Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Ration Card: తిరకాసు దరఖాస్తు!
ADVERTISEMENT 

Ration Card: తిరకాసు దరఖాస్తు!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
012.jpg

24వ తేదీ వరకు వార్డుల వారీగా సభలు 

జాబితాలో పేరు లేని కుటుంబానికి వెసులుబాటు 

విచారణ పూర్తయినవారికి 26 నుంచి కార్డుల జారీ 

మరి ప్రజాపాలన దరఖాస్తుల విషయమేమిటో?  

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ఈ నెల 24 వరకు జరిగే స్థానిక వార్డు సభల్లో దరఖాస్తులు సమరి్పంచవచ్చని మంత్రులు ప్రకటించారు. దీంతో మంగళవారం నుంచే వార్డు ఆఫీసులకు పేదలు క్యూ కట్టారు. పౌరసరఫరాల శాఖ  కొత్త రేషన్‌ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో ఈపీడీఎస్‌ ఎఫ్‌ఎస్‌సీ లాగిన్‌లో దరఖాస్తు చేసుకునే వి«ధానం ఉండగా.. తాజాగా ఆఫ్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీస్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇటీవల ఇంటింటికీ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్‌ కార్డు లేని కుటుంబాలను గుర్తించి తాజాగా ఆ కుటుంబాలపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. విచారణలో సుమారు 70 శాతం వరకు కుటుంబాలు అర్హత సాధించాయి. వీరికి ఈ నెల 26 నుంచి రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. 

సర్వేలో గుర్తింపు అంతంతే.. 
సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్‌ కార్డు లేని కుటుంబాల గుర్తింపు అంతంత మాత్రంగానే కొనసాగింది. సర్వే సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో, కొన్ని కుటుంబాలను వదిలివేశారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ప్రజాపాలనలో కొత్త రేషన్‌ల కార్డు కోసం సుమారు 5,73,069 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సమగ్ర కుటుంబ సర్వే పేరిట కేవలం 83,285 కుటుంబాలకు మాత్రమే రేషన్‌ కార్డులు లేనట్లు గుర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. మిగతా కుటుంబాల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజాపాలనలో సైతం రేషన్‌ కార్డులు లేని ఎన్నో పేద కుటుంబాలు పాత అడ్రస్‌లతో కూడిన ఆధార్, ఇతరత్రా పత్రాలు లేని కారణంగా దరఖాస్తులు సమరి్పంచలేకపోయాయి.  

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులపై అనుమానమే.. 
కొత్త రేషన్‌ కార్డుల కోసం ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పదేళ్లుగా పౌర సరఫరాల శాఖ ఆన్‌లైన్‌ ద్వారానే సేవలందిస్తోంది. గత నాలుగేళ్లుగా కొత్త రేషన్‌ కార్డుల లాగిన్‌ నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండాపోయింది. ప్రజాపాలనాలో కేవలం ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించగా రేషన్‌ కార్డులు లేని వారు సైతం దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో పేదలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా కూడా వార్డు ఆఫీసుల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,  అధికారులు మౌఖికంగా పేర్కొంటున్నప్పటికీ పౌరసరఫరాల శాఖా పరంగా కొత్త రేషన్‌ కార్డుల  దరఖాస్తుల కోసం ప్రకటన విడుదల చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాపాలన దరఖాస్తులు ప్రశ్నార్థకమే.. 
ప్రజాపాలనలో గంపెడు ఆశలతో  కొత్త రేషన్‌ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. మరోవైపు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లలో జరిగే  ప్రజావాణి కార్యక్రమాల్లో సైతం కొత్త రేషన్‌ కార్డుల కోసం అందిన ఆఫ్‌లైన్‌ దరఖాస్తుల పరిస్థితి కూడా అదే తరహాగా మారింది. ఇటీవల కుల గణనలో భాగంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్‌ కార్డుల కోసం  గుర్తించిన కుటుంబాలపైనే తాజాగా క్షేత్రస్థాయి విచారణ జరిగింది. దీంతో కొత్త రేషన్‌ కార్డుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేద దరఖాస్తు దారులకు నిరాశే కలిగిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగానే రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అంటూ పాత పాడుతున్న కాంగ్రెస్‌ ప్రభ్వుత్వం ఆచరణలో మాత్రం కనీసం పెండింగ్‌ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకపోవడం విస్మయపరుస్తోంది.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ration card applications
ration card
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.