభ్యులుగా నియమించింది. టీజీఐఐసీ ద్వారా పరిశ్రమలకు కేటాయించిన భూములను పరిశీలించి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది. ఆ నివేదిక అధారంగా నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయనుంది. ఉచితంగా భూమి కేటాయించినా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని 225 సంస్థల నుంచి 1,964 ఎకరాల భూమిని టీజీఐఐసీ గతంలో వెనక్కి తీసుకుంది. ఇందులో కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 


కమిటీ పరిశీలించే అంశాలివే 
⇒ గతంలో జరిపిన భూ కేటాయింపులపై పూర్తిస్థాయిలో ‘భూ తనిఖీ’(ల్యాండ్‌ ఆడిట్‌) చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు.  

⇒ టీజీఐఐసీ భూ కేటాయింపులను రద్దు చేసినా, కొన్నిచోట్ల సదరు భూములు పారిశ్రామిక సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఆ భూములను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై జరిమానా కూడా విధించారు. ఇలాంటి అంశాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.  

⇒ పారిశ్రామిక వాడల్లో విక్రయించగా మిగిలిన ప్లాట్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. వాటి సంఖ్య, విస్తీర్ణం తేల్చే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పగించారు.  

⇒ పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తున్నారా లేదా? అనే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుంది.

దుర్వినియోగం కాకుండా పర్యవేక్షక వ్యవస్థ
టీజీఐఐసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 170కి పైగా పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. కొత్తగా మరో 35 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు 13,741 ఎకరాల భూమి అవసరమని టీజీఐఐసీ గుర్తించింది. ఇందులో 2,338 ఎకరాలు ప్రభుత్వ, 7,638 ఎకరాలు అసైన్డ్, 3,765 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన, ప్రస్తుతం సేకరిస్తున్న భూములతో కూడిన ల్యాండ్‌ బ్యాంక్‌ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ల్యాండ్‌ బ్యాంక్‌ నిర్వహణ, కేటాయింపులను పర్యవేక్షించడంతో పాటు దుర్వినియోగం కాకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
industries
land
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.