Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. బాల్యంపై బులీయింగ్‌ పడగ
ADVERTISEMENT 

బాల్యంపై బులీయింగ్‌ పడగ

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 15, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ragging.jpg

తోటి విద్యార్థుల చేతుల్లోనే పిల్లలకు వేధింపులు

క్లాస్‌లో ఒకరిని ఏకాకిని చేసి ఏడిపించే చర్యలు 

బాధిత పిల్లల్లో కుంగుబాటు, మానసిక ఒత్తిడి, ఒంటరితనం  

బులీయింగ్‌కు ఆజ్యం పోస్తున్న కొందరు టీచర్లు 

చాపకింద నీరులా విస్తరిస్తున్న విషసంస్కృతి  

పెంపకంలో లోపాలు కూడా కారణమంటున్న నిపుణులు 

పిల్లల ప్రవర్తనను నిత్యం గమనించాలని సూచనలు

‘ఐ వాంట్‌ టు డై’.. ఐదో తరగతి చదివే ఒక బాలిక తన రెండు నోట్‌బుక్స్‌లో రాసుకున్న వాక్యం ఇది. హైదరాబాద్‌లోని అల్వాల్‌ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఆ బాలిక బాగా పేరొందిన పాఠశాలలో చదువుతోంది. నోట్‌బుక్స్‌లో రామకోటి రాసినట్లుగా ‘ఐ వాంట్‌ టు డై’అంటూ రాసి పేజీలు నింపేసింది. వాటిని చూసి తల్లిదండ్రులుహడలిపోయి, మానసిక వైద్యులను సంప్రదించారు.

కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు సకాలంలో స్పందించకపోతే పాప ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని తెలిపారు. ఆ బాలిక మాత్రమే కాదు.. చాలామంది స్కూల్‌ పిల్లలు తరగతి గదిలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరిద్దరు పిల్లలను టార్గెట్‌ చేసి అనేక రకాలుగా వేధిస్తున్నారు. వారిలోని శారీరక లోపాలను ఎత్తిచూపుతూ ఏడిపిస్తారు. మానసిక వైద్య పరిభాషలో ‘బులీయింగ్‌’గా పిలిచే ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాలేజీల్లో ర్యాగింగ్‌ తరహాలో స్కూళ్లలో బులీయింగ్‌ భూతంపిల్లలను వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యూనిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ విష సంస్కృతి 1.3 శాతం ఉంటే, హైదరాబాద్‌ తదితర మెట్రో నగరాల్లో 35 నుంచి 37 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు.     – సాక్షి, హైదరాబాద్‌

ఏమిటీ బులీయింగ్‌?
ఐ వాంట్‌ టు డై అని రాసిన బాలిక తోటి విద్యార్థుల కంటే కాస్త లావుగా ఉంటుంది. దాంతో తరగతి గదిలో సహ విద్యార్థులు మొదట్లో ఆటపట్టించేవారు. క్రమంగా అంతా ఒక్కటై ఆమెను ఏకాకిని చేసి ఏడిపించడం మొదలుపెట్టారు. ఈ బులీయింగ్‌ అంతటితో ఆగలేదు. బాలిక చుట్టూ చేరి జడలు పట్టుకొని లాగుతూ ‘పిగ్‌టేల్‌’అంటూ ఏడిపించేవారు. ఈ వేధింపులపై క్లాస్‌ టీచర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఆ బాలికనే తిట్టింది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఫిర్యాదును పట్టించుకోలేదు.

దీంతో ఆ బాలిక డిప్రెషన్‌లోకి వెళ్లింది. పైకి చూడ్డానికి ఇది సాధారణంగా ఏడిపించడం (బులీయింగ్‌)గానే కనిపిస్తుంది. కానీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో కొందరు టీచర్లే బులీయింగ్‌కు ఆజ్యం పోస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల రంగు, రూపు, ఆకృతి, నడక వంటి శారీరక అంశాలను లక్ష్యంగా చేసుకొని ‘బాడీషెమింగ్‌’కు పాల్పడుతున్నారు. ఏడేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల టీన్స్‌ వరకు బులీయింగ్‌ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఆధిపత్య పెంపకం
తరగతిలో ఉన్న పిల్లలంతా ఒకేవిధమైన బులీయింగ్‌ స్వభావాన్ని కలిగి ఉండరు. వారిలో ఒక్కరో, ఇద్దరో కలిసి మిగతా వాళ్లందరినీ ఒక గ్రూపుగా సంఘటితం చేస్తారు. టార్గెట్‌ చేసిన బాలిక లేదా బాలుడిని ఏకాకిని చేస్తారు. మిగతా పిల్లలు తమ ప్రమేయం లేకుండానే ఆ జట్టులో చేరి ఏడిపిస్తుంటారు. తరగతిలో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఆ ఒకరిద్దరు పిల్లల ప్రవర్తన మిగతా పిల్లలను ప్రభావితం చేస్తుంది.

తోటివారికంటే తామే గొప్పవాళ్లమనే భావన పిల్లల్లో కలగడానికి వారి తల్లిదండ్రుల ఆధిపత్య పెంపకమే (అథారిటేరియన్‌ పేరెంటింగ్‌) కారణమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి గురించి ఉపాధ్యాయులు, స్కూల్‌ యాజమాన్యం, తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. బులీయింగ్‌ను అరికట్టాల్సిన టీచర్లే బాధితులను మరింత ఏకాకులను చేస్తున్నారు.

స్కూల్‌ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందనే విషయాన్ని తల్లిదండ్రులు కచి్చతంగా ఆరా తీయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బులీయింగ్‌కు గురయ్యే పిల్లలు సరిగ్గా తినకపోవడం, మాట్లాడకుండా ఉండిపోవడం, ఇంట్లోనూ ఒంటరిగా గడపడం వంటి లక్షణాలతో బాధపడుతారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.  

కలిసికట్టుగా ఎదుర్కోవాలి 
పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా డామినేటింగ్‌ కల్చర్‌లో పిల్లలను పెంచుతారు. దీంతో సహజంగానే ఆ పిల్లలకు అదే సంస్కృతి అలవడుతుంది. తాము అలా ఏడిపించడం వల్ల తోటి విద్యార్థి మనస్సును గాయపరుస్తున్నామనే భావన ఆ పిల్లల్లో ఏ మాత్రం కనిపించదు. ఒక సర్వే ప్రకారం తరగతి గదిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక విధమైన బులీయింగ్‌కు గురవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్‌ యాజమాన్యం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. బులీయింగ్‌ లక్షణాలు ఏ రూపంలో కనిపించినా అరికట్టాలి. లేకపోతే పిల్లల భావి జీవితాన్ని ఇది కబళిస్తుంది.      – డాక్టర్‌ సంహిత, మానసిక వైద్యనిపుణులు, సికింద్రాబాద్‌.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Students
children
ragging
Telangana
schools
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.