Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సర్పంచ్‌ బరిలో సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని
ADVERTISEMENT 

సర్పంచ్‌ బరిలో సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని

Telangana Sakshi User Sakshi Sakshi Time Dec 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
5455.jpg

సిద్ధిపేట జిల్లా: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా గ్రామ సర్పంచ్ పదవికి రైతులు, స్థానిక నాయకులు పోటీ చేస్తుంటే, ఈసారి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని బరిలోకి దిగడం గ్రామంలో చర్చనీయాంశమైంది. జిల్లెలగడ్డ పంచాయతీకి చెందిన లావుడ్య రవీందర్‌ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నడుపుతున్నారు. బీటెక్, ఎంబీఏ చదివిన రవీందర్‌.. కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగం చేశారు. హైదరాబాద్ వచ్చి సొంతంగా కంపెనీ పెట్టారు.

ప్రస్తుతం కంపెనీ బాధ్యతలు చూస్తోన్న రవీందర్ సర్పంచ్ బరిలో నిలవాలని భావించారు. జిల్లెలగడ్డ గ్రామ సర్పంచ్ పదవిని.. ఈ సారి ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఉన్నత చదువులు చదివి.. విదేశాల్లో కొలువు చేసి.. ఇప్పుడు సొంతంగా కంపెనీ నడుపుతున్న లావుడ్య రవీందర్.. సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రవీందర్ శుక్రవారం తన నామినేషన్‌ను డప్పుల చప్పుళ్లతో, కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి దాఖలు చేశారు. ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేసి, ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం రాజకీయ రంగంలోకి రావడం గ్రామస్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి సర్పంచ్‌గా వస్తే గ్రామానికి కొత్త ఆలోచనలు, అభివృద్ధి అవకాశాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడే కండువాలు కప్పుతాం..
హుస్నాబాద్‌: సర్పంచ్‌ ఎన్నికల్లో ఎవరు గెలిచి వస్తే వారే మావాళ్లు.. అధికార పార్టీ కండువ కప్పుకోవాలని వెళ్లిన అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ పెడుతున్న షరతులివి. ‘గెలిచి రండి.. అప్పుడే కండువాలు కప్పుతాం’ అని కాంగ్రెస్‌ అధిష్టానం చెబుతోంది. అధికార పార్టీ మద్దతు ఉంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. 

మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్‌ కేంద్రాల వద్ద పోటీదారుల సందడి నెలకొంది. హుస్నాబాద్‌ మండలంలో 17 జీపీలు, 140 వార్డులు, అక్కన్నపేట మండలంలో 38 జీపీలు, 306 వార్డులు, కోహెడ మండలంలో 27 జీపీలు, 244 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. పోటీదారులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు సర్పంచ్‌ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారే ప్యానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం వర్గాలుగా విడిపోయింది. నచ్చిన వారికి  మద్దతు తెలుపుతున్నారు. ఎవరు అధికార పార్టీ వారో తెలియక కార్యకర్తలు అయోమయోంలో పడుతున్నారు. ఎవరు గెలిచినా మా వద్దకే వస్తారని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. పలాన వ్యక్తి మా అభ్యర్థి అని ప్రకటిస్తే మిగతా వారు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అధికార పార్టీ కండువా కప్పడానికి సమ్మతించడం లేదు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
software company
sarpanch elections
Contest
Telangana
Telangana Local Body Elections 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.