Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఐదేళ్లుగా బహ్రెయిన్‌ మార్చురీలో మృతదేహం
ADVERTISEMENT

ఐదేళ్లుగా బహ్రెయిన్‌ మార్చురీలో మృతదేహం

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
12.jpg

ఉపాధి కోసం 17 ఏళ్ల క్రితం వెళ్లిన మెట్‌పల్లి యువకుడు 

రెండేళ్ల తర్వాత ఆచూకీ లేకుండా పోయిన వైనం

రెండు రోజుల క్రితం  వెలుగులోకొచ్చిన మరణ వార్త

మృతదేహాన్ని అప్పగించాలని  కుటుంబ సభ్యుల విజ్ఞప్తి 

మెట్‌పల్లి: సుమారు పదిహేడేళ్ల క్రితం.. ఎన్నో ఆశలతో ఆ యువకుడు ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లాడు. అతడికి అప్పటికే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఏడారి దేశానికి వలసవెళ్లాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్ల వరకు తరచూ ఫోన్‌ చేసిన అతడు.. అనంతరం ఆచూకీ లేకుండాపోయాడు. అప్పటినుంచి ప్రతిరోజు అతని ఫోన్‌ కోసం.. ఇంటికి వస్తాడనే ఆశతో గుమ్మం వైపు చూసీచూసీ కుటుంబ సభ్యులు అలసిపోయారు. ఎక్కడో బతికి ఉంటాడని, ఎప్పుడైనా ఇంటికొస్తాడని అనుకుంటున్న వారికి రెండురోజుల క్రితం అతడు సజీవంగా లేడనే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని తెలియడంతో వారంతా ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని రాంనగర్‌కు చెందిన భారతి, అశోక్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. 

పిల్లలు చిన్నతనంలో ఉండగానే వారు మరణించారు. వారి చిన్న కుమారుడు నరేశ్‌ను అతని చిన్నమ్మ శ్రీపాద లక్ష్మీ దత్తత తీసుకుంది. 2007లో అతడికి కథలాపూర్‌ మండలానికి చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలానికే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌ వెళ్లాడు. రెండేళ్ల వరకు కుటుంబసభ్యులు, బంధువులకు తరచూ ఫోన్‌ చేస్తూ ఉండేవాడు. తర్వాత చాలాకాలం పాటు ఫోన్‌ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. అక్కడ ఉంటున్న ఈ ప్రాంతం వారిని ఆరా తీసినప్పటికీ సమాచారం లభించలేదు. పాస్‌పోర్ట్‌ గడువు ముగిస్తే ఇంటికి వస్తాడని భావించారు. అయినా రాకపోవడంతో నరేశ్‌ (39) ఆచూకీ కోసం అతని భార్య కథలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఏళ్లు గడుస్తున్నా అతని ఆచూకీ దొరకకున్నా.. ఎక్కడో సజీవంగా ఉంటాడని భావిస్తున్న కుటుంబసభ్యులకు రెండు రోజుల క్రితం గుండెలను పిండేసే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే నరేశ్‌ మృతి చెందాడని, అతని మృతదేహం బహ్రెయిన్‌లోని ఓ మార్చురీలో ఉందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాస్‌పోర్టు గడువు ముగిసినప్పటికీ నరేశ్‌ అక్కడే ఉండిపోవడం.. 

మరణించిన తర్వాత అతని వివరాలు తెలియకపోవడంతో ఇంతకాలం మృతదేహాన్ని అక్కడి మార్చురీలోనే భద్రపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని వివరాలు తెలియడంతో భారత ఎంబసీ అధికారులు.. వాటిని బహిర్గతం చేయడం ద్వారా కుటుంబసభ్యులకు చేరింది. నరేశ్‌ సోదరుడు ఆనంద్‌ మృతదేహాన్ని తెప్పించి తమకు అప్పగించాలని మంగళవారం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ద్వారా సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. 17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన నరేశ్‌ కొంతకాలానికే ఆచూకీ లేకుండా పోవడం.. చివరకు అక్కడే అసువులు బాయడం స్థానికులను కలచివేసింది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Bahrain
family
migrant worker
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.