Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. డేంజర్‌లో మంజీర!
ADVERTISEMENT 

డేంజర్‌లో మంజీర!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
manjeera.jpg

మేడిగడ్డ తరహాలో కొట్టుకుపోయిన బరాజ్‌ అప్రాన్‌

తేల్చిన స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ నివేదిక

మరమ్మతులు లేక దెబ్బతిన్న గేట్లు, మట్టి కట్టలు

డ్యామ్‌ పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోందన్న నిపుణులు

సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనానికి సిఫారసు

సాక్షి, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు రోజూ 100 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేసే మంజీర బరాజ్‌ తీవ్ర ప్రమాదంలో ఉంది. మేడిగడ్డ బరాజ్‌ తరహాలో..మంజీర బరాజ్‌ నుంచి విడుదలైన వరద ఉధృతికి డ్యామ్‌ దిగువన రక్షణగా ఏర్పాటు చేసిన అప్రాన్‌ కొట్టుకుపోయింది. అప్రాన్‌కి సంబంధించిన కాంక్రీట్‌ కొట్టుకుపోవడంతో బరాజ్‌ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయి. మిగిలి ఉన్న అప్రాన్‌ భాగం సైతం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చు అన్నట్టు బలహీనంగా ఉంది.

అడ్డగోలుగా తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో బరాజ్‌ మట్టి కట్టలు బలహీనమయ్యాయి. ఏళ్ల తరబడిగా మరమ్మతులు లేకపోవడంతో గేట్లతో పాటు స్పిల్‌వేలోని కొంత భాగం కూడా దెబ్బతింది. బరాజ్‌కు తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే భవిష్యత్తులో తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్డీఎస్‌ఓ) తేల్చి చెప్పింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌–2021 ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎస్‌ఓ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం గత మార్చి 22న బరాజ్‌ను పరిశీలించి ఈ మేరకు ఓ నివేదికను సమర్పించింది. 

కాళేశ్వరం బరాజ్‌ల తరహాలో..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు దిగువన రక్షణగా ఉన్న అప్రాన్‌ వరద ధాటికి కొట్టుకుపోగా, ఆ తర్వాత కాలంలో మేడిగడ్డ బరాజ్‌ కుంగిపోయింది. మిగిలిన రెండు బరాజ్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే తరహాలో మంజీర బరాజ్‌ అప్రాన్‌ సైతం కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘మంజీర బరాజ్‌ నుంచి విడుదలయ్యే వరద ఉధృతి దిగువ భాగంలో నిరంతరం బరాజ్‌కు నష్టం కలిగించనుంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. లేనిపక్షంలో కోత క్రమంగా డ్యామ్‌ వరకు విస్తరించి దాని భద్రతకే ముప్పుగా పరిణమించనుంది..’ అని నివేదికలో ఎస్డీఎస్‌ఓ పేర్కొంది. 

మట్టికట్టలపై అడవిలా తుమ్మ చెట్లు
బరాజ్‌ మట్టికట్టలపై పెద్ద మొత్తంలో తుమ్మ చెట్లు పెరిగి వాటి దృఢత్వాన్ని బలహీనపరుస్తున్నాయని ఎస్డీఎస్‌ఓ తేల్చింది. అడవి తరహాలో తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో 1.5 కి.మీ మేర కట్టలను పరిశీలించకపోయినట్టు పేర్కొంది. తుమ్మ చెట్లతో డ్యామ్‌ రివర్‌మెంట్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది.  

బరాజ్‌ పియర్లకు పగుళ్లు..
మంజీర బరాజ్‌ పియర్లు దూరం నుంచి దృఢంగానే కనిపిస్తుండగా, సూక్ష్మంగా పరిశీలించి చూస్తే వాటికి పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్‌ఓ పరిశీలనలో బయటపడింది. తట్టుకునే సామర్థ్యానికి మించిన వరద ఒత్తిడిని ఎదుర్కోవాల్సిరావడంతోనే ఈ పగుళ్లు వచ్చాయని తేల్చింది. మంజీర రాతి ఆనకట్ట కావడంతో స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది. బరాజ్‌ తీవ్రంగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది అని అభిప్రాయపడింది. 

తాగునీటి అవసరాల కోసం మంజీర బరాజ్‌లో ఏడాది పొడవునా నీళ్లను నిల్వ చేసి ఉంచుతుండడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో బరాజ్‌ను పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపించాలని సిఫారసు చేసింది. అత్యవసర కార్యాచరణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ ప్రణాళిక, బరాజ్‌తో ఉండనున్న ముప్పుపై అధ్యయనం, బరాజ్‌ భద్రతపై సమగ్ర అధ్యయనాన్ని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో జరిపించాలని కోరింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Manjeera Project
Dam Safety
Report
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.