Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. స్లాట్‌ బుకింగ్‌ నేటి నుంచే..
ADVERTISEMENT 

స్లాట్‌ బుకింగ్‌ నేటి నుంచే..

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ponguleti-Srinivas-Reddy.jpg

రాష్ట్రవ్యాప్తంగా అన్నిసబ్‌రిజిస్ట్రా్టర్‌ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం

రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో ఏఐ చాట్‌బాట్‌ ‘మేధ’సేవలు కూడా.. 

క్రయవిక్రయదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు 

82476 23578కు వాట్సాప్‌ చేస్తే కార్యాలయ లొకేషన్, స్లాట్‌ బుకింగ్‌ వేళల సమాచారం పొందే వీలు 

అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి రానుంది. స్లాట్‌బుకింగ్‌తోపాటు కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో చాట్‌బాట్‌ ‘మేధ’సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ఇప్పటికే రెండు దశల్లో పైలట్‌ ప్రాజెక్టు పద్ధతిన అమలు చేశారు.

తొలిదశలో ఏప్రిల్‌ 10 నుంచి 22 మధ్య, రెండో దశలో మే 12 నుంచి 25 దాకా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 45,191 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయని.. మాన్యువల్‌ విధానంతో పోలిస్తే సుమారు 3 వేల వరకు ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయని సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సులభతరమైన సేవలను పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అయితే స్లాట్‌ బుకింగ్‌తోపాటు ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఐదు మాన్యువల్‌ రిజిస్ట్రేషన్లు చేసే విధానం కూడా కొనసాగనుంది.  

వాట్సాప్‌లోనే సమాధానాలు 
ఆస్తుల క్రయవిక్రయదారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా సందేహాలు నివృతి చేసుకొనేందుకు 82476 23578 అనే నంబర్‌కు వాట్సాప్‌లో సందేహాలు పంపితే వెంటనే సమాధానాలు వచ్చేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల లొకేషన్, స్లాట్‌ బుకింగ్‌ ఖాళీల వివరాలు, అందుబాటులో ఉండే సమయం, డీడ్‌లవారీగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు, మార్కెట్‌ విలువలను కూడా నేరుగా క్రయవిక్రయదారుల సెల్‌ఫోన్లకు పంపేలా అధికారులు సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు.  

ఐదు వాకిన్‌ రిజిస్ట్రేషన్లు కూడా..: మంత్రి పొంగులేటి 
సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ క్రయవిక్రయదారుల సమయాన్ని ఆదా చేయడంతోపాటు వారికి అవినీతిరహిత పారదర్శక సేవలందించడమే లక్ష్యంగా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. పైలట్‌ పద్ధతిలో ఈ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిలో 94 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినందున రాష్ట్రవ్యాప్తంగా స్లాట్‌ బుకింగ్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధానం అమలు దృష్ట్యా పనిభారం అధికంగా ఉన్న 9 కార్యాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ సహా అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు.

ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (మధ్యాహ్న భోజన సమయంలో మినహా) ప్రజలు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని.. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అత్యవసర సందర్భాల్లో నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్య 5 వాకిన్‌ రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తామన్నారు. స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నందున ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పొంగులేటి పేర్కొన్నారు. 

త్వరలోనే ఈ–ఆధార్‌.. 
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేలా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ–ఆధార్‌ను కూడా తీసుకొస్తామని.. అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలోనే డెవలపర్‌ రిజిస్ట్రేషన్‌ మాడ్యూల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. లేఅవుట్లవారీగా రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్ల వివరాలు ఎరుపు రంగులో కనిపించేలా మాడ్యూల్‌ను రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Slot Booking
AI
Registrations
Srinivas Reddy ponguleti
Registration Department
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.