Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు సపోర్ట్‌! 
ADVERTISEMENT

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు సపోర్ట్‌! 

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
airport.jpg

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండో పౌర విమానాశ్రయంగా రూపొందనున్న వరంగల్‌ విమానాశ్రయాన్ని రీజినల్‌ కనెక్టివిటీ స్కీం (ఆర్‌సీఎస్‌)లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతానికి డొమెస్టిక్‌ (దేశీయ విమానాలు నడిచే విమానాశ్రయం) విమానాశ్రయంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

ఈ నేపథ్యంలో.. విమానాశ్రయం సిద్ధమయ్యాక ఆర్థిక అడ్డంకులను అధిగమించేందుకు ముందస్తు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం దీన్ని ‘ఉడాన్‌’పథకంలో అంతర్భాగంగా ఉన్న రీజినల్‌ కనెక్టివిటీ పథకంలోకి తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా పౌర విమానయాన శాఖకు ప్రతిపాదించింది.

ఈ పథకంలో చేర్చే విమానాశ్రయాలకు మూడేళ్లపాటు కేంద్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ అందించనుంది. ఈమేరకు ఈ స్కీంలో వరంగల్‌ విమానాశ్రయాన్ని చేర్చాలంటూ తాజాగా పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదించింది. ప్రతిపాదన తర్వాత ఇప్పుడు మరో లేఖ కూడా రాసింది.  



ఏర్పాట్లు ఎందుకంటే.. 

ప్రస్తుత అవసరాల ఆధారంగా ఏర్పాటవుతున్న చాలా విమానాశ్రయాలు, ఆ తర్వాత రకరకాల కారణాలతో కునారిల్లుతున్నాయి. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగా ఉండటంతో విమానయాన సంస్థ (ఆపరేటర్లు)లు ఆసక్తి కోల్పోతున్నాయి. వెంటనే సర్వీసులను ఉపసంహరించుకుంటున్నాయి. ఫలితంగా విమానాశ్రయాలనే మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక సమీపంలోనే మరో విమానాశ్రయం ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది.

ప్రతిపాదిత వరంగల్‌ విమానాశ్రయం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. దీంతో వరంగల్‌ విమానాశ్రయానికి డిమాండ్‌ ఎక్కువగా ఉండదన్న అభిప్రాయం గతంలో వ్యక్తమైంది. ఆ కారణంగానే ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఇంతకాలం జాప్యం జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల, భారీ టెక్స్‌టైల్‌ పార్కు, వేగంగా విస్తరిస్తున్న ఐటీ పార్కు, ఇతర సంస్థల రాకతో వరంగల్‌ పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు ముందుకొచ్చి, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ అడిగిన మేరకు భూమిని సేకరించి ఇచ్చేందుకు సిద్ధమైంది. భూమి బదలాయింపు జరిగిన ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఇటీవలే వరంగల్‌ మామూనూరులోని పాత ఎయిర్‌ స్ట్రిప్‌ అదీనంలో 750 ఎకరాల భూమి పోను, అదనంగా కావలసిన 253 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన కావడం తెలిసిందే.

గత నెలాఖరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు తీర్మానించగా, ఇప్పుడు సంబంధిత అధికారులు భూసేకరణ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వరంగల్‌ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు ఆయా సంస్థల ఆసక్తి ఏంటనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దేశీయంగా విమానాలు నడుపుతున్న సంస్థలన్నీ ముందుకొస్తే దీనికి మంచి డిమాండ్‌ ఏర్పడుతుంది. వాటిల్లో ఆ ఆసక్తి రావాలంటే ప్రభుత్వాల నుంచి వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫండింగ్‌కు వీలు కల్పిస్తూ ఉడాన్‌ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం రీజినల్‌ కనెక్టివిటీ స్కీంను ప్రారంభించడం తెలిసిందే.

ప్రయాణికులు విమానాలు ఎక్కే విషయంలో.. ఆశించిన డిమాండ్‌– ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను ఆపరేటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఆశించిన డిమాండ్‌ కనక లేకుంటే.. ఎంత నష్టం జరుగుతుందో లెక్కలేస్తారు. దాన్ని నష్టంగా భావిస్తారు. డిమాండ్‌ అంచనా– వాస్తవ డిమాండ్‌.. ఈ రెంటి మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేసేదే వయబిలిటీ గ్యాప్‌ఫండ్‌. దాన్ని ఆపరేటర్లకు అందిస్తే వారు నష్టాలతో సంబంధం లేకుండా విమానాలను కొనసాగిస్తారు.  

ఎవరెంత భరిస్తారు.. 

రీజినల్‌ కనెక్టివిటీ స్కీంలో భాగంగా అందించే వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ను కేంద్రప్రభుత్వం 80 శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భరించాల్సి ఉంటుంది. దీన్ని ఆపరేషన్‌ మొదలైన మూడేళ్లపాటు కొనసాగిస్తారు.

దీనికిందకు వరంగల్‌ విమానాశ్రయాన్ని తీసుకురావాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. త్వరలో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 విమానాశ్రయాలకు ఈ నిధి సమకూరుతున్నట్టు సమాచారం.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
warangal
airport
Regional Connectivity Scheme
aviation department
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మేడారంలో విషాదం..

మేడారంలో విషాదం..

ఇండిగో కొత్త సర్వీస్.. రూ. 49తో క్యాబ్ బుకింగ్!

ఇండిగో కొత్త సర్వీస్.. రూ. 49తో క్యాబ్ బుకింగ్!

షాకింగ్ .. విమానంపై పిడుగు కలకలం

షాకింగ్ .. విమానంపై పిడుగు కలకలం

ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి నువ్వు పీకిందేంటి... చుట్టూ కెమెరాలు పెట్టి..

ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి నువ్వు పీకిందేంటి... చుట్టూ కెమెరాలు పెట్టి..

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!

బంగ్లాదేశ్‌ ప్రధాని సలహాదారుకు షాక్‌.. ఇచ్చి పడేసిన భారత్‌

బంగ్లాదేశ్‌ ప్రధాని సలహాదారుకు షాక్‌.. ఇచ్చి పడేసిన భారత్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.