Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. గరిష్ట పరిహారం దక్కేలా చూడాలి
ADVERTISEMENT 

గరిష్ట పరిహారం దక్కేలా చూడాలి

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 11, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
revamth.jpg

భూసేకరణలో రైతుల పట్ల మానవీయకోణంతో వ్యవహరించాలి

రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడి ఒప్పించండి 

రీజినల్‌ రింగురోడ్డు భూసేకరణలో వేగం పెంచండి 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులకు భూములిచ్చిన రైతుల విషయంలో మానవీయకోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం వచ్చే గరిష్ట పరిహారం రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి ఎదు­రవు­తున్న సమస్యలు పరిష్కరించాలని కోరు­తూ ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్‌హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) అధికారులు మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఆయా అంశాలను కొలిక్కి తెచ్చేందుకు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. 

భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని అధికారులను సీఎం ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్‌ ధరలు ఎక్కువగా ఉండటంతో భూము­లు ఇచ్చేందుకు రైతులు ముందుకురావడం లేదని కలెక్టర్లు ఆయన దృష్టికి తెచ్చారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను శాశ్వతంగా కోల్పోతున్నప్పుడు రైతుల్లో ఆవేదన ఉంటుందని, దానిని అధికారులు గుర్తించాలన్నారు. రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్‌రింగురోడ్డు దక్షిణభాగం, ఉత్తరభాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే ఎన్‌హెచ్‌ నంబర్‌ కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపారి్టయేట్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం భూసేకరణలో ఉన్న ఆటంకాలపై ఆయన ప్రశ్నించారు. అలైన్‌మెంట్‌ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దీంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే తెలిపారు. 

స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని  సూచించారు. అలాగే ఆర్మూర్‌–జగిత్యాల–మంచిర్యాల, విజయవాడ–నాగ్‌పూర్‌ కారిడార్‌లకు సంబంధించి అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూము­లు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్‌–మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


రెండునెలల్లో హైదరాబాద్‌–విజయవాడ విస్తరణ పనులు  
హైదరాబాద్‌–విజయవాడ జాతీయరహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్‌హెæచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌చౌదరిని కోరారు. రెండునెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. 

సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్‌ రాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్‌ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్‌ డోబ్రియల్, ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్‌ సెక్రటరీ హరీ‹Ù, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.  

సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయాలి: భట్టి 
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నాగపూర్‌–అమరావతి జాతీయ రహదారి నిర్మాణంలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయం నుంచి సమీక్షించగా, ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ పాల్గొన్నారు. 

జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్‌ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన సమీక్షలో చర్చకు వచ్చి0ది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌హెæచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌చౌదరి తెలిపారు. గ్రావెల్‌ రహదారి నిర్మించడం వల్ల రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్‌లో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. 

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాగపూర్‌–అమరావతి రహదారిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలని, ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఇవ్వాలని కోరారు. తల్లాడ–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Regional Ring Road
Land acquisition
Revanth Reddy
Telangana
Compensation
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.