Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. హైవే పనుల్లో అలసత్వం వద్దు
ADVERTISEMENT 

హైవే పనుల్లో అలసత్వం వద్దు

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
NATIONAL-HIGHWAYS-4.jpg

భూసేకరణ, పరిహారం పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు

కలెక్టర్లు, ఆర్డీవోలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక... అక్టోబర్‌ కల్లా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాల పనులు ఒకేసారి ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐకి విజ్ఞప్తి 

పలు ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణ, పరిహారం ఖరారు, పంపిణీ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం జరగడం సరికాదని అన్నారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబర్‌ నెలాఖరుకల్లా కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో రోడ్ల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించడం ద్వారా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

సోమవారం సచివాలయంలో.. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌)తో పాటు ఇతర శాఖలు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారులకు భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రశ్నించారు. ‘కాలా’(కాంపిటెంట్‌ అథారిటీ ఫర్‌ ల్యాండ్‌ అక్విజిషన్‌) నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని వారు చెప్పారు.

అయితే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిధులు వెంటనే విడుదల చేస్తున్నామని, కలెక్టర్లు పనులు త్వరగా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం.. కలెక్టర్లు, సంబంధిత ఇతర అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్లు చెప్పగా, వారంలోపు అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించారు.  

ఎప్పటికప్పుడు కొత్త కొర్రీలెందుకు? 
ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తరభాగంపై కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం ప్రశ్నించారు. సందేహాలన్నింటినీ ఒకేసారి పంపాలని సూచించారు. ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాలను వేర్వేరు ప్రాజెక్టులుగా చూడొద్దని, రెండింటికీ ఒకే జాతీయ రహదారి నంబరు కేటాయించాలని, వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో పనులు ప్రారంభించాలని కోరారు.  

వెంటనే అనుమతులివ్వండి 
భారత్‌ ఫ్యూచర్‌ సిటీ–అమరావతి–మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గం కూడా నిర్మించాలని, బెంగళూరు–శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌–అమరావతి మధ్య రైలు మార్గం అవసరమని అన్నారు. హైదరాబాద్‌–శ్రీశైలం మార్గంలో రావిర్యాల–మన్ననూర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. హైదరాబాద్‌–మంచిర్యాల–నాగ్‌పూర్‌ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమరి్పంచిన ప్రతిపాదనలనే అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. పలు జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి అటవీ, పర్యావరణ శాఖ అభ్యంతరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.  

‘వన్య ప్రాణులు లేనిచోట కూడా ఆ చట్టం అమలు’ 
2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అట వీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్‌ సౌత్‌ రీజియన్‌ ఐజీ త్రినాథ్‌కుమార్‌ చెప్పగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. అవసరమైనచోట అడవి పెంపకానికి ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని, దీనిపై కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, భూపేందర్‌ యాదవ్‌లతో భేటీ అవుతానని తెలిపారు.

వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్య ప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇలావుండగా..తమ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్‌లో రెండు ఎకరాల భూమి కేటాయించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ముఖ్యమంత్రిని కోరగా, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Revanth Reddy
Collectors
Land acquisition
National Highways
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.