Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఆటల్లో మేటి.. కష్టాలు కోటి
ADVERTISEMENT 

ఆటల్లో మేటి.. కష్టాలు కోటి

Telangana Sakshi User Sakshi Sakshi Time May 26, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
swomy.jpg

బేస్‌బాల్‌ ఆటలో అంతర్జాతీయ స్థాయికి.. 

పట్టుదలతో సాగుతున్న పేదింటి ‘సౌమ్య’ం 

చైనా వెళ్లేందుకు డబ్బుల్లేక దీనంగా దిక్కులు 

సిద్దిపేట జిల్లా క్రీడాకారిణి అవస్థలు 

సాక్షి, సిద్దిపేట: ఆటలపై మక్కువ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం పాతాళానికి లాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండటం జంగాపల్లికి చెందిన బేస్‌బాల్‌ క్రీడాకారిణి పోసానిపల్లి సౌమ్యారెడ్డి పరిస్థితి ఇది. చైనాలో నవంబర్‌లో జరిగే బేస్‌బాల్‌ మహిళా ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆమె చోటు సంపాదించింది. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్‌ క్వాలిఫైయింగ్‌ పోటీలలో భారత జట్టు సిల్వర్‌ మెడల్‌ సాధించడంలో సౌమ్యారెడ్డి కీలకపాత్ర పోషించింది. 

చిన్నప్పటి నుంచి ఆటలే లోకం 
సౌమ్యారెడ్డి తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, కవిత. వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సౌమ్యారెడ్డి, చిన్న కూతురు మాధురి. సౌమ్య క్రీడల్లో రాణిస్తుండటంతో మంచి శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రతాప్‌రెడ్డి ఇళ్లకు పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సౌమ్యకు చిన్నప్పటి నుంచి ఆటలే లోకం. 8వ తరగతి చదువుతున్నప్పుడే త్రో బాల్‌ నేషనల్స్‌ ఆడింది. సాఫ్ట్‌బాల్, క్రికెట్, బేస్‌బాల్‌ ఆటలో సైతం రాణిస్తోంది. హైదరాబాద్‌ పీజీ గ్రౌండ్‌లో బేస్‌బాల్‌ కోచింగ్‌ తీసుకుంది. ఇప్పటివరకు బేస్‌బాల్‌లో 12 నేషనల్స్‌ ఆడింది.

అండర్‌ –19 క్రికెట్‌తోపాటు సాఫ్ట్‌బాల్‌ 15 నేషనల్స్‌లలో పాల్గొంది. నవంబర్‌లో చైనాలో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఇటీవల ఎంపికైంది. అయితే, పేద కుటుంబం కావటంతో ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి. పోటీలలో పాల్గొనేందుకు నెల రోజుల ముందే చైనాకు చేరుకుని ప్రాక్టీస్‌ చేయాలి. ప్రయాణం ఖర్చులతో పాటు అక్కడ నెలపాటు ఉండేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు అవసరం. అంతమొత్తం భరించే స్తోమత ఆ కుటుంబానికి లేకపోవటంతో సౌమ్య నిరాశలో కూరుకుపోయారు.

ఇండియాకు మెడల్స్‌ తీసుకొస్తా 
ఇండియా తరఫున ఆడి మెడల్స్‌ తీసుకువస్తా. చైనాలో జరిగే ఆసియా కప్‌ను గెలుపొందేందుకు కృషి చేస్తా. చైనాకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్‌లో బేస్‌బాల్‌ శిక్షణ, ప్రాక్టీస్‌ కోసం రోజు 14 కిలోమీటర్లు సైకిల్‌ మీద వెళ్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న బేస్‌బాల్‌ అసోసియేషన్‌¯ ప్రధాన కార్యదర్శి శ్వేత, కోచ్‌ చిన్న, ఖాదర్, షానవాజ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.  
– సౌమ్యారెడ్డి, బేస్‌బాల్‌ క్రీడాకారిణి. 

బ్యాంకాక్‌కు బంగారం కుదువపెట్టి పంపించాం 
బ్యాంకాక్‌ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు రూ.3.5 లక్షలు ఖర్చు అయింది. మా బిడ్డ లక్ష్యంకు చేరుకునేందుకు మా దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పటికీ బంగారం బ్యాంకులో కుదువపెట్టి ఆ డబ్బుతో పంపించాము. కొంత అప్పు కూడా చేశాం. నవంబర్‌లో చైనా వెళ్లేందుకు రూ.5 లక్షలు అవుతుందని తెలిసింది. అంత ఖర్చు భరించే స్తోమత మాకు లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలి. 
– సౌమ్య తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, కవిత

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Baseball
silver medal
Telangana
Siddipet District News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.