Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. TS: కొత్త కొలువుల ఏడాది.. వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు
ADVERTISEMENT

TS: కొత్త కొలువుల ఏడాది.. వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 1, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
GOVT-JOBS.jpg

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో వరుసగా ఉద్యోగ భర్తీ పరీక్షలు జరగనున్నాయి. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీచేయగా, త్వరలో మరికొన్ని కొలువులకు ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చిన పలు నోటిఫికేషన్లకు సంబంధించి జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవనుంది.



వాటికి 2023 ఏడాది మధ్యలో నియామక పరీక్షలు జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు వెలువడబోయే నోటిఫికేషన్లకు ఆ తర్వాత రాత పరీక్షలు ఉంటాయని అంటున్నాయి. మొత్తంగా 2023 ఏడాది పొడవునా నియామక సంస్థలు ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవడంలో  నిమగ్నమయ్యారు.



ఇప్పటివరకు 42 వేల పోస్టులకు..

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గత ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 80 వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా పలు పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియామక సంస్థలు 42,293 కొలువులకు ప్రకటనలు జారీ చేశాయి.



తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకాల బోర్డు 17,516 పోస్టులకు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 17,457 పోస్టులకు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 7,320 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా 12వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. వీటికితోడు ఉపాధ్యాయ పోస్టులు, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కూడా ప్రకటనలు వెలువడనున్నాయి. ఈ ఉద్యోగాలన్నింటి భర్తీకి 2023 సంవత్సరమే వేదిక కానుంది.



వరుసగా భర్తీ పరీక్షలు

ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడిన ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు నిర్వహించేందుకు నియామక సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఏప్రిల్‌ లేదా మే నెలలో మెయిన్‌ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా గ్రూప్‌–1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలో వెలువడనుంది. వచ్చే మే తర్వాత మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే సంకేతాలిచ్చింది.



ఆ పరీక్షల తర్వాత కొంత విరామమిచ్చి గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు అంచనా. ఇదే సమయంలో ఇతర పోస్టులకు సంబంధించి అర్హత పరీక్షలను కూడా నిర్వహించనుంది. మరోవైపు గురుకుల పోస్టులకు సంబంధించి జనవరిలో ప్రకటనలు వెలువడితే.. జూన్‌ తర్వాత పరీక్షలు జరిగే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి.



నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలివీ..

► తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 17,515 పోలీస్‌ కొలువులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో 587 సబ్‌ ఇన్‌స్పెక్టర్, 16,929 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ప్రిలిమ్స్‌ పరీక్షలను నిర్వహించిన బోర్డు.. దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత మెయిన్‌ పరీక్షలను 2023 ఏడాది మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది.



► టీఎస్‌పీఎస్సీ 2022లో మొత్తంగా 22 నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3, గ్రూప్‌–4 కేటగిరీలు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులతోపాటు ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో కలిపి 17,457 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసింది. కీలకమైన గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలతోపాటు పలు కేటగిరీల్లో కొలువుల భర్తీకి అర్హత పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.



► తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మొత్తం 7,320 ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. ఇందులో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ 969, స్టాఫ్‌ నర్సులు 5,204, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీలో 1,147 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల ఎంపిక దాదాపు పూర్తవగా.. మిగతా కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.



► తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సైతం గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కేటగిరీల్లో 12వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో కేటగిరీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. జనవరి నెలాఖరుకల్లా దాదాపు అన్నిరకాల కొలువులకు ప్రకటనలు వెలువడనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ పోస్టులకు 2023 ఏడాదిలోనే అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
job placement
JOB Replacement
Telangana Government
KCR
tspsc
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

12 పత్రాలే అంతిమం కాదు

12 పత్రాలే అంతిమం కాదు

రాజకీయ'దుర్గం'!

రాజకీయ'దుర్గం'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

పెన్షను..పేదల్లో టెన్షను!

పెన్షను..పేదల్లో టెన్షను!

కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు!

కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.