సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 35వేల మంది పోలీస్ సిబ్బందిని నిమజ్జన బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోనే 25వేల మంది విధుల్లో ఉంటారని తెలిపా రు.
నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయంలో, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో .. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.